ప్రకాశం: ఒంగోలులో రాజకీయం మళ్లీ ఘాటెక్కింది. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మధ్య మాటల యుద్ధం మళ్లీ మొదలైంది. డ్వాక్రా అవినీతి జరిగిందని, అది ఎవరు చేశారో ఒంగోలు ప్రజలకు తెలుసని బాలినేని పేర్కొన్నారు. ఇప్పటికే దీనిపై ఫిర్యాదు చేశామని, ఆయన కూడా ఎన్డీఏ ప్రభుత్వంలోనే ఉన్నారని, కలెక్టర్తో స్పెషల్ ఎంక్వైరీ వేపించుకోవాలని దామచర్ల అన్నారు.
WGL: గ్రేటర్ వరంగల్ 19వ డివిజన్ పరిధిలోని కాశిబుగ్గలో త్రాగునీరు మురికిగా వస్తుందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. గత మూడు రోజులుగా నీరు ఇలాగే మురికిగా, రంగు మారి రావడంతో అనారోగ్య సమస్యలు వస్తున్నాయని తెలుపుతున్నారు. సంబంధిత అధికారులు చొరవ తీసుకొని, చర్యలు చేపట్టి శుభ్రమైన నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
AP: తిరుమల లడ్డు కల్తీ ఇష్యూపై మండలిలో చర్చకు ఛైర్మన్ ఆమోదించారు. ప్రశ్నోత్తరాలు ముగిసిన తర్వాత తిరుమల లడ్డు కల్తీపై చర్చించనున్నారు. గతవారం లడ్డు కల్తీపై చర్చ సందర్భంగా ప్రభుత్వం ముందు స్టేట్మెంట్ చేయడంపై YCP ఎమ్మెల్సీలు అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
NLG: చిట్యాలలోని శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయ నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పునః నిర్మాణమై 23 ఏళ్లు ముగిసిన సందర్భంగా.. బొబ్బలి పాండు రెడ్డి తన బృందం, కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి నూతన పట్టు వస్త్రాలు, వడి బియ్యం సమర్పించారు. పట్టణ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుభిక్షంగా ఉండాలని, నిర్మాణ కమిటీ వేడుకుంది.
VZM: గరివిడి స్థానిక ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో బుధవారం ఉదయం అంతర్జాతీయ మహిళా వారోత్సవాలు ఎస్సై లోకేశ్వరరావు నిర్వహించారు. మహిళలు, విద్యార్థినులు స్వీయ రక్షణ విధానాలు నేర్చుకోవాలని అన్నారు. మహిళలకు ఏ సమస్య వచ్చినా పోలీసు వారు సహోదర భావంతో అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. సెల్ఫ్ డిఫెన్స్ విద్యార్థినులకు ఆపద సమయాల్లో ఉపయోగపడుతుందన్నారు.
సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా బుధవారం హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. మంగళవారం గ్రహణం కారణంగా పండితుల సూచన మేరకు వేచి చూసిన ప్రజలు, ఈరోజు ఉత్సాహంగా రంగుల పండుగను జరుపుకున్నారు. చిన్నారులు, యువకులు, మహిళలు వాడవాడలా రంగులు చల్లుకుంటూ, నృత్యాలు చేస్తూ కేరింతలు కొట్టారు.
ప్రస్తుతం ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. దీనిపై స్పందిస్తూ దర్శకుడు రాంగోపాల్ వర్మ చేసిన పోస్ట్ సంచలనంగా మారింది. ‘ఈ యుద్ధం నిజానికి జీసస్, అల్లా మధ్య జరుగుతున్న పోరాటం వంటిది. ఇందులో ఎవరు గెలిస్తే నేను ఆ మతంలోకి మారిపోతాను’ అంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేశాడు ఈ పోస్ట్ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తీవ్ర చర్చకు దారితీసింది.
AKP: గత ప్రభుత్వంలో అవసరం లేకపోయినా 61 మంది వరకు ఏపీపీలను నియమించారని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. బుధవారం శాసనమండలిలో మాట్లాడుతూ.. లా చదిన రాజకీయ నిరుద్యోగులను సాంప్రదాయన్ని పాటించకుండా నియమించుకున్నారన్నారు. ఈ వ్యవస్థను ప్రక్షాలను చేసి ఖజానాపై భారం పడకుండా అవసరమైన చోట్ల ఏపీపీలు పారదర్శకంగా నియమిస్తామన్నారు.
ఇంగ్లండ్‌తో రేపటి T20 WC సెమీస్ పోరు నేపథ్యంలో భారత్‌కు మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కీలక సూచనలు చేశాడు. అభిషేక్ మానసికంగా ఇబ్బందిపడటమే తక్కువ స్కోర్లకు కారణమని, అయినప్పటికీ అతణ్ని సెమీప్ జట్టులో కొనసాగించాలని సూచించాడు. అయితే అతనికి బదులు ఇషాన్‌తో ఇన్నింగ్స్ ఓపెనింగ్ చేయించాలని, అటు రింకూ సింగ్‌నీ జట్టులోకి తీసుకోవాలని పేర్కొన్నాడు.
AP: కృతజ్ఞతకు ఆశకూ పోటీ పెడితే ఆశే గెలుస్తుందని మాజీమంత్రి బుగ్గన అన్నారు. ఆ ఆశను కూటమి సృష్టించిందని.. ఆ ఆశలోనే ప్రజలు మోసపోయారని పేర్కొన్నారు. చంద్రబాబును నమ్మి ప్రజలు మోసపోవడం ఇది మొదటిసారి కాదన్నారు. జగన్ చేస్తున్న సంక్షేమం అంతా అనవసరమైనదని ప్రచారం చేశారని తెలిపారు. ఎన్నికల సమయంలో జగన్ కంటే ఎక్కువ ఇస్తామని ఆశచూపి, అధికారం రాగానే ప్రజలను మోసం చేశారని విమర్శించారు.
MHBD: రోజురోజుకు పెరుగుతున్న ఎండల తీవ్రత నేపథ్యంలో సామాన్య ప్రజలు, వన్యప్రాణులు సైతం అల్లడిపోతున్నాయి. సాధారణంగా అడవిలో సంచరించే కోతులు అడవులోకి లేక గ్రామ శివారులో చెట్ల కింద ఉంటున్నాయి. ఈ క్రమంలోనే తొర్రూరు మండలంలోని కంటాయపాలెం గ్రామ చెరువు కట్టమీద ఉన్నటువంటి చెట్ల కింద కోతులు సేద తీరుతున్న దృశ్యం HIT TV కంటపడింది.
ASR: డుంబ్రిగూడ మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ఈ నెల 7వ తేదీన సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు ఇన్‌ఛార్జ్ ఎంపీడీవో విశ్వనాథ్ బుధవారం తెలిపారు. ఎంపీపీ ఈశ్వరి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుందని పేర్కొన్నారు. మండల పరిషత్ సభ్యులు, వివిధ శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని ఆయన సూచించారు.
AKP: ఈ నెల 11వ తేదీన నాతవరం మండల సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నామని ఎంపీడీవో ఎంఎస్.శ్రీనివాస్ బుధవారం తెలిపారు. ఉదయం 10 గంటలకు మండల పరిషత్ కార్యాలయంలో ప్రారంభమయ్యే ఈ సమావేశానికి ఎంపీపీ సాగిన లక్ష్మణమూర్తి అధ్యక్షత వహిస్తారని చెప్పారు. కావున మండల ఎంపీటీసీలు, సర్పంచులు, మండల స్థాయి అధికారులంతా హాజరుకావాలని ఆయన కోరారు.
AP: మండలి ఛైర్మన్‌పై రాజీనామా చేసిన వైసీపీ ఎమ్మెల్సీలు అవిశ్వాసం పెట్టే యోచనలో ఉన్నారు. ఐదుగురు సభ్యులు రాజీనామా చేసినా ఇంతవరకు మండలి ఛైర్మన్ ఆమోదించలేదు. దీంతో ఛైర్మన్ తీరుకు నిరసనగా అవిశ్వాసం పెట్టాలని 8 మంది ఎమ్మెల్సీలు భావిస్తున్నట్లు సమాచారం. అవిశ్వాసం పెట్టేందుకు సరిపడా సంఖ్యాబలం ఉండటంతో ఆ దిశగా ఎమ్మెల్సీలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
NGKL: కొల్లాపూర్ మండలం రామాపురానికి చెందిన బత్తిని మౌనిక, మాచినేనిపల్లి మాధవరావుపేటకు చెందిన నాగరాజు ఏడాది క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. గర్భిణి అయిన మౌనిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా, భర్త నాగరాజు వేధింపుల వల్లే తన చెల్లి ప్రాణాలు కోల్పోయిందని మృతురాలి అక్క పోలీసులకు ఫిర్యాదు చేసింది. మౌనిక మృతితో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది.