»Realmenarzo60x5gon6thsep Realme Narzo 60x Realme Buds T300 Grand Launch In India
Realme: Narzo60X Realme Buds T300 సెప్టెంబర్ 6న గ్రాండ్ లాంచ్
రియల్ మీ కంపెనీ ద్వారా మరో అద్భుతమైన ఫీచర్లతో Realme Narzo 60X మొబైల్ ఇండియాలో లాంచ్ అవుతుంది. దీంతో పాటు Realme Buds T300 కూడా లాంచ్ అవుతుంది. దీనికి సంబంధించిన ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ ఇక్కడ తెలుసుకుందాం.
realmenarzo60x5gon6thSep: ఇండియాలో Realme Narzo 60X, Realme Buds T300 సెప్టెంబర్ 6 న గ్రాండ్ లాంచ్
Realme Narzo 60X మొబైల్‌ను భారతదేశంలో లాంచ్ చేయడానికి రియల్ మీ కంపెనీ అధికారికంగా తేదీని ప్రకటించింది. ఈ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం Realme 60X స్మార్ట్‌ఫోన్ ఇండియాలో సెప్టెంబర్ 6న మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ కానుంది. ఇది 60 సిరీస్‌లో లాంచ్ అవుతున్న మూడవ మొబైల్ ఇది. దీని కంటే ముందే పలు 5G స్మార్ట్ఫోన్లు మార్కెట్లోకి వచ్చాయి. అయితే ఈ మోడల్ తోపాటు కంపెనీ Realme Buds T300ని కూడా లాంచ్ చేస్తుంది. ఇందులో 30dB యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) సపోర్ట్, 12.4mm డైనమిక్ బాస్ డ్రైవర్ ఉంటుంది. అమెజాన్‌లో ఇటీవల విడుదలైన పోస్టోలో స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో వృత్తాకార కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. అలాగే ఈ డివైజ్ 5జీ సపోర్ట్ ఉంటుంది. దీంతోపాటు స్మార్ట్‌ఫోన్ 33W SUPERVOOC ఫాస్ట్ ఛార్జింగ్‌ను కూడా అందిస్తుంది.
Realme 60X స్టార్టింగ్ మోడల్ 4GB RAM, 128GB ఇంటర్నల్ మెమరీతో వస్తుంది. అలాగే టాప్ ఎండ్ మోడల్లో 6GB RAM,128GB ఇంటర్నల్ మెమరీ అందుబాటులో ఉంది. ఇక కలర్ విషయానికి వస్తే నెబ్యులా పర్పుల్, స్టెల్లార్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో ఈ స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో లాంచ్ అవుతుందని సమాచారం. హ్యాండ్సెట్ స్పెసిఫికేషన్ ఇంకా వెల్లడి కానప్పటికి, ఈ పరికరం కొన్ని మార్పులతో మినహా రియల్ మీ11ఎక్స్‌కి కొంత దగ్గర లక్షణాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది. రీకాల్ చేయడానికి, Realme 11X 6.72 అంగుళాల IPS LCD డిస్ప్లేతో పూర్తి HD+ రిజల్యూషన్ కలిగి ఉంది. అలాగే 64MP ప్రైమరీ కెమెరా, 2MP పోర్ట్రెయిట్ సెన్సార్‌తో కూడిన డ్యూయల్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ముందు వైపు హ్యాండ్‌సెట్‌లో 8MP సెల్ఫీ కెమెరా ఉంది. బ్యాటరీ విషయానికి వస్తే 5,000mAh కలిగి ఉంది. భద్రతా ప్రయోజనం కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. దీనికి సంబంధించిన ధర, ఇతర ఫీచర్ల గురించి తెలియాలంటే సెప్టెంబర్ 6 వరకు ఆగాల్సిందే.