NZB: డిచ్‌పల్లి మండలం బర్దిపూర్ గ్రామంలో మొదటి విడతగా 13 ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనట్లు సర్పంచ్ కోట్ల భాస్కర్ తెలిపారు. రెండో విడతలో 40 ఇళ్లు మంజూరు చేయాలని రూరల్ ఎమ్మల్యే భూపతి రెడ్డికి విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు. బుధవారం సత్తురి సావిత్రి భర్తకి ఇంటి మంజూరు పత్రాల్ని పంచాయతీ సెక్రటరీ వసంత్ రావుతో కలిసి అందజేశారు.
AP: కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరిన అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లపై ప్రభుత్వం ప్రదర్శించిన తీరు అత్యంత హేయమని అన్నారు. అంగన్వాడీ మహిళలను నిద్రిస్తున్న సమయంలో అత్యంత దారుణంగా, అక్రమంగా అరెస్టులు చేశారని దుయ్యబట్టారు. మహిళలని చూడకుండా వారిపై లాఠీఛార్జీ చేసి, అత్యంత అమానవీయంగా వ్యవహరించారని మండిపడ్డారు.
NDL: బనగానపల్లె(మం) మిట్టపల్లిలో ఇవాళ రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరమ్మ పర్యటించారు. గ్రామ టీడీపీ నాయకుడు రామసుబ్బారెడ్డి కుమార్తె వివాహ ముహూర్తపు వేడుకలో బీసీ ఇందిరమ్మ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఆమె పెళ్లి కుమార్తెను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు.
VSP: సింహాచలం పంచగ్రామాల భూ సమస్యపై ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అసెంబ్లీలో మాట్లాడారు. మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు సానుకూలంగా ఉన్నారని తెలిపారు. 12,149 కట్టడాల క్రమబద్ధీకరణ ద్వారా వేలాది కుటుంబాలకు ఊరట కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
SKLM: జలుమూరు మండలంలో ఉన్న అంగనవాడీ కార్యకర్తలు బుధవారం స్థానిక అంగన్వాడీ కేంద్రంలో ప్రీ ఫైనల్ పరీక్షలు రాశారు. అంతర్జాతీయ మహిళా వారోత్సవాలలో భాగంగా అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ఈ పరీక్షలు నిర్వహించినట్లు వెల్ఫేర్ అసిస్టెంట్ శివకుమార్ తెలిపారు. శత శాతం అక్షరాస్యత సాధనలో భాగంగా ప్రభుత్వం ఆదేశం మేరకు నిర్వహించినట్లు తెలిపారు.
కాకినాడ: పెద్దాపురం డివిజన్ ఇంచార్జ్ ఆర్డీఓగా ట్రైనీ కలెక్టర్ మనీషాను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బుధవారం ఆమె బాధ్యతలు స్వీకరించనున్నారు. పరిపాలనను మరింత వేగవంతం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. డివిజన్ పరిధిలోని రెవెన్యూ, భూసంబంధిత సమస్యలు, ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై ఆమె ప్రత్యేక దృష్టి సారించనున్నారు.
KMM: చంద్రగ్రహణం ముగియడంతో కూసుమంచి మండలం జీళ్ళచెరువు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించారు. పూజారి చిలకమర్రి స్వామినాథాచార్యులు ఆలయాన్ని శుద్ధి చేసి ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు. ఈ కార్యక్రమంలో ఈవో జగన్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.
AP: తిరుమల లడ్డూ అంశంపై శాసనమండలిలో గందరగోళం కొనసాగుతోంది. ఒకే అంశంపై రెండు తీర్మనాలు ఇవ్వడం సరికాదని మంత్రి నాదెండ్ల తెలిపారు. సభలో చర్చ జరిగిన తర్వాతే తాము బయటకు వెళ్తామని మంత్రి పయ్యావుల పేర్కొన్నారు. సభలో ఎంతసేపైనా చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. చారిత్రాత్మక తప్పిదం మండలిలో జరగకూడదనేదే తమ ఉద్దేశమని చెప్పారు.
ప్రకాశం: సింగరాయకొండలో ఐదు రూపాయలకు అన్నం అందించే అన్న క్యాంటీన్ నిర్మాణం పూర్తయింది. నిరుపేదలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ క్యాంటీన్ త్వరలోనే ప్రారంభం కానుంది. మొదటిసారి ఏర్పాటు చేస్తున్న ఈ క్యాంటీన్ పేదల ఆకలి తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
TG: ములుగు(D)లోని దేవాదుల ఎత్తిపోతల పథకం, సమ్మక్క బ్యారేజీ పనులపై మంత్రులు ఉత్తమ్, సీతక్క, పొంగులేటి సమీక్షించారు. దేవాదుల ప్రాజెక్టును ఈ మార్చి నెలాఖరుకల్లా పూర్తి చేసి ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్ బిల్లులను వెంటనే క్లియర్ చేస్తామని, భూసేకరణ సమస్యలు లేకుండా చూడాలని సూచించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి వరంగల్(D)లోని లక్షలాది ఎకరాలకు సాగునీరు అందనుంది.
తిరుపతిలోని APSPDCL కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వివిధ ప్రైవేట్ సంస్థలు పాల్గొన్న ఈ జాబ్ మేళాలో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యారు.
ATP: అనంతపురంలో ఈనెల 8న జిల్లా స్థాయి శాప్ లీగ్ మాస్టర్స్ బ్యాడ్మింటన్, టెన్నిస్ పోటీలు నిర్వహించనున్నట్లు డీఎస్ఓ మంజుల తెలిపారు. టెన్నిస్ పోటీలకు 40ఏళ్లు, బ్యాడ్మింటన్‌కు 35ఏళ్లు పైబడిన వారు అర్హులని అన్నారు. ఆసక్తిగల క్రీడాకారులు వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఇక్కడ ఎంపికైన వారు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.
HYD: ఉప్పుగూడలో ఇవాళ హోలీ పండుగ సందర్భంగా ఉప్పుగూడ బస్తీ వాసులు చాలా సందడిగా హోలీని జరుపుకున్నారు. పిల్లలు పిచికారీలతో, ఒకరిపై ఒకరు రంగులను చల్లుకున్నారు. పెద్దలు ఒకరికొకరు మొహంపై వివిధ రంగులను పూసుకున్నారు. యువతీ యువకులు రంగు నీటిని ఒకరిపై ఒకరు కుమ్మరించుకున్నారు. డప్పుల మోతకు, డీజే పాటలకు, ఉత్సాహంతో నృత్యాలు చేశారు.
KDP: జమ్మలమడుగు నియోజకవర్గ YCP ఇన్ ఛార్జ్, MLC రామసుబ్బారెడ్డి ఎర్రగుంట్లలో YCP నూతన కార్యాలయం ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. రానున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఎర్రగుంట్లలో మాజీ MLA సుధీర్ రెడ్డి వైసీపీ కార్యాలయం ఏర్పాటు చేసి ఉన్న విషయం తెలిసిందే.
కోనసీమ: ఇన్‌స్టాలో పరిచయమైన యువతిని ప్రేమ పేరుతో నమ్మించి, శారీరకంగా దగ్గరై గర్భవతిని చేసిన గ్రామ సచివాలయ ఉద్యోగిని రాయవరం పోలీసులు అరెస్ట్ చేశారు. పెళ్లి చేసుకోమని కోరగా నిందితుడు నిరాకరించడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు SI సురేశ్ బుధవారం తెలిపారు.