• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

శాంతినగర్ ఆలయం భక్తులకు తెరవడం

GDWL: వడ్డేపల్లి మున్సిపాలిటీ పరిధిలోని శాంతినగర్‌లో ఉన్న శ్రీ కన్యకాపరమేశ్వరి ఆలయాన్ని గ్రహణం సందర్భంగా మూసివేసి, సంప్రోక్షణ అనంతరం నేడు భక్తులకు తిరిగి తెరిచారు. అర్చకులు వినయ్ కౌశల్ శర్మ పూజాదికాలు నిర్వహించి తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. గ్రహణం ముగిసిన సందర్భంగా భక్తులు గోమాతను దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

March 4, 2026 / 08:45 AM IST

ముఖ్యమంత్రికి జిల్లా ప్రగతి నివేదిక

KMR: జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులపై కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మంగళవారం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నివేదిక సమర్పించారు. కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న ఆయన, ప్రభుత్వ పథకాల అమలు తీరును వివరించారు. ఈ నెల 6 నుంచి జూన్ 12 వరకు నిర్వహించనున్న ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంపై సీఎం దిశానిర్దేశం చేశారు.

March 4, 2026 / 08:45 AM IST

ప్రజా సమస్యలను పరిష్కరిస్తాం: మంత్రి బీసీ

NDL: బనగానపల్లె క్యాంపు కార్యాలయంలో మంగళవారం సాయంత్రం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. రెవెన్యూ, పింఛన్లు, ఉపాధి సంబంధిత సమస్యలను ప్రజలు ఆయన దృష్టికి తెచ్చారు. న్యాయబద్ధమైన వినతులపై మంత్రి తక్షణమే స్పందించి, సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

March 4, 2026 / 08:45 AM IST

కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే మాతృవియోగం

కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మాతృమూర్తి జి.మంగమ్మ మంగళవారం మృతి చెందారు. విశయం తెలుసుకున్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసి నివాళులర్పించారు. ఫోన్ ద్వారా పరామర్శించి కుటుంబానికి భగవంతుడు మనోధైర్యం కల్పించాలని ఆకాంక్షించినట్లు మాజీ ఎమ్మెల్యే తెలిపారు.

March 4, 2026 / 08:44 AM IST

కృష్ణానదిలో అక్రమ ఇసుక రవాణా పట్టివేత

కృష్ణానది నుంచి అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న వాహనాలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. కృష్ణా మండలం గుడెబల్లూరు వద్ద అక్రమ రవాణా జరుగుతున్నట్లు సమాచారం అందడంతో చర్యలు చేపట్టారు. ఈ దాడిలో ఒక టిప్పర్‌తో పాటు ఐదు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్సై నవీద్ తెలిపారు.

March 4, 2026 / 08:44 AM IST

ఖమ్మం జిల్లాలో నయా మోసం

ఖమ్మం జిల్లాలో నకిలీ మొక్కల ముఠా రైతులను మోసం చేస్తోంది. కేరళ నుంచి నాణ్యమైన మామిడి మొక్కలు తెస్తామని చెప్పి నకిలీ బిల్లులతో ఒక్కో మొక్కకు రూ.370 వసూలు చేస్తున్నారు. తిరుమలాయపాలెం పాతర్లపాడుకు చెందిన రైతు నుంచి వారు రూ.23 వేలు కాజేశారు. దీంతో అపరిచితులకు ఫోన్‌పే, జీపే చేయవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

March 4, 2026 / 08:42 AM IST

అలాంటి వాటికి దూరమే మేలు: జాన్వీ కపూర్

బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ కీలక వ్యాఖ్యలు చేసింది. మన గురించి తప్పుగా అర్థం చేసుకుంటున్నారని తెలిసినప్పుడు బాధగా అనిపిస్తుందంటుందని తెలిపింది. కొన్నాళ్లుగా ఆమె సోదరుడు అర్జున్ కపూర్ SMలో ట్రోల్స్‌కి గురవుతున్న నేపథ్యంలో ఆమె స్పందించింది. అలాంటి వేధింపులను క్షమించాల్సిన అవసరం లేదని చెప్పింది. అలాగే, ఇలాంటి నెగిటివిటికీ ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని చెప్పుకొచ్చింది.

March 4, 2026 / 08:41 AM IST

రాజాపూర్ ఎస్సై రాజశేఖర్‌కు సన్మానం

MBNR: రాజాపూర్ మండలానికి నూతన ఎస్సైగా రాజశేఖర్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా మండల అంబేద్కర్ సంఘం నాయకులు శాలువాతో సన్మానించారు. సైబర్ క్రైమ్, అపరిచిత మెసేజీలు సహా నేరాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై తెలిపారు. శాంతి భద్రతల విషయంలో రాజీ ఉండదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు.

March 4, 2026 / 08:41 AM IST

‘ప్రతి హిందువు ఐక్యత చాటేందుకు కృషి చేయాలి’

KDP: ప్రతి హిందువు ఐక్యత చాటేందుకు కృషి చేయాలని విభాగ్ సామాజిక ప్రముఖ్ రవీంద్రనాథ్ రెడ్డి కోరారు. సిద్ధవటం మండలం మాధవరం -1 గ్రామంలోని సీతారాముల ఆలయ ఆవరణలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన హిందూ సద్భావన సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఒంటిమిట్ట ఖండ ప్రముఖ్ రమణారెడ్డి,హిందువులు పాల్గొన్నారు.

March 4, 2026 / 08:40 AM IST

నేడు గరికపాటి నరసింహారావు ప్రవచనం

NGKL: మహా సహస్రావధాని గరికపాటి నరసింహారావు బుధవారం కొల్లాపూర్‌కు రానున్నారు. స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి కళ్యాణమండపంలో సాయంత్రం 5 గంటలకు ఆయన ప్రవచన కార్యక్రమం ఉంటుందని ఆర్యవైశ్య సంఘం నేత సుదర్శన్ శెట్టి తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

March 4, 2026 / 08:38 AM IST

ఇరాన్‌తో HYDకు స్పెషల్ ATTACHMΕΝΤ..!

HYD: ఇరాన్‌తో HYDకు విడదీయరాని అనుబంధం ఉంది. బిర్యానీ, ఇరానీ చాయ్, హలీం, జామున్, జిలేబీ, సమోసా ఇరానీలు పరిచయం చేసినవే. గోల్కొండ, చార్మినార్ చారిత్రక కట్టడాల్లోనూ పర్షియన్ ఆర్కిటెక్చర్ కనిపిస్తుంది. ఇక్కడి తెలుగు, ఉర్దూ భాషలపైనా ఇరాన్ పదాల ప్రభావం ఉంది.

March 4, 2026 / 08:38 AM IST

TTD ఛైర్మన్‌పై దుష్ప్రచారం.. కోర్టు గ్యాగ్ ఆర్డర్

TPT: తనపై జరుగుతున్న విషప్రచారంపై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కోర్టు గ్యాగ్ ఆర్డర్ జారీ చేసిందని TTD ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. ‘ఆధార రహిత కథనాలను ఇకపై ప్రసారం చేయకూడదని, ఇప్పటికే ప్రచురితమైన వాటిని తొలగించాలని కోర్టు ఆదేశించింది. TTD ప్రతిష్ఠను దెబ్బతీయాలనే కుట్రలో ఏఐ, మార్ఫింగ్ వీడియోలతో దుష్ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు కొనసాగుతాయి’ అని ఆయన అన్నారు.

March 4, 2026 / 08:34 AM IST

వేంకటేశ్వర ఉత్సవంలో DSP సత్కారం

AKP: గ్రామాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు విజయవంతం కావాలంటే భక్తుల ఎక్కువ భాగస్వామ్యం అవసరమని నర్సీపట్నం DSP పి.శ్రీనివాసరావు మంగళవారం తెలిపారు. ఉపమాక వేంకటేశ్వర స్వామి కళ్యాణ ఉత్సవాలలో భక్తులకు ఇబ్బందులు లేకుండా పటిష్ఠంగా ఏర్పాట్లు చేశారు. ఈ కృషిని గుర్తించి నక్కపల్లి సొసైటీ ఛైర్మన్ బుజ్జి, గ్రామ సభ్యులు DSPని సత్కరించారు.

March 4, 2026 / 08:34 AM IST

ఘనంగా గుడి బండ్ల జాతర

KNR: వీణవంక మండలం చల్లూరులో వెలసిన రుక్మిణి సత్య భామ సమేత వేణుగోపాలస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను కన్నుల పండువగా నిర్వహించారు. మంగళవారం స్వామివారి ఆలయం చుట్టూ నిర్వహించిన శకటోత్సవం (బండ్లు తిరుగుట) భక్తజన సందోహం మధ్య వైభవంగా జరిగింది. రంగురంగుల పూలు, విద్యుత్ దీపాలతో అలంకరించిన శకటాలపై స్వామివారు కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు.

March 4, 2026 / 08:33 AM IST

పెదగుమ్ములూరు నూకాంబిక ఆలయ ఉత్సవం

AKP: ఎస్.రాయవరం మండలం పెదగుమ్ములూరులో పునర్నిర్మించిన నూకాంబిక అమ్మవారి ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గ్రామంలో అమ్మవారి విగ్రహాన్ని సాంస్కృతిక కార్యక్రమాల మధ్య ఊరేగించి, మహిళలు కలశాలతో భక్తిశ్రద్ధతో పాల్గొన్నారు. మాజీ ఎంపీపీ ఏజెర్ల వినోద్ రాజు, గ్రామ పెద్దలు నవీన్ రాజు తదితరులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.

March 4, 2026 / 08:30 AM IST