టీమ్ ఇండియా స్టార్ ఫేసర్ జస్ప్రీత్ బుమ్రా తనకు కుమారుడు పుట్టిన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. తమ కుటుంబం చాలా సంతోషంగా ఉందని, చంద్రమండలంలో తేలియాడుతున్నట్లుగా ఉందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.
cricketer jasprit bumrah wife sanjana ganesan blessed with baby boy
Jasprit bumrah: టీమిండియా(Team India) స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) తండ్రయ్యాడు. బుమ్రా సతీమణి, యాంకర్ సంజనా గణేశన్ (Sanjana Ganeshan) సోమవారం మొదటి బిడ్డకు జన్మనిచ్చారు. వీరికి మగపిల్లాడు పుట్టిన విషయాన్ని బుమ్రా సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. తన కుమారుడి ఫొటోని అభిమానులతో పంచుకుంటూ అంగద్ జస్ప్రీత్ బుమ్రా (Angad Jasprit Bumrah) అని పేరు పెట్టినట్లు ఎక్స్‌లో పోస్ట్ చేశాడు.
తన భార్య, కుమారుడు చేతులతో తన చేయి కూడా కలిసి ఉన్న పోస్ట్‌తో పాటు ఇలా రాసుకొచ్చారు. మా చిన్న కుటుంబం ఇప్పుడు పెరిగింది. మా హృదయాలు చాలా సంతోషంగా ఉన్నాయి. ఈ ఉదయం మేము మా లిటిల్ బాయ్ అంగద్ జస్ప్రీత్ బుమ్రాను ప్రపంచంలోకి స్వాగతించాము. మా ఆనందం మాటల్లో చెప్పలేనిది. మేము ప్రస్తుతం చంద్రునిపై తేలియాడుతున్నాము. మా జీవితంలోని ఈ కొత్త అధ్యాయం అంటే వివరించారు. దీంతో పలువురు నెటిజన్లు బుమ్రా-సంజన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట వైరల్ అయింది.
ఇదిలా ఉండగా ఆసియా కప్‌లో భాగంగా జరుగనున్న కీలకమైన నేపాల్(Nepal) మ్యాచ్‌కు జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) ఆడడం లేదు. తన భార్య ప్రసవం కోసం స్వదేశానికి తిరిగివచ్చారు. ఇక టీమిండియా సూపర్ 4(Super-4)కు అర్హత సాధించాలంటే నేపాల్‌పై భారీ తేడాతో గెలవాల్సి ఉంది. మరీ ఈ ఫేసర్ స్థానంలో ఎవర్ని తీసుకుంటారో చూడాలి.
Our little family has grown & our hearts are fuller than we could ever imagine! This morning we welcomed our little boy, Angad Jasprit Bumrah into the world. We are over the moon and can’t wait for everything this new chapter of our lives brings with it ❤️ – Jasprit and Sanjana pic.twitter.com/j3RFOSpB8Q