పరీక్ష అంటే పకడ్బందీగా నిర్వహిస్తారు. ఇంటర్నల్ అయినా సరే.. ఆదిలాబాద్ గవర్నమెంట్ సైన్స్ డిగ్రీ కాలేజీలో మాత్రం అలా కనిపించలేదు. నిన్న విద్యార్థులు వాట్సాప్ చూస్తూ పరీక్ష రాస్తూ కనిపించారు. 20 మార్కుల ఇంటర్నల్ పరీక్షను ఇలా నిర్వహించారు. అదేమని అడిగితే ప్రింటర్ పాడయిందని చెబుతున్నారు. పరీక్ష ఉందని తెలిసి.. ముందే రిపేర్ ఉంటే చూపించికోవచ్చు కదా అనే ప్రశ్న వస్తోంది. ఇదే విషయం ప్రిన్సిల్ జగ్ రాం అతర్బేదిని అడిగితే వీలుపడలేదని సమాధానం ఇచ్చారు.
కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఇంటర్నల్ పరీక్షలు జరుగుతున్నాయి. ఆదిలాబాద్ సైన్స్ కాలేజీలో ఫ్రింటర్ వర్క్ చేయడం లేదట. దీంతో విద్యార్థుల వాట్సాప్ నంబర్లకు కొశ్చన్ పేపర్‌ను పంపించారు. మొబైల్ దగ్గర ఉంటే కాపీ కొడతారు కదా అని ప్రిన్సిపల్‌ను అడిగితే అదేం లేదని చెబుతున్నారు. తరగతి గదిలో కాకుండా.. ఆరుబయట కూర్చోబెట్టామని తెలిపారు. విద్యార్థులు పరీక్ష రాసే సమయంలో పకడ్బందీ చర్యలు తీసుకున్నామని చెప్పారు. నిజానికి కాపీ కొట్టేందుకు ఆస్కారం ఉంది. ఈ అంశంపై ఉన్నత విద్యాశాఖ స్పందించాల్సి ఉంది.