తెలంగాణ(Telangana) ప్రజలకు ఐఎండీ(IMD) హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు భారీ ఎండలు ఉంటాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వెల్లడించింది. రాగల 3 రోజులు రాష్ట్రంలో వడగాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (Indian Meteorological Department – IMD) తెలిపింది. ఈ నేపథ్యంలో తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్(Orange Alert) జారీ చేసింది.
ఈ జిల్లాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని, ఈ మూడు రోజులు అవసరమైతే తప్పా బయటకు వెళ్లొద్దని హెచ్చరికలు(Warning) జారీ చేసింది. ముఖ్యంగా పిల్లలు(Childrens), వృద్ధులు ఎక్కువ మంచినీరు, మజ్జిగ వంటివి సేవించాలని, నీడపాటున ఉండేలా చూసుకోవాలని కోరింది. భవణ నిర్మాణ కూలీలు సాధ్యమైనంత వరకూ మధ్యాహ్నం పూట పనులు చేయకుండా ఉండటమే మంచిదని సూచించింది. మారుతున్న వాతావరణం దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ(Indian Meteorological Department – IMD) తెలిపింది.