VKB: వికారాబాద్‌లోని ప్రధాన కూడళ్లు, రహదారులు విద్యుత్ దీపాలు లేక చీకటిమయంగా మారాయి. మున్సిపల్ పరిధిలోని హైమాస్ లైట్లు వెలగకపోవడంతో రాత్రివేళ వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికల్లో హామీలిచ్చిన పాలకులు పట్టణ అభివృద్ధిని విస్మరించారని స్థానికులు మండిపడుతున్నారు.
VSP: చీపురుపల్లి మండలం సంకుపాలెం నుంచి కరకాం మీదుగా పెరిపి రోడ్డు అధ్వాన్నంగా మారింది. ఈ రోడ్డు మూడు సంవత్సరాలకు పైగా 3.5 కిలోమీటర్ల పొడవున పనులు ప్రారంభించారు. మిగతా పనులు మధ్యలో విడిచిపెట్టడం వల్ల రాళ్లు పైకి తేలుతున్నాయి. ఈ దారి గుండా ప్రయాణించే ప్రయాణికులు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ రహదారి పనులు పూర్తి చేయాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు.
KMM: బ్లోయర్లు, ఇతర పరికరాలతో మంటలను ఎలా అదుపు చేయాలో సిబ్బందికి జిల్లా అటవీ శాఖాధికారి (డీఎస్ఓ) సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ పలు సూచనలు చేశారు. ఖమ్మం వెలుగుమట్ల అర్బన్ పార్కును ఆయన మంగళవారం సందర్శించి అభివృద్ధి పనులను తనిఖీ చేశారు. వేసవిలో అడవులను కార్చిచ్చు నుంచి రక్షించుకోవడంపై సిబ్బంది నిర్వహించిన మాక్ డ్రిల్‌ను పరిశీలించారు.
AP: నకిలీ నోట్ల చలామణి కేసులో ఏడుగురు నిందితులకు విశాఖలోని NIA ప్రత్యేక కోర్టు జైలుశిక్ష విధించింది. నిందితులు అసోం, కర్ణాటక, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు. 2015లో వారు భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు ద్వారా నకిలీ భారతీయ కరెన్సీ నోట్లను అక్రమంగా దేశంలోకి తీసుకొచ్చి చలామణి చేసినట్టు NIA నిర్ధారించింది.
గద్వాల జిల్లా అలంపూర్‌కు చెందిన యువ డాక్టర్ వెంకట కృష్ణారెడ్డి పెళ్లి నిశ్చయం కావడంతో కెనాడ నుంచి ఇండియాకు బయలుదేరాడు. అరబ్ దేశాల్లో తలెత్తిన ఉద్రిక్తతల కారణంగా అక్కడే చిక్కుకుపోయాడు. దీంతో ఇంట్లో మార్చి 1న జరగాల్సిన ప్రీ వెడ్డింగ్, ఇంటి దైవాల కార్యక్రమాలు వాయిదా వేశారు. కుమారుడిని క్షేమంగా ఇండియాకు రప్పించేందుకు ప్రభుత్వాన్ని చర్యలు తీసుకోవాలని కుటంబ సభ్యులు కోరారు.
NRML: జిల్లాలో బుధవారం నుంచి ఈనెల 31 వరకు సదరం వైద్య శిబిరాలను నిర్వహించడం జరుగుతుందని డిఆర్డిఓ విజయలక్ష్మి ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్తో, ఇతర దివ్యాంగులకు వైద్య శిబిరాలు నిర్వహించడం జరుగుతుందని స్లాట్ బుక్ చేసుకుని మొబైల్‌కు సమాచారం వచ్చిన దివ్యాంగులు వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
TG: 13 వర్సిటీల్లో ఖాళీగా ఉన్న సుమారు 500 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్ధమవుతోంది. కాంట్రాక్టు అధ్యాపకులను కొనసాగిస్తూనే ఈ నియామకాలు చేపట్టనున్నారు. ఓయూలో 250, కాకతీయ వర్సిటీలో 145 పోస్టులు ఉన్నాయి. జీఓ 21లో సవరణలు చేసి, PHD వెయిటేజీని 10 నుంచి 30 మార్కులకు పెంచేలా ప్రభుత్వం యోచిస్తోంది. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే దీనిపై కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
BDK: మతసామరస్యాన్ని చాటుతూ లౌకిక విలువలను కాపాడుకుందాం అని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. మంగళవారం రాత్రి పాల్వంచ జామా మసీదులో ఇఫ్తార్ విందుకు ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. రంజాన్ మాస స్ఫూర్తితో రాగద్వేషాలకు దూరంగా ఉండాలని తెలిపారు. సమాజంలో శాంతిని నెలకొల్పుతున్న పవిత్ర రంజాన్ మాసం ప్రజల మధ్య ఐక్యత భావం ఇఫ్తార్ విందు అన్నారు.
KNR: జమ్మికుంట పట్టణంలో బ్రిడ్జ్ మరమ్మతులకు నోచుకోవడం లేదు. గత నెల 6న జరిగిన బస్సు ప్రమాదంతో దెబ్బతిన్న ఆర్వోబీ బ్రిడ్జికి ఇప్పటికీ మరమ్మతులు చేపట్టకపోవడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెల రోజులు గడిచినా అధికారులు స్పందించకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శిస్తున్నారు. మళ్లీ ప్రమాదాలు సంభవించక ముందే మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.
CTR: చిత్తూరు నగరానికి చెందిన 20 ఏళ్ల యువతి అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు చిత్తూరు రెండో పట్టణ సీఐ నెటికంటయ్య తెలిపారు. స్థానిక రిలయన్స్ మార్ట్‌లో పనిచేస్తున్న యువతి మంగళవారం ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు.
NZB: జిల్లా ఇందల్వాయిలో విషాదం చోటుచేసుకుంది. ఏకలవ్య పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న రామ్ చరణ్(15) హాస్టల్లో ఉరేసుకున్నాడు. విద్యార్థి వద్ద ఫోన్ దొరకడంతో సమాచారం అందుకున్న ప్రిన్సిపల్ విద్యార్థితో అపాలజీ లెటర్ రాయించాడు. దీంతో మనస్తాపం చెందిన విద్యార్థి మంగళవారం రాత్రి హాస్టల్ బాత్రూమ్‌లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
NLG: వేములపల్లి మండలం ఆమనగల్లులో శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇవాళ తెల్లవారుజామున 5:50 గంటలకు నందీశ్వరుని అగ్నిగుండాల కార్యక్రమం నిర్వహించారు. భక్తులు ‘ఓం నమశ్శివాయ’ స్మరణతో అగ్నిగుండం దాటి మొక్కులు తీర్చుకున్నారు. భారీగా తరలివచ్చిన భక్తులకు ఇబ్బందులు కలగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.
AP: మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో జరిగిన దాడి ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెల 27న శ్రీకాకుళం జిల్లాకు చెందిన నీలాద్రి అనే వ్యక్తి జనసేన కార్యాలయంలో భద్రతా సిబ్బంది కార్లు రెండింటిని ధ్వంసం చేశాడు. దీనిపై అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ వీరాస్వామి తెలిపారు. నిందితుడిని మంగళగిరి కోర్టులో హాజరుపరచగా 14 రోజులు రిమాండ్ విధించిందని చెప్పారు.
TPT: పెరిమిడి పాండురంగస్వామి ఆలయం వద్ద 84వ సంవత్సర ఆనంద అగ్నిగుండ మహోత్సవాన్ని ఇవాళ నిర్వహిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ప్రతి ఏటా పలుణ మాసం పౌర్ణమి నాడు నిర్వహించే ఈ వేడుకలను ఆదివారం సంప్రదాయ బద్ధంగా ప్రారంభించారు. సోమవారం ధ్వజారోహణ, మంగళవారం కంకణ ధారణ నిర్వహించనట్లు తెలిపారు.
SRPT: చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం గరిడేపల్లి మండల కేంద్రానికి చెందిన చాగంటి మహిత చంద్రగ్రహణం సమయంలో సాయంత్రం 5.30 నిమిషాల సమయంలో ఇంటిలోని రోటిలో నీళ్లు పోసి రోకలి బండను అందులో నెలపగా నిలబడెను దాన్ని చూసి కొందరు ఆశ్చర్యానికి గురయ్యారు. మామూలు సమయాలలో ఎంత నిలిపిన నిలవని రోకలి బండ గ్రహణం సమయములో నిలబడటం పెద్దలకు ఆశ్చర్యానికి కలిగించింది.