రౌడీ హీరో విజయ్ దేవరకొండ(vijay deverakonda) నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటనే ఆసక్తి అందరిలోను ఉంది. లైగర్ సెట్స్ పై ఉన్నప్పుడే.. పూరితో జనగణమన కమిట్ అయ్యాడు విజయ్. అలాగే శివ నిర్వాణతో ‘ఖుషి’ అనే సినిమా మొదలు పెట్టాడు. అయితే ప్రస్తుతం ఖుషి షూటింగ్ స్టేజ్‌లో ఉండగా.. లైగర్ దెబ్బకు ‘జేజిఎం’ ఆగిపోయింది. అందుకే రౌడీ వాట్ నెక్ట్స్ అనేది ఇంట్రెస్టింగ్గా మారింది. ఈ క్రమంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కథతో.. మేజర్ డైరెక్టర్ శశికిరణ్ తిక్కతో ఓ సినిమా చేయబోతున్నాడనే టాక్ నడుస్తోంది.
అలాగే జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడనే వార్తలొస్తున్నాయి. వాస్తవానికైతే.. హిందీ జెర్సీ తర్వాత రామ్ చరణ్‌తో సినిమా చేయాల్సి ఉంది గౌతమ్. కానీ ఫైనల్‌గా ఈ టాలెంటెడ్ డైరెక్టర్ చరణ్‌ను ఇంప్రెస్ చేయలేకపోయాడని.. అందుకే చరణ్ ఈ ప్రాజెక్ట్‌ను హోల్డ్‌లో పెట్టాడని ఇండస్ట్రీ టాక్. దాంతో విజయ్ దేవరకొండకు గౌతమ్ తిన్ననూరి(gautam tinnanuri) కథ చెప్పడం.. ఆయన కూడా ఓకే చెప్పడం జరిగిపోయిందని తెలుస్తోంది.
ఇక ఈ ప్రాజెక్ట్‌ని నిర్మాత ఎన్. వి.ప్రసాద్ పాన్ ఇండియా స్థాయిలో భారీగా నిర్మించబోతున్నారట. ఏకంగా 100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తోంది. ఇదే నిజమైతే.. రౌడీ కెరీర్లో ఇదే హైయెస్ట్ బడ్జెట్ మూవీ అని చెప్పొచ్చు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతోందట. అయితే విజయ్ కోసం నిజంగానే అంత బడ్జెట్ పెట్టబోతున్నారా.. అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.. కాబట్టి ఇప్పుడే ఏం చెప్పలేం.