Actor Rana : తండ్రి కాబోతున్న రానా.. వీడియో వైరల్!
Actor Rana : విరాట పర్వం తర్వాత మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు దగ్గుబాటి రానా.. కానీ ఏదో ఓ రకంగా వార్తల్లో నిలుస్తునే ఉన్నాడు. ముఖ్యంగా వ్యక్తిగత విషయాల్లో రానా హాట్ టాపిక్ అవుతునే ఉన్నాడు. 2020లో కరోనా సమయంలో బ్యాచ్ లర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పి.. మిహీక బజాజ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు రానా.
విరాట పర్వం తర్వాత మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు దగ్గుబాటి రానా.. కానీ ఏదో ఓ రకంగా వార్తల్లో నిలుస్తునే ఉన్నాడు. ముఖ్యంగా వ్యక్తిగత విషయాల్లో రానా హాట్ టాపిక్ అవుతునే ఉన్నాడు. 2020లో కరోనా సమయంలో బ్యాచ్ లర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పి.. మిహీక బజాజ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు రానా. అయితే రానా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టినప్పటి నుంచి.. రకరకాల వార్తలు వినిపించాయి. ఒకనొక సందర్భంలో రానాకు తన భార్యతో విభేదాలు వచ్చాయనే రూమర్స్ వినిపించాయి. అలాగే మిహిక ప్రెగ్నెంట్ అంటూ ఎన్నోసార్లు వార్తలు వచ్చాయి. కానీ అవేమి నిజం కాలేదు. అదే నిజమైతే.. తామే అభిమానులకు చెప్తామని చెప్పారు. కానీ ఈసారి మాత్రం రానా చెప్పకుండానే.. మిహికా ప్రెగ్నెంట్ అని ఫిక్స్ అయిపోయారు దగ్గుబాటి అభిమానులు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మిహీక.. తాజాగా పోస్ట్ చేసిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. లేటెస్ట్ వీడియోలో బీచ్ ఒడ్డున లూజ్ డ్రెస్‌లో చిల్ అవుతోంది మిహీకా. ఈ వీడియోలో ఆమె బేబీ బంప్‌తో ఉన్నట్లుగా కనిపిస్తోంది. దాంతో రానా తండ్రి కాబోతున్నాడనే న్యూస్ వైరల్‌గా మారింది. వీడియోని గమనిస్తే అది నిజమేనని అనిపిస్తోంది. మిహీకను చూస్తే.. లూజ్ డ్రెస్సే అయినప్పటికీ బేబీ బంప్ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. దీంతో నెటిజన్లు.. రానా దంపతులకు కంగ్రాట్స్ చెప్తూ కామెంట్స్ పెడుతున్నారు. కానీ ఇప్పటి వరకు రానా గానీ, మిహీక గానీ దీనిపై స్పందించలేదు. అయితే ఈసారి మాత్రం రానా తండ్రి కాబోతున్నాడని ఫిక్స్ అయిపోయారు జనాలు. మరి దీనిపై రానా క్లారిటీ ఇస్తాడేమో చూడాలి.