• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

4 పరీక్ష కేంద్రాలు 511 మంది విద్యార్థులు

JGL: ఈనెల 14 నుంచి జరిగే 10వ తరగతి పరీక్షల కోసం కథలాపూర్ మండలంలో 4 పరీక్షా కేంద్రాలు కేటాయించినట్లు ఎంఈవో శ్రీనివాస్ శనివారం తెలిపారు. మండలంలోని 13 పాఠశాలల్లో 511 మంది పదో తరగతి విద్యార్థులు ఉన్నారు. కథలాపూర్ మోడల్ స్కూల్, జడ్పీ హైస్కూల్, గంభీర్పూర్ జడ్పీ హైస్కూల్, అంబర్పేట జడ్పీ హైస్కూల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.

March 8, 2026 / 06:39 PM IST

T20 WC FINAL: తుది జట్ల ఇవే..!

IND: సంజూ శాంసన్(w), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శివమ్ దూబే, సూర్యకుమార్(c), హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి/కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, బుమ్రాNZ: టిమ్ సీఫెర్ట్(w), ఫిన్ అలెన్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, మిచెల్ శాంట్నర్(c), జాకబ్ డఫీ, హెన్రీ, ఫెర్గూసన్

March 8, 2026 / 06:38 PM IST

పేకాట స్థావరాలపై దాడి.. ఏడుగురు అరెస్ట్

వరంగల్ నగరంలోని చక్రజ్‌కుంట ప్రాంతంలో కుందూరు వెంకటరెడ్డి ఇంట్లో పేకాట జరుగుతున్నట్టు విశ్వసనీయ సమాచారం అందడంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆదివారం దాడి చేశారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.11,700 నగదు, ఆరు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఏసీపీ మధుసూదన్ వెల్లడించారు.

March 8, 2026 / 06:38 PM IST

చిత్తూరులోని అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు

చిత్తూరులోని అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాగయ్య కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్‌ను వీరు పరిశీలించారు. కుటుంబం, ముందుకు సాగాలంటే మహిళలే ప్రధాన కారణమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలకు బహుమతులు అందజేశారు.

March 8, 2026 / 06:36 PM IST

BREAKING: ఫైనల్.. టాస్ ఓడిన టీమిండియా

టీ20 ప్రపంచ కప్ ఫైనల్‌లో భాగంగా భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడతున్నాయి. అహ్మదాబాద్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకుంది. T20 WC చరిత్రలో ఈ జట్లు ఫైనల్‌లో నిలవడం ఇదే తొలిసారి. అయితే, ICC నిర్వహించిన వన్డే, టెస్టు ఫార్మాట్లలో మూడుసార్లు ఫైనల్‌లో తలపడ్డాయి. వాటిలో కివీస్ 2 సార్లు, భారత్ ఒకసారి గెలిచాయి.

March 8, 2026 / 06:35 PM IST

ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులు అందజేసిన మంత్రి

GNTR: తెనాలి నియోజకవర్గంలో 41 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన రూ.35,42,465 విలువైన చెక్కులను ఆదివారం తెనాలి క్యాంపు కార్యాలయంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పంపిణీ చేశారు. తెనాలి నియోజకవర్గంలో మొత్తం 524 మంది లబ్ధిదారులకు రూ.5,41,63,000 విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి సాయం అందజేసినట్లు తెలిపారు.

March 8, 2026 / 06:35 PM IST

‘ఓకే తాటిపై బీఆర్ఎస్, సీపీఐ కౌన్సిలర్లు’

MNCL: క్యాతనపల్లి మున్సిపాలిటీ ఛైర్మన్ ఎన్నిక మూడు వారాల్లో పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో తమ కౌన్సిలర్లు ఓకే తాటిపై ఉన్నారని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తెలిపారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. గతంలో నిర్ణయించుకున్న ప్రకారం ఛైర్మన్‌గా బీఆర్ఎస్, వైస్ ఛైర్మన్‌గా సీపీఐ ఉంటుందని పేర్కొన్నారు.

March 8, 2026 / 06:32 PM IST

పోలీస్ స్టేషన్ ఆవరణంలో మహిళ కానిస్టేబుళ్లకు సన్మానం

SRPT: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మోతే పోలీస్ స్టేషన్‌లో మహిళా కానిస్టేబుళ్లు విజయ, రేఖలను ఏఎస్సై శ్రీరాములు ఆధ్వర్యంలో ఈరోజు శాలవతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..శాంతిభద్రతల పరిరక్షణలో మహిళ సిబ్బంది అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు.

March 8, 2026 / 06:31 PM IST

సాగర్ ఎడమ కాలువలో వ్యక్తి గల్లంతు..!

NLG: నాగార్జునసాగర్ ఎడమ కాలువలో వ్యక్తి గల్లంతయిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. మండలంలోని తడకమళ్ళ గ్రామ శివారులోని తలుపుల సమీపంలో సాగర్ కాలువలో ఇద్దరి యువకులతో కలిసి స్నానం చేస్తుండగా ప్రమాదశాత్తు ఒక వ్యక్తి గల్లంతయ్యాడు. మరో ఇద్దరు యువకులు కొట్టుకుపోతుండగా స్థానికులు కాపాడారు.

March 8, 2026 / 06:31 PM IST

RPI రాష్ట్ర ఉపాధ్యక్షులుగా అలిగే జీవన్

SRD: రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (RPI) రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నారాయణఖేడ్‌కు చెందిన అలిగే జీవన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తార్నాకలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర ఇంఛార్జి మేజర్ చంద్రకాంత్, రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ డా. గాలి వినోద్ కుమార్ ఆయనకు నియామక పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు ఇతర సభ్యులు పాల్గొన్నారు.

March 8, 2026 / 06:30 PM IST

ఆర్మ్డ్ రిజర్వు పోలీసుల ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం

VZM: అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకల్లో భాగంగా జిల్లా ఆర్మ్డ్ రిజర్వు పోలీసు అధికారులు జిల్లా పోలీసు కార్యాలయంలో అదనపు ఎస్పీ పీ. సౌమ్యలతను కలిసి, మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి, శాలువా, మొమెంటోతో సత్కరించారు. అనంతరం జిల్లా కాన్ఫరెన్స్ హాలులో మహిళా ఆర్మ్డ్ రిజర్వు పోలీసు అధికారులు, సిబ్బందిని శాలువాతో సత్కరించి, మిఠాయిలను పంచారు.

March 8, 2026 / 06:30 PM IST

రోడ్డు ప్రమాదం… ఇద్దరికి తీవ్ర గాయాలు

E.G: విజ్జేశ్వరం గోదావరి గట్టు వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ఓ మోటార్ సైకిల్ నియంత్రణ కోల్పోయి రహదారి పక్కనే ఉన్న అడ్వర్‌టైజ్‌మెంట్ బోర్డును ఢీకొట్టింది. బైక్‌పై ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిని చికిత్స నిమిత్తం నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.

March 8, 2026 / 06:30 PM IST

విస్తృతంగా పర్యటించిన కలెక్టర్, ఛైర్మన్

HNK: దేవన్నపేట, గోపాలపూర్, ఉనికిచెర్ల, ధర్మసాగర్ పరిసర ప్రాంతాల్లో కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్, కుడా ఛైర్మన్ ఇనగాల వెంకటరామిరెడ్డి విస్తృతంగా పర్యటించారు. “మా సిటీ” వెంచర్, పరిసర ప్రాంతాలను వారు క్షేత్రస్థాయిలో పరిశీలించి, రాబోయే రోజుల్లో చేపట్టబోయే భారీ అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చించారు. కార్యక్రమంలో కుడా పీవో అజిత్ రెడ్డి, అధికారులు ఉన్నారు.

March 8, 2026 / 06:29 PM IST

ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ముఖ్య లక్ష్యం: ఎమ్మెల్యే

MBNR: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఆదివారం ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి అన్నారు. హన్వాడ మండలం మాధవరంలో సుమారు రూ.50 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయం, గ్రంథాలయం, సీసీ రోడ్లు, మిషన్ భగీరథ పైపులైన్, ప్రైమరీ హెల్త్ సెంటర్, హైమాస్ట్ దీపాలను ఆయన ప్రారంభించారు. అనంతరం ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తామని అన్నారు.

March 8, 2026 / 06:29 PM IST

పారిశుద్ధ్య పనులు నిర్వహించిన సర్పంచ్

KMM: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఇవాళ బోనకల్ మండల కేంద్రంలో సర్పంచ్ బానోతు జ్యోతి, ఉప సర్పంచ్ కొండ ఆధ్వర్యంలో గ్రామంలో పారిశుద్ధ్య పనులు ప్రారంభించారు. డ్రైనేజీలు, రోడ్లకు ఇరువైపుల ఉన్న చెత్తాచెదారాన్ని తొలగించడం వంటి కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధిలో తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు.

March 8, 2026 / 06:28 PM IST