BDK: జిల్లా ప్రజల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా ‘హెల్త్ మిషన్ – 100 డేస్ క్యాంపెయిన్’ కార్యక్రమాన్ని నేటి నుంచి ప్రారంభించనున్నట్లు జిల్లా వైద్యాధికారి (DMHO) తుకారాం రాథోడ్ తెలిపారు. జూన్ 9 వరకు నాలుగు దశల్లో ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. నేటి నుంచి ఈ నెల 31 వరకు తొలి దశ, ఏప్రిల్ నుంచి జూన్ వరకు మిగిలిన దశలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
PDPL: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్లో జరిగిన కలెక్టర్ల సదస్సులో పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొన్నారు. 99 రోజుల కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని సీఎం సూచించారు. సోలార్ వినియోగాన్ని ప్రోత్సహించి, సంక్షేమ పథకాల లబ్ధిదారుల వివరాలను గ్రామ, వార్డు సభల్లో వెల్లడించాలని ఆదేశించారు.
KRNL: మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మంగళవారం వైసీపీ నేత జోగి రమేశ్ నివాసానికి వెళ్లారు. ఇటీవల జోగి రమేష్ ఇంటిపై జరిగిన దాడి వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. అనంతరం బుగ్గన మాట్లాడుతూ.. అన్యాయంగా కేసులు నమోదు చేయడం, ఇంటిపై దాడికి పాల్పడటం అత్యంత హేయమైన చర్యని పేర్కొన్నారు. ఇలాంటి దాడులు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని హెచ్చరించారు.
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(NTPC) గ్రీన్ కెమికల్ విభాగంలో 4 సీనియర్ మేనేజర్, 4 ఇంజినీర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. కెమికల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ, పని అనుభవం గలవారు ఈ నెల 16 వరకు అప్లై చేసుకోవచ్చు. స్క్రీనింగ్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఎంపికైన మేనేజర్లకు రూ.90,000-2,40,000.. ఇంజినీర్లకు రూ.50,000-1,60,000 జీతం చెల్లిస్తారు.
CTR: చిత్తూరు తాలూకా పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఏఎస్ఐ మనోహరన్ హఠాన్మరణం చెందారు. విధులకు వెళ్తూ దారిలో ఆయన కళ్లు తిరిగి కిందపడిపోయారు. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా, పరిస్థితి విషమించడంతో అక్కడ నుంచి తిరుపతి రూయాకు తరలించారు. తిరుపతిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కొన్ని నెలలుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం.
TG: బాచుపల్లి ప్రగతినగర్ అగ్నిప్రమాదంలో స్థానిక యువత, ప్రజలు తమ ఉదారతను చాటుకున్నారు. మంటలు వ్యాపిస్తున్న వేళ ప్రాణాలకు తెగించి, ఫర్నీచర్ సామాగ్రిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భారీ సోఫా సెట్లు, కుర్చీలు, డ్రెస్సింగ్ టేబుళ్లను మోసుకెళ్లి వ్యాపారులకు అండగా నిలిచారు. వీరికి తోడుగా హైడ్రా, లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా సహాయక చర్యల్లో పాల్గొని భారీ నష్టాన్ని నివారించారు.
W.G: కులం పేరుతో దూషించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మోటుపల్లి రామభాస్కరరావుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు మొగల్తూరు ఎస్సై జి. వాసు మంగళవారం తెలిపారు. వారతిప్ప గ్రామంలో మురుగు కాలువ గట్టుపై పాక వేసుకుని నివసిస్తున్న మల్లవరపు యేసు కుటుంబంపై రామభాస్కరరావు దాడి చేసి, కులం పేరుతో దూషించినట్లు బాధితుడు ఫిర్యాదు చేశారు.
NDL: చంద్రగ్రహణం వీడడంతో నందవరం చౌడేశ్వరి మాత భక్తులకు దర్శనమిచ్చారు. బుధవారం తెల్లవారుజామున ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి, ఛైర్మన్ పీవీ నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం అనంతరం నిత్య పూజలైన రుద్రాభిషేకం, కుంకుమార్చన, మహామంగళహారతి పూజలు చేశారు. అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు.
మేకను దొంగిలించారన్న ఆరోపణలతో ఇద్దరు విద్యార్థులను తాడుతో కట్టేసి కొట్టడంతో ఒకరు మృతిచెందారు. ఈ దారుణ ఘటన ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాలో చోటుచేసుకుంది. సంబిత్, మరో బాలుడు కలిసి మేకను దొంగిలించారన్న ఆరోపణలపై ఇందకోలి గ్రామంలో వారిద్దరినీ తాడుతో కట్టేసి కొట్టారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని బాధితులను ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించి సంబిత్ మృతిచెందాడు.
ADB: ఈ నెల 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు ప్రజా పాలన, ప్రగతి ప్రణాళికను అమలు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నిన్న హైదరాబాద్‌లోని సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా పాల్గొన్నారు. ప్రణాళిక శాఖ నోడల్ విభాగంగా వ్యవహరించే ఈ బృహత్తర కార్యక్రమాన్ని ఐదు దశల్లో నిర్వహించనున్నాట్లు తెలిపారు.
PLD: కారంపూడి మండలం పెదకోదమగుండ్లలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్ల వికలాంగుడిగా మారిన వర్ల సాగర్ బాబు, న్యాయం కోసం గత 172 రోజులుగా పోరాడుతున్నాడు. తనను ఆదుకోవాల్సింది పోయి, ప్రమాదంతో తమకు సంబంధం లేదని రాతపూర్వకంగా రాసివ్వాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకుని, తమకు న్యాయం చేయాలని మంగళవారం కోరారు.
తూ.గో: రాజమండ్రి రూరల్ కొంతమూరు సబ్‌స్టేషన్ పరిధిలో RDSS పనుల కోసం బుధవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఈఈ శామ్యూల్ తెలిపారు. అంబేద్కర్ పేట, బ్రాహ్మణ అగ్రహారం, క్వారీ ఏరియా, అఫీషియల్ కాలనీ ప్రాంతాల్లో విద్యుత్ అందుబాటులో ఉండదు. మరమ్మతులు సకాలంలో పూర్తి చేయడానికి వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.
TPT: శ్రీకాళహస్తి మండలం అక్కుర్తి జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థులు వైష్ణవి, జీవనరేఖ, మీనాక్షి ఇన్‌స్పైర్ అవార్డులకు ఎంపికయ్యారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం గర్వకారణమని HM జయ కుమారి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ ప్రతిభావంతులైన విద్యార్థులు ఉన్నారని, సరైన మార్గదర్శకత్వం అందితే అద్భుత విజయాలు సాధిస్తారన్నారు.
పశ్చిమాసియాలో ప్రస్తుతం నెలకొన్న యుద్ధ వాతావరణం ఆందోళన కలిగిస్తోందని న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ పేర్కొన్నాడు. భారత్‌లో తాము సురక్షితంగా ఉన్నామని, ఇవాళ సౌతాఫ్రికాతో జరిగే T20 WC సెమీస్ పోరుకు మాట్ హెన్రీ అందుబాటులో ఉంటాడని తెలిపాడు. కాగా శ్రీలంకను పాక్ నిర్ణీత స్కోర్‌కు పరిమితం చేయలేకపోవడంతో కివీస్ లక్కీగా సెమీస్ బెర్త్ కొట్టేసిన సంగతి తెలిసిందే.