• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘స్థానిక సమస్యలు వెంటనే పరిష్కరించాలి’

ప్రకాశం: చంద్రశేఖరపురం మండలం రేగులచిలక పంచాయతీ పరిధిలోని ప్రజల నివాస ప్రాంతాల్లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీపీఎం నాయకుడు కలివెల థామస్ డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీలలో మురుగు కాలవలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సమస్యను గుర్తించి వెంటనే మురుగు కాలవలు ఏర్పాటు చేసి ప్రజలకు ఉపశమనం కల్పించాలని ఆయన కోరారు.

March 8, 2026 / 06:00 PM IST

దొండపాడులో అభయాంజనేయ స్వామి గుడి పునః ప్రతిష్ట

GNTR: తుళ్లూరు మండలం దొండపాడు గ్రామంలో నిర్వహించిన అభయాంజనేయ స్వామి వారి గుడి పునః ప్రతిష్ట కార్యక్రమంలో తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామ ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రార్థనలు చేశారు.

March 8, 2026 / 06:00 PM IST

రాంనగర్‌లో ఘనంగా శ్రీ రామాలయ ప్రారంభోత్సవం

ATP: కనేకల్లు మండలం రాంనగర్‌లో నూతనంగా నిర్మించిన శ్రీ రామాలయ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజలు, హోమాల్లో పాల్గొని శ్రీ సీతారాముల ఆశీస్సులు అందుకున్నారు. ఆలయ నిర్మాణం గ్రామ ప్రజల ఐక్యతకు, భక్తికి నిదర్శనమని కొనియాడారు. ఆలయ నిర్మాణానికి సహకరించిన దాతలను ఎమ్మెల్యే అభినందించారు.

March 8, 2026 / 06:00 PM IST

ద్రాక్షారామ మార్కెట్ కమిటీ నూతన పాలకమండలి ప్రమాణస్వీకారం

కోనసీమ: రామచంద్రపురం మండలం ద్రాక్షారామ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకమండలి ప్రమాణస్వీకారం ఆదివారం మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో అట్టహాసంగా జరిగింది. ఛైర్మన్గా అక్కల రిశ్వంత్ రాయ్, వైస్ ఛైర్మన్గా దడాల నాగేశ్వరి, డైరెక్టర్గా నారపురెడ్డి బలరాం బాధ్యతలు స్వీకరించారు. నూతన పాలకమండలి కృషితో మార్కెట్ యార్డ్ మరింత అభివృద్ధి చెందాలన్నారు.

March 8, 2026 / 06:00 PM IST

మానవత్వాన్ని చాటిన సేవా సంస్థలు

సత్యసాయి: హిందూపురంలోని ప్రశాంతి మందిరం వృద్ధాశ్రమంలో నివసిస్తున్న అనంతపురం జిల్లాకు చెందిన బలిజ పెద్ద సిద్ధన్న అనారోగ్యంతో మృతి చెందారు. సమాచారం అందించినప్పటికీ ఆయన ఇద్దరు కూతుళ్లు రావడం సాధ్యంకాదని తెలిపినట్లు వృద్ధాశ్రమ నిర్వాహకులు తెలిపారు. టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షుడు ఉమర్ ఫారూఖ్ ఖాన్‌ ఆదివారం అంత్యక్రియలు చేసి మానవత్వం చాటుకున్నారు.

March 8, 2026 / 06:00 PM IST

మహిళల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: MLA

NLR: కందుకూరు ZP బాలుర హైస్కూల్లో ICDS, DRDA, మెప్మా శాఖల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఆదివారం నిర్వహించారు. MLA ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొని మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తోందన్నారు. మహిళలు స్వయం శక్తివంతులుగా ఎదిగి సమాజానికి ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు.

March 8, 2026 / 06:00 PM IST

నేలపట్ల గ్రామంలో మహిళా దినోత్సవ వేడుకలు

BHNG: మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలని నేలపట్ల గ్రామ సర్పంచ్ గంగాపురం వసంత నగేష్ గౌడ్ ఆకాంక్షించారు. ఆదివారం గ్రామంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మహిళలు ఎదురయ్యే సవాళ్లను అధిగమించి తమ ప్రజ్ఞాపాటవాలను చాటాలని పిలుపునిచ్చారు.

March 8, 2026 / 06:00 PM IST

మమతా బెనర్జీకి ప్రజలే బుద్ధి చెబుతారు: మోదీ

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై ప్రధాని మోదీ మండిపడ్డారు. రాష్ట్రపతి ముర్ము బెంగాల్‌కు వెళ్తే సత్కరించడానికి బదులు ఆమె పాల్గొనే కార్యక్రమానికి అక్కడి సర్కార్ అనుమతివ్వలేదని తెలిపారు. మురికి రాజకీయాలు చేసే తృణమూల్‌కు బెంగాల్ ప్రజలు త్వరలోనే తగిన బుద్ధి చెబుతారని వాపోయారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో తాము విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

March 8, 2026 / 06:00 PM IST

తడి పొడి చెత్త సేకరణ కార్యక్రమం

PDPL: ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రణాళికలో భాగంగా కమాన్ పూర్ బస్టాండ్ ప్రాంతంలో తడి, పొడి చెత్త సేకరణ కార్యక్రమం నిర్వహించారు. తడి పొడి చెత్త వేరు చేయడంపై ప్రజలకు అవగాహన కల్పించారు. అదేవిధంగా వీధులలో చెత్త వేయకూడదని సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. పంచాయతీ కార్యదర్శి టీ. రాము, గ్రామపంచాయతీ సిబ్బంది చెత్తను వేర్వేరుగా సేకరించారు.

March 8, 2026 / 05:59 PM IST

LOC చెక్కు అందజేత

SDPT: చేర్యాల మండలం తాడూరుకు చెందిన నూకల దేవేందర్ కుమార్తె అనూష కాలు ఆపరేషన్ కోసం కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ మానవత్వం చాటుకున్నారు. ప్రభుత్వ సహకారంతో రూ.1.25 లక్షల విలువైన LOC మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు. ఆపద సమయంలో ఆర్థిక సాయం అందించి ఆదుకున్న కిరణ్ కుమార్‌కు దేవేందర్ కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

March 8, 2026 / 05:58 PM IST

అంగరంగ వైభవంగా రథోత్సవం

JGL: ధర్మపురిలో లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు సర్వాంగ సుందరంగా అలంకరించిన రథాలపై యోగానంద నరసింహ స్వామి, లక్ష్మీ వేంకటేశ్వర స్వామి రామలింగేశ్వర స్వాములను ఆశీనులుగా చేసి బలిహరణ ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. దేవస్థానం నుంచి చింతామణి చెరువు కట్టగా పివబడే వరాహ తీర్థం వరకు తీసుకెళ్తారు.

March 8, 2026 / 05:56 PM IST

మహిళా దినోత్సవం.. ఉపాసన స్పెషల్ పోస్ట్

అంతర్జాతీయ మహిళల దినోత్సవం సందర్భంగా మెగా కోడలు ఉపాసన ప్రత్యేక పోస్ట్ చేసింది. ‘ఈ రోజు నా లైఫ్‌ భిన్నదశల్లో నన్ను నేను అంగీకరించడం కోసమేనని తెలిపింది. ఇలా ఉండడం ఎల్లప్పుడూ సులభం కాదు.. కానీ నా  శ్రేయస్సు, నా కుటుంబం కోసం నా ఆరోగ్యాన్ని ప్రాధాన్యతగా చేసుకోవడంతోనే ప్రేరణ పొందానని’ ‘X’ వేదికగా వెల్లడించింది. అలాగే పలు ప్రత్యేక ఫొటోలను షేర్ చేసింది.

March 8, 2026 / 05:55 PM IST

రైతులకు రాయితీపై కూరగాయల విత్తనాలు

KMM: పాలేరు నియోజకవర్గ రైతులకు ఉద్యాన శాఖ ద్వారా 100% రాయితీపై కూరగాయ విత్తనాలు అందిస్తున్నట్లు ఆదివారం ఉద్యాన అధికారి అపర్ణ తెలిపారు. ఆసక్తి గల రైతులు 89777 14104 నంబరును సంప్రదించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. టమాటా, వంగ, బెండ వంటి 5 రకాల విత్తనాలను చిరు సంచుల రూపంలో పంపిణీ చేస్తున్నారని పేర్కొన్నారు.

March 8, 2026 / 05:53 PM IST

గన్నెల ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే

ASR: అరకులోయ(మం), గన్నెల జీటీడబ్ల్యూఏ బాలికల ఉన్నత పాఠశాలను ఆదివారం ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం తనిఖీ చేశారు. ఈ మేరకు ఆ పాఠశాలల్లో విద్యార్ధులకు అందుతున్న భోజన నాణ్యత, విద్యాబోధన సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. స్టాక్ రూంను పరిశీలించారు. రాబోయో పరీక్షలకు బాగా చదువుకోవాలని విద్యార్ధులకు సూచించారు. విద్యార్ధులకు సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు.

March 8, 2026 / 05:52 PM IST

మెగా రైతు మేళా.. పాల్గొన్న శ్రీధర్ బాబు, తుమ్మల

TG: తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మెగా రైతు మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతుల కోసం ఏర్పాటు చేసిన స్టాళ్లను వారు పరిశీలించారు. అనంతరం రైతులతో మాట్లాడి విశేషాలు తెలుసుకున్నారు.

March 8, 2026 / 05:50 PM IST