సీఎం కేసీఆర్ పై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో 30 సీట్లను సీఎం కేసీఆరే నిర్ణయిస్తారని అన్నారు. మోదీ హైదరాబాద్ కు వస్తే కేసీఆర్ కు వణుకు పుడుతుందన్నారు.
తెలంగాణ(Telangana) రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్(CM KCR) అప్పులపాలు చేశారని బీజేపీ(BJP) రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) అన్నారు. కరీంనగర్లో మహాజన్ సంపర్క్ అభియాన్లో భాగంగా ఆదివారం ‘టిఫిన్ బైటక్’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ కార్యకర్తలతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ పాలనపై, రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలపై ఆయన ప్రశ్నించారు.
కేసీఆర్(CM KCR) సర్కార్ చేపడుతున్న కొన్ని మంచి పథకాలను తామూ కొనసాగిస్తామని, ధరణి మంచి పథకమే అయినప్పటికీ అది కేసీఆర్ కుటుంబానికి ఆసరాగా మారిందని బండి సంజయ్ ఆరోపించారు. అభివృద్ధి నిధులకు సంబంధించి సీఎం కేసీఆర్ చర్చకు వస్తారా అని ప్రశ్నించారు. ధరణిలో మార్పులు చేసి తమ ప్రభుత్వం ఏర్పడ్డాక కొనసాగిస్తామన్నారు.
ప్రధాని మోదీ(PM Modi) హైదరాబాద్కు వస్తే కేసీఆర్(CM KCR)కు వణుకు పుడుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ(Congress Party)లో 30 సీట్లను సీఎం కేసీఆరే నిర్ణయిస్తారని, ఆ తర్వాత కాంగ్రెస్లో గెలిచిన వారు బీఆర్ఎస్(BRS)కు చేరుకుంటారని తెలిపారు. బీజేపీ(BJP) నుంచి ఎవరూ బయటకు వెళ్లరని, ప్రజలకు అద్భతమైన పాలన అందించేందుకు బీజేపీ సిద్ధమవుతోందన్నారు. ప్రజలకు తమ పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావాలని కోరారు.