»Rbi Says Bank Credit Outstanding On Real Estate Rise To Reached 28 Lakh Crore Rupees In July
RBI: జూలైలో రికార్డు స్థాయిలో రియల్ ఎస్టేట్‌పై బ్యాంకు రుణాలు.. రూ.28 లక్షల కోట్లకు చేరిక
జూలైలో ప్రాథమిక రంగ గృహాలతో సహా రియల్ ఎస్టేట్ రంగంలో బకాయిపడిన రుణాలు సంవత్సరానికి 37.4 శాతం పెరిగి రూ.24.28 లక్షల కోట్లు దాటినట్లు RBI సెక్టోరల్ డిప్లాయ్‌మెంట్ ఆఫ్ బ్యాంక్ క్రెడిట్ డేటా తెలుపుతోంది.
RBI: జూలైలో బ్యాంకుల రుణాలు 38 శాతం పెరిగి రూ.28 లక్షల కోట్లకు చేరుకున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన గణాంకాల ద్వారా తెలుస్తోంది. ఇందులో హౌసింగ్, వాణిజ్య రియల్ ఎస్టేట్ రంగాలు ఉన్నాయి. RBI నుండి రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన రుణ డేటా, ప్రాపర్టీ కన్సల్టెంట్ల నుండి కొత్త డేటా రియల్ ఎస్టేట్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని స్పష్టం చేసింది. ప్రధాన నగరాల్లోని గృహాల ప్రాజెక్టులు భారతదేశంలో ఇళ్లకు డిమాండ్ పెరుగుతోందని చూపుతున్నాయి. దీని కారణంగా చాలా నగరాల్లో ఇళ్ల ధరలు పెరిగాయి. ఇందులో ముంబై, న్యూఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాలు ఉన్నాయి.
జూలైలో ప్రాథమిక రంగ గృహాలతో సహా రియల్ ఎస్టేట్ రంగంలో బకాయిపడిన రుణాలు సంవత్సరానికి 37.4 శాతం పెరిగి రూ.24.28 లక్షల కోట్లు దాటినట్లు RBI సెక్టోరల్ డిప్లాయ్‌మెంట్ ఆఫ్ బ్యాంక్ క్రెడిట్ డేటా తెలుపుతోంది. వాణిజ్య ఆస్తులపై బ్యాంకుల బకాయిలు 38.1 శాతం పెరిగి రూ.4.07 లక్షల కోట్లకు చేరాయి. రియల్ ఎస్టేట్ రంగంపై రుణాల పెరుగుదల పెద్ద ఎత్తున డిమాండ్‌ను ప్రతిబింబిస్తోందని అనరాక్ చైర్మన్ అనూజ్ పూరి అన్నారు.
గత ఏడాది మహమ్మారి కారణంగా వాణిజ్య రంగం కష్టాల్లో కూరుకుపోయింది. ఎందుకంటే ప్రజల ఇళ్లకు డిమాండ్ తగ్గిందని అనరాక్ ఛైర్మన్ అన్నారు. ఉద్యోగులు ఆఫీసు నుండి పని చేయడం పూర్తిగా మానేశారు. ఇంటి నుంచే పని చేయడాన్ని మొదలు పెట్టారు. ప్రస్తుతం పరిస్థితి సద్గుమణగడంతో ఉద్యోగులు కార్యాలయానికి తిరిగి వస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వాణిజ్య కార్యాలయాల సంఖ్య పెరిగింది.
RBI డేటా ప్రకారం.. 2023-24 మొదటి త్రైమాసికంలో ఆల్ ఇండియా HPI వృద్ధి సంవత్సరానికి 5.1 శాతానికి చేరుకుంది. ఇది అంతకుముందు త్రైమాసికంలో 4.6 శాతం, ఏడాది క్రితం 3.4 శాతం. గత ఏడాదితో పోలిస్తే 2022లో టాప్ 7 నగరాల్లో గృహాల విక్రయాలు ఇప్పటికే 63 శాతానికి చేరుకున్నాయని పూరీ చెప్పారు. గృహ రుణాల వడ్డీ రేట్లు నిరంతరం పెరిగినా డిమాండ్ తగ్గడం లేదన్నారు.