ఇన్నాళ్లు సమంత పై రకారకాల కాంమెంట్స్ చేసే వారంతా.. ఎప్పుడైతే సమంత అరుదైన వ్యాధితో బాధ పడుతున్నట్లు వెల్లడించిందో.. అప్పటి నుంచి ఆమె త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నారు. ఎప్పుడు యాక్టివ్గా ఉండే సమంత(samantha).. ఒక్కసారిగా మయోసైటిస్ అనే వ్యాధి సోకినట్లు సోషల్ మీడియాలో చెప్పడంతో.. అభిమానులంతా షాక్ అయ్యారు. అది కూడా డబ్బింగ్ స్టూడియో నుంచి సెలైన్ బాటిల్ ఎక్కుతోన్న ఫోటో షేర్ చేయడంతో సమంతకు సీరియస్నే ఉన్నట్టు అర్థమవుతోంది. ఈ నేపథ్యంలోమయోసైటీస్ అంటే ఏంటని నెట్టింట్లో శోధిస్తున్నారు నెటిజన్స్.
ఈ వ్యాధి ఎక్కువగా వర్కౌట్లు..హెవీ వెయిట్ లిఫ్టింగ్.. బాడీలో ఏమైనా ప్రాబ్లమ్స్.. మానసిక ఒత్తిడి లాంటి సమస్యలున్న వారికి వస్తుందని తెలుస్తోంది. కారణాలు ఏమైనా సమంత ఈ వ్యాధి బారిన పడడం భాదకరమైన విషయం. అయితే త్వరలోనే తాను పూర్తి ఆరోగ్యంతో మీ ముందుకు వస్తాను అనే ధీమాను వ్యక్తం చేసింది. ఇక ఈ విషయంలో చాలా మంది ఇండస్ట్రీ ప్రముఖులు సమంత త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.
జూనియర్ ఎన్టీఆర్.. మెగాస్టార్ చిరంజీవిలతో పాటు చాలామంది హీరోలు సమంత కోలుకోవాలని ప్రార్థించారు. దీనిపై అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్ కూడా స్పందించారు. ముందుగా సుశాంత్ స్పందించాడు. ఆ తర్వాత అక్కినేని అఖిల్ కూడా.. డియర్ సామ్ అందరి ప్రేమ మరియు బలం నీకు అందుతుంది.. గెట్ వెల్ సూన్ అని రాసుకొచ్చాడు. అయితే దీనిపై నాగ్, చైతూ కూడా స్పందిస్తారా అని ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. ఏదేమైనా.. మనం కూడా సమంత త్వరగా కోలుకోవాలని కోరుకుందాం.