»Revanth Reddy Challenge Etela Rajender Over Brs Bribe Allegations
Revanth Reddy : ఈటెల కు రేవంత్ సవాల్.. రేపు సాయంత్రం ఆరింటికి రా..
బీఆర్ఎస్(BRS) నుంచి డబ్బులు తీసుకున్నారన్న ఈటల ఆరోపణలపై రేవంత్ మండిపడ్డారు. రేపు సాయంత్రం 6 గంటలకు భాగ్యలక్ష్మి టెంపుల్ కి తాను వస్తానని, ఈటలను రమ్మన్నారు. బీఆర్ఎస్ నుంచి డబ్బులు తీసుకోలేదని తాను ప్రమాణం చేస్తానని.. ఈటల రాజేందర్ ను కూడా చేయాలన్నారు.
Revanth Reddy : మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్(Etala Rajendar) కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. బీఆర్ఎస్(BRS) నుంచి డబ్బులు తీసుకున్నారన్న ఈటల ఆరోపణలపై రేవంత్ మండిపడ్డారు. రేపు సాయంత్రం 6 గంటలకు భాగ్యలక్ష్మి టెంపుల్ కి తాను వస్తానని, ఈటలను రమ్మన్నారు. బీఆర్ఎస్ నుంచి డబ్బులు తీసుకోలేదని తాను ప్రమాణం చేస్తానని.. ఈటల రాజేందర్ ను కూడా చేయాలన్నారు. ఆరు నెలలు అయితే ఎన్నికల్లో ఓడించి రాష్ట్రమే గుంజుకుంటాం..కేసీఆర్(KCR) దగ్గర రూ. 25 కోట్లు తీసుకుంటమా?. ఈటల విచక్షణ మరచిపోయి మాట్లాడవద్దని సూచించారు. తన పైన ఈటల చేసిన ఆరోపణకు తెలంగాణ సమాజానికి స్పష్టత ఇవ్వదలుచుకున్నానని రేవంత్ పేర్కొన్నారు. రేపు సాయంత్రం 6 గంటలకు చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం దగ్గర సిద్దంగా ఉండు. అగ్నిపరీక్షకు నేను సిద్ధంగా ఉన్నా. ఈటల తాత్కాలిక దిగజారుడు రాజకీయాలు చేయడం దుర్మార్గం అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
అంతకుముందు ఈటల రాజేందర్ మీడియా(Media)తో కాంగ్రెస్(Congress), బీఆర్ఎస్ వేర్వేరు కాదన్నారు. ఎన్నికల ముందైనా.. తర్వాతైనా రెండు పార్టీలు కలిసే ఉంటాయని ఈటల ఆరోపించారు. మునుగోడు(Munugodu) ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు సీఎం కేసీఆర్ 25కోట్లు పంపించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈటల రాజేందర్ దిగజారి మాట్లాడొద్ధని రేవంత్ సూచించారు. ఇది తన దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. భాగ్యలక్ష్మి టెంపుల్ వద్దు అంటే తడి బట్టలతో ఏ గుడి(Temple)కి అయినా వస్తానని రేవంత్ అన్నారు. తను రావాలన్నారు. ఈ సందర్భంలోనే రేవంత్ దేవుడి మీద ఒట్టేసి చెప్తా.. మునుగోడు ఎన్నికల్లో ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి పార్టీలో ఉన్న బీసీ(BC), ఎస్సీ(SC), ఎస్టీ(St) కులాల నాయకులే డబ్బులు ఇచ్చారన్నారు. తానే అందరినీ పిలిచి సాయం అడిగానన్నారు. ఉత్తమ్.. భట్టి సమక్షంలోనే సాయం ఆడిగినట్లు వివరించారు.