మలయాళ సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ రాజేష్ మాస్టర్(Choreographer Rajesh Master) ఆత్మహత్య(Suicide) చేసుకున్నారు. అయితే ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. రాజేష్ మాస్టర్ ఆత్మహత్య సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు(Police case) నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దక్షిణ భారత సినీ పరిశ్రమలో రాజేష్ మాస్టర్ (Rajesh Master)కు మంచి గుర్తింపు ఉంది. ఆయన కొరియోగ్రఫీలో మంచి హిట్ సాంగ్స్ తెరకెక్కాయి.
సౌత్ సినీ ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్‌గా రాజేష్ మాస్టర్(Choreographer Rajesh Master) చాలా సినిమాల్లో పనిచేశారు. రాజేష్ మాస్టర్ మరణ వార్తపై పలువురు సంతాపం వ్యక్తి చేస్తున్నారు. ఆయన మరణ వార్త తనను ఎంతగానో బాధించిందని ప్రముఖ నటి బీనా ఆంటోనీ ఆవేదన వ్యక్తం చేశారు. మలయాళ ఇండస్ట్రీలోని పలువురు సినీ సెలబ్రిటీలు రాజేష్ మాస్టర్ మరణ వార్త విని సంతాపం తెలుపుతున్నారు. కొరియోగ్రాఫర్ ఆత్మహత్య(Choreographer Rajesh Master) తో మళయాళ సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. పోలీసులు ఆత్మహత్యకు గల కారణాన్ని తెలుసుకునే పనిలో పడ్డారు. త్వరలో కేసుకు సంబంధించి పూర్తి వివరాలను వెల్లడిస్తామని తెలిపారు.