TG: 2024-25 వర్షాకాలం మార్కెటింగ్ సీజన్ కార్యాచరణపై మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్, అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు పాల్గొన్నారు. ‘ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. 7,139 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. ఖరీఫ్ సీజన్లో 60 లక్షల 39 వేల ఎకరాల్లో వరి పంట సాగులో ఉంది’ అని మంత్రి పేర్కొన్నారు.