చాలా మంది అతిగా మటన్ లేదా చికెన్ తింటూ ఉంటారు.
మాంసాహారం వల్ల శరీరానికి పోషకాలు లభిస్తాయి. కానీ అతిగా తింటే మాత్రం అనర్ధాలు తప్పవు.
నాన్ వెజ్ ఎక్కువగా తీసుకుంటే శరీరం వ్యాధులకు నిలయంగా మారుతుంది.
మాంసాహారం వల్లే ఎక్కువ మంది క్యాన్సర్, గుండె జబ్బుల బారిన పడుతున్నారని పరిశోధనల్లో తేలింది.
మాంసాహారం ఎక్కువగా తింటే శరీరంలో కొలెస్ట్రాల్ విపరీతంగా పెరుగుతుంది.
మాంసాహారాన్ని రోజూ తినేవారు విపరీతంగా బరువు పెరుగుతారు.
మాంసం ఎక్కువగా తినడం వల్ల పొట్ట సంబంధిత సమస్యలు వస్తాయి.