అమ్మాయిలతో పాటు 9-26 ఏళ్ల అబ్బాయిలు కూడా తప్పనిసరిగా HPV వ్యాక్సిన్ వేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇది పురుషుల్లో వచ్చే గొంతు, నాలుక, జననేంద్రియ క్యాన్సర్లను సమర్థవంతంగా అడ్డుకుంటుందని చెబుతున్నారు. పురుషులకు ఈ క్యాన్సర్లను గుర్తించే స్క్రీనింగ్ పరీక్షలు లేనందున ముందస్తు జాగ్రత్తలే ఉత్తమ మార్గం. కొత్త నియమాల ప్రకారం అబ్బాయిలకు ఒకే ఒక్క డోస్ టీకా సరిపోతుంది.
MNCL: చెన్నూర్ మున్సిపాలిటీలోని 9వ వార్డులో మంత్రి వివేక్ వెంకటస్వామి ఆదేశాలతో బుధవారం సోలార్ హైమస్ లైట్లను ఏర్పాటు చేశారు. స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ సునీత సుశీల్ ప్రారంభించారు. 9వ వార్డులో స్ట్రీట్ లైటింగ్ వ్యవస్థను మెరుగుపరిచేందుకు మంత్రి చొరవ చూపారని కౌన్సిలర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రికి వార్డ్ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.
VZM: అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం అయ్యన్నపేట మున్సిపల్ కార్పొరేషన్ వాటర్ ప్లాంట్ వద్ద నీటి సంరక్షణపై ప్రత్యేకమైన అవగాహన కార్యక్రమం జరిపారు. క్లబ్ అధ్యక్షులు సిహెచ్ రమణ మాట్లాడుతూ.. నీటి వనరులను పొదుపుగా ఉపయోగించాలని, వృథాను అరికట్టి భవిష్యత్ తరాల కోసం నీటిని నిల్వ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు పాల్గొన్నారు.
SRCL: రుద్రంగి మండల కేంద్రంలో కొలువైన శ్రీ ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి, ముంజ లక్ష్మీనరసింహ స్వామి వారి కళ్యాణం కన్నుల పండువగా జరిగింది. ఈ వేడుకల్లో వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొని స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం ఆలయ అర్చకులు ఆయనకు వేద ఆశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలను అందజేశారు.
AKP: మాడుగుల శ్రీదేవి అమ్మవారి ఆలయం గర్భగుడి గోపుర శిఖర కలశ ప్రతిష్ఠాపన మహోత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. వేద పండితులు గోమాత పూజ, గణపతి పూజ, కలశ ఊరేగింపు నిర్వహించారు. ఈ నెల 6న ఉదయం 10 గంటలకు కలశ ప్రతిష్ఠా కార్యక్రమం జరగనుంది. అనంతరం అన్నసమారాధన ఏర్పాటు చేసినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులు ఈ మహోత్సవాలను విజయవంతం చేయాలన్నారు.
NZB: రుద్రూర్‌లోని అంబేద్కర్ కాలనీలో 2 నెలలుగా తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు కాలనీవాసులు వాపోయారు. పైపులైన్ పగిలి నీరు వృథాగా పోయి సుమారు 25 కుటుంబాలకు నీరు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టి, తాగునీరు అందించాలని కోరుతున్నారు.
GDWL: నిరుపేదల ఆరోగ్య భద్రతే ధ్యేయంగా ప్రభుత్వం అందిస్తున్న ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) సహాయం బాధిత కుటుంబాలకు కొండంత అండగా నిలుస్తుంది అని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు పేర్కొన్నారు. బుధవారం అలంపూర్ మండలం భీమవరం గ్రామానికి చెందిన సేరి వేదవతికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన రూ.19,500 చెక్కును ఆమె కుటుంబ సభ్యులకు అందజేశారు.
విజయనగరం జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు రాజాం మండలంలో ఆరుగురు ట్రాఫిక్ పోలీసుల విధులు నిర్వహించనున్నారని సీఐ అశోక్ కుమార్ తెలిపారు. రద్దీగా ఉండే ప్రదేశాలు, కూడళ్లలో ట్రాఫిక్ జామ్ కాకుండా వాహనాలను క్రమబద్ధీకరించడం చేస్తారని అన్నారు. ఓవర్ స్పీడింగ్, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించకపోవడం, డ్రంక్ అండ్ డ్రైవ్ వంటి ఉల్లంఘనలపై జరిమానాలు విధించనున్నట్లు పేర్కొన్నారు.
SDPT: జిల్లాలో హోలీ వేడుకల్లో హమాలీలు పాల్గొని ఎంతో సంతోషంగా ఈ వేడుకలను నిర్వహించుకున్నారు. ప్రతిరోజు పనిలో నిమగ్నమై ఎంతో బరువులు మోసే హమాలీలు బుధవారం రోజున హోలీ పండుగ సందర్భంగా రంగులు పూసుకొని ఎంతో సరదాగా హోలీ వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ హోలీ పండుగ అందరి జీవితాల్లో రంగులు విరబూసేలా ఉండాలి అని అన్నారు.
SRPT: కోదాడ మండలం దోరకుంట గ్రామానికి చెందిన మాజీ సింగిల్ విండో ఛైర్మన్ వెంకటేశ్వర్లు బుధవారం అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులు పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లాలో మద్యం మత్తులో భార్య, పిల్లలపై కత్తితో దాడి చేసిన వ్యక్తికి కామారెడ్డి కోర్టు ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. లింగంపేట్ పోలీసులు పక్కా దర్యాప్తుతో కేసును నిరూపించారని, బాధితురాలి పోరాటంతో న్యాయమూర్తి నాగరాణి సాక్ష్యాధారాలు పరిశీలించి, రెండు వేల రూపాయల జరిమానాతో పాటు శిక్ష విధించారని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు.
ADB: కాగజ్ నగర్ పట్టణంలోని MLA హరీష్ బాబు నివాసంలో బుధవారం హోలీ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా MLA హరీష్ బాబు పట్టణ వాసులు భాజపా నాయకులు, కార్యకర్తలకు రంగులద్ది హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. హోలీ పండుగ అందరి జీవితాల్లో సుఖసంతోషాలు తేవాలని MLA ఆకాంక్షించారు.
HYD: ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్సై జీ.వెంకటేశ్‌ను నగర CP సజ్జనర్ సస్పెండ్ చేశారు. విధి నిర్లక్ష్యం, ఉన్నతాధికారుల ఆదేశాల అవహేళన, అనుచిత ప్రవర్తన ఆరోపణల నేపథ్యంలో ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. గణేశ్ బందోబస్తు సమావేశానికి హాజరు కాకపోవడం, నెహ్రూ నగర్ ఘటనలో రౌడీ షీటర్ నిస్సార్‌పై చర్యలు తీసుకోకపోవడంతో పాటు తదితర నిర్లక్ష్యాలను కారణంగా చూపుతూ వేటు వేశారు.
NRPT: మరికల్ మండల కేంద్రంలో హోలీ సంబరాలను యువకులు ఘనంగా నిర్వహించుకున్నారు. బ్యాండ్ మేళాలతో ఒకరిపై ఒకరు రంగులు చల్లుతూ హోలీ ఉత్సవాలను వైభవంగా నిర్వహించుకున్నారు. కుల, మత ప్రాంతీయ భేదాలు లేకుండా నృత్య లు చేస్తూ హోలీ వేడుకలు నిర్వహించారు. మరికల్ మండలంలో అన్ని గ్రామాల్లో హోలీ పండుగలు జరుపుకున్నారు. పెద్ద ఎత్తున ఈ హోలీ ఉత్సవాల్లో పాల్గొన్నారు.
SDPT: కొండపాక, కుకునూరుపల్లి మండలాల్లోని తిమ్మారెడ్డిపల్లి, మంగోల్ గ్రామాలలో భద్రత దృష్ట్యా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తొగుట సీఐ, ఎస్సై శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రజల రక్షణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని, నేరాల నియంత్రణకు ఇవి ఎంతో దోహదపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్‌లు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.