Sitara:ఈ రోజు ఫాదర్స్ డే(fathers day). తండ్రీకొడుకులు-కూతుళ్లు ప్రపంచవ్యాప్తంగా ఫాదర్స్ డేని ఘనంగా జరుపుకుంటున్నారు. ఇదే క్రమంలో సినీ తారలు కూడా తమ తండ్రులతో ఉన్న అనుబంధాన్ని సోషల్ మీడియా(socail media) ద్వారా తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో ఘట్టమనేని వారసురాలు సితార తన తండ్రి మహేష్ బాబు(Mahesh babu)కు ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేసింది.
తాజాగా మహేష్ బాబు కూతురు సితార(Sitara) ఘట్టమనేని తన తండ్రితో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మహేష్ కు ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేసింది. ‘మై సూపర్ డాడ్.. మై చీర్ లీడర్’ అంటూ నాన్నకు ఫాదర్స్ డే శుభాకాంక్షలు చెప్పుకు వచ్చింది. ఈ క్రమంలో సితార పెట్టిన పోస్ట్ క్షణాల్లో వైరల్గా మారింది.
అంతేకాదు సితార వాళ్ల నాన్నతో ఎంత అల్లరిగా ప్రవర్తిస్తుందో.. వాళ్ల నాన్న తన అల్లరిని ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో.. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా తన కూతురు, కొడుకు చేతుల్లో మహేష్ బాబు సాధారణ తండ్రిగా మారిపోయాడో ఈ ఫొటోల్లో చూడొచ్చు.