»Who Is Going To Get Married For The Second Time Is That Star A Hero
Rajinikanth’s Daughter: ఆ స్టార్ హీరోను రెండో పెళ్లి చేసుకోబోతున్న రజనీ కాంత్ కూతురు
కోలీవుడ్ , బాలీవుడ్ , టాలీవుడ్ ఇలా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా విడాకుల వ్యవహారమే సందడి చేస్తోంది. నటీనటులు చాలా ప్రేమించి పెళ్లి చేసుకుని కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వల్ల విడాకులు తీసుకుని పెద్ద తప్పు చేస్తున్నారు.
Rajinikanth’s Daughter: కోలీవుడ్ , బాలీవుడ్ , టాలీవుడ్ ఇలా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా విడాకుల వ్యవహారమే సందడి చేస్తోంది. నటీనటులు చాలా ప్రేమించి పెళ్లి చేసుకుని కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వల్ల విడాకులు తీసుకుని పెద్ద తప్పు చేస్తున్నారు. ఒకరినొకరు అర్థం చేసుకోకుండా రాజీ పడకుండా వెంటనే విడాకుల వైపు మగ్గుచూపుతున్నారు. అంతగా ప్రేమించుకుని.. పెళ్లి చేసుకోని ఇలా చేయడం ఏంటో అభిమానులకు అసలు అర్థం కావడం లేదు.. ఇలా ఉన్న ఫళంగా విడిపోయేందుకు ఎందుకు పెళ్లి చేసుకున్నారో అని ఆలోచన చేస్తున్నారు.
కొన్ని నెలల క్రితం తమిళ హీరో ధనుష్, ఐశ్వర్య కూడా విడాకులు తీసుకున్నారు. ఐశ్వర్య.. రజనీకాంత్ కూతురు అన్న సంగతి తెలిసిందే. వారిద్దరూ పెళ్లి చేసుకుని కొన్నేళ్లు కాపురం చేసి విడాకులు తీసుకున్నారు. అంతేకాదు వీరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. అయితే ప్రస్తుతం ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకున్నారో అర్థం కావడం లేదు. ధనుష్ కెరీర్ ప్రారంభంలో రజనీకాంత్ బ్రాండ్ చాలా బాగా వచ్చింది. ఇద్దరూ ఎప్పుడూ మామ అల్లుడిలా కనిపించలేదు.. తండ్రీకొడుకులలా కనిపించారు. ధనుష్‌ను తన కూతురును కలపాలని రజనీకాంత్ చాలా ప్రయత్నించాడు కానీ విఫలమయ్యాడు. తాజాగా ఐశ్వర్య రజనీకాంత్ గురించిన ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఐశ్వర్య రజనీకాంత్ కోలీవుడ్ యంగ్ హీరోతో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఐశ్వర్య ఇద్దరు పిల్లలకు తల్లి అయినప్పటికీ ఆమె మళ్లీ పెళ్లి చేసుకోనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఐశ్వర్య ప్రేమించి పెళ్లి చేసుకుంటే రజనీకాంత్ అభిమానులు పాజిటివ్ గా ఆలోచిస్తారా? లేదో చూడాలి.