తిరుమల లడ్డూ కల్తీపై కేంద్రం సీరియస్ అయింది. నెయ్యి సరఫరా చేసిన తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీ సంస్థకు FSSAI నోటీసులు ఇచ్చింది. తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారం తెలుగు రాష్ట్రాలతోపాటు యావత్ దేశంలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. లడ్డూ తయారీకి జంతువుల కొవ్వును వాడటం దారుణమని భక్తులు కూడా మండిపడుతున్నారు. తిరుమల లడ్డూ పవిత్రతను దెబ్బతీసిన వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.