• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

SDPT: వర్గల్ మండలం నాచారం గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం సాయంత్రం ప్రారంభం అయ్యాయి. బ్రహ్మోత్సవాలకు ఛైర్మన్ పల్లెల రవీందర్ గుప్తా, ఈవో బెల్లంకొండ రంగాచారి ఆధ్వర్యంలో అంకురార్పణ చేశారు. కార్యక్రమంలో ధర్మకర్తలు చందా నాగరాజు, గాలి కిష్టయ్య, నాయకం శ్రీనివాస్, కొత్తపల్లి శ్రీనివాస్, నాచారం సర్పంచ్ సారిక యాదగిరి పాల్గొన్నారు.

March 8, 2026 / 08:20 PM IST

చిరుత సంచారం కలకలం

TG: నాగర్‌కర్నూల్ జిల్లా కోడేరు మండలంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. నర్సాయిపల్లి, మైలారం గ్రామాల్లో చిరుత సంచరిస్తుంది. దీంతో గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

March 8, 2026 / 08:17 PM IST

FINAL: 15 ఓవర్లలో భారత్ స్కోర్ ఎంతంటే?

న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు విధ్వంసం సృష్టిస్తున్నారు. టీమిండియా స్టార్ ఓపెనర్ సంజూ శాంసన్ 45 బంతుల్లో సెంచరీ(89*) పూర్తి చేసుకున్నాడు. 8 సిక్సర్లు, ఐదు ఫోర్లతో సంచలనం సృష్టిస్తున్నాడు. మరోవైపు ఇషాన్ కిషన్ 23 బంతుల్లో హాఫ్ సెంచరీ(53*) పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం టీమిండియా స్కోర్ 203/1 గా ఉంది.

March 8, 2026 / 08:16 PM IST

‘పండుగలను శాంతియుతంగా నిర్వహించుకోవాలి’

ADB: ప్రతి పండుగను ప్రజలందరూ శాంతియుతంగా నిర్వహించుకోవాలని ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్‌ఛార్జ్ కంది శ్రీనివాస రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలో నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇఫ్తార్ విందు ఆధ్యాత్మికతతో పాటు సామాజిక ఐక్యతను కూడా చాటుతుంద‌ని కంది శ్రీ‌నివాస రెడ్డి పేర్కొన్నారు.

March 8, 2026 / 08:15 PM IST

సివిల్స్ పరీక్షలో హన్మాజీ పేట వాసికి 748 వ ర్యాంకు

జగిత్యాల మండలం హన్మాజీపేట గ్రామానికి చెందిన పూదరి మల్లేశం-గంగాలక్ష్మీ దంపతుల కుమారుడు రాహుల్ సివిల్స్ పరీక్షల్లో ప్రతిభ కనబరిచాడు. ఫలితాల్లో ఆయన 748వ ర్యాంక్ సాధించి గ్రామానికి గర్వకారణంగా నిలిచాడు. రాహుల్ విజయంతో హన్మాజీపేటలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. గ్రామస్థులు, స్నేహితులు, బంధువులు ఆయన ఇంటికి చేరుకుని పేరెంట్స్‌కు అభినందనలు తెలిపారు.

March 8, 2026 / 08:14 PM IST

వెంకట్రావు పేట గ్రామంలో డీపీవో పర్యటన

MNCL: గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావు సూచించారు. ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆదివారం ప్రజా ప్రతినిధులు అధికారులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు అందరూ కలిసి పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నలిమెల రాజు, ఎంపీవో శ్రీనివాస్, వార్డు సభ్యులు ఉన్నారు.

March 8, 2026 / 08:14 PM IST

కాలినొప్పి భరించలేక గడ్డి మందు తాగి వ్యక్తి మృతి

PDPL: ధర్మారం మండలం తండా-బి గ్రామానికి చెందిన భూక్యా దేలు (48) మూడు సంవత్సరాల క్రితం జరిగిన ప్రమాదంలో కాలుకు గాయం కావడంతో తీవ్ర నొప్పితో బాధపడుతున్నాడు. నొప్పి భరించలేక గడ్డి మందు తాగగా కరీంనగర్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందాడు. మృతుడి భార్య బుక లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎం. ప్రవీణ్ కుమార్ తెలిపారు.

March 8, 2026 / 08:13 PM IST

నజీర్ అహమ్మద్‌పై ఆరోపణలు ఖండన

KRNL: ఎమ్మిగనూరులో మున్సిపల్ వైస్ ఛైర్మన్ డి.నజీర్ అహమ్మద్‌పై వచ్చిన ఆరోపణలను వైసీపీ నేతలు ఆదివారం ఖండించారు. ఉద్యోగాల పేరుతో డబ్బులు తీసుకున్నారన్న ప్రచారం అసత్యమని తెలిపారు. బాధితులే డబ్బులు ఇవ్వలేదని వీడియోల్లో స్పష్టం చేశారని పేర్కొన్నారు. రాజకీయ కారణాలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

March 8, 2026 / 08:11 PM IST

సాగునీటి ప్రాజెక్టులను వేగవంతం చేయండి: ఎమ్మెల్యే

NGKL: హైదరాబాద్‌లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమీక్షలో ఆదివారం నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డి పాల్గొన్నారు. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని కోరారు. ముఖ్యంగా వట్టెం వెంకటాద్రి రిజర్వాయర్ కాలువ పనులు వెంటనే ప్రారంభించి, వచ్చే ఏడాది కల్లా పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.

March 8, 2026 / 08:11 PM IST

ఘనంగా ప్రాంతీయ మహిళా రైతు సదస్సు

NGKL: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పాలెం పరిశోధన కేంద్రంలో ఆదివారం మహిళా రైతు సదస్సు నిర్వహించారు. సౌత్ తెలంగాణ జోన్ అసోసియేట్ డైరెక్టర్ డా. కృష్ణ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహిళా సాధికారతతోనే అభివృద్ధి సాధ్యమని, మహిళలు స్వయం ఉపాధి దిశగా ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చారు.

March 8, 2026 / 08:11 PM IST

వార్డు సభ్యుల శిక్షణ ముగింపు

GDWL: అయిజ మండలంలో కొత్తగా ఎన్నికైన వార్డు సభ్యుల 5 రోజుల శిక్షణ కార్యక్రమం ఆదివారం ముగిసింది. చివరి రోజున MPDO భాస్కర్ యాదవ్ వెంకటాపురం వార్డు సభ్యులకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. అనంతరం జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో కార్యదర్శి స్వాతి మాట్లాడుతూ.. ఒక బలమైన స్త్రీ తన కోసం తాను నిలబడటమే కాకుండా, సమాజానికి అండగా నిలుస్తుందని పేర్కొన్నారు.

March 8, 2026 / 08:10 PM IST

మహిళా పోలీస్ కానిస్టేబుల్‌కు ఘన సత్కారం

GNTR: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గుంటూరు వెస్ట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో మహిళా సిబ్బందిని గౌరవిస్తూ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ సింగయ్య మాట్లాడుతూ, మహిళా పోలీస్ కానిస్టేబుల్‌ను కుటుంబ సభ్యురాలిగా భావించి సత్కరించడం తమకు గొప్ప గౌరవంగా భావిస్తున్నామని పోలీస్ శాఖలో మహిళా పోలీస్ పాత్ర కీలకమైనదని తెలిపారు.

March 8, 2026 / 08:10 PM IST

జాంభవంతుని విగ్రహ ప్రతిష్టకు విరాళం

BHNG: ఆలేరు మండలం కొలనుపాకలోని శ్రీశ్రీశ్రీ ఆదిజాంభవ మఠంలో జాంభవంతుని విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇంద్రపాలనగర గ్రామ మాదిగ కమ్యూనిటీ సభ్యుల సహకారంతో విగ్రహ ఆవిష్కరణ కోసం రూ.12,000లను చందాగా అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు దాతలను ఘనంగా సన్మానించారు.

March 8, 2026 / 08:10 PM IST

పేద మహిళలకు కట్టుమిషన్లు అందజేసిన ప్రత్తిపాటి

AP: పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొని మహిళా సాధికారతపై కీలక వ్యాఖ్యలు చేశారు. 116 స్వయం సహాయక సంఘాలకు రూ.22.33 కోట్ల విలువైన రుణాల చెక్కులను ఆయన పంపిణీ చేశారు. వీటితో పాటు పేద మహిళలకు కుట్టుమిషన్లు, విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ చేసి వారిని ప్రోత్సహించారు.

March 8, 2026 / 08:09 PM IST

రేపటి నుంచి సైన్స్ కళాశాల తరగతులు

NZB: TU నూతనంగా నిర్మించిన యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమం రేపు నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరి ఉత్తర్వులు జారీ చేశారు. భవన నిర్మాణం పూర్తయి, ఇటీవలే వర్చువల్ వేదికగా సీఎం ప్రారంభించిన నేపథ్యంలో కార్యకలాపాలను కొనసాగించేందుకు రేపటి నుంచి అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. యూనివర్సిటీ సిబ్బంది హాజరుకావాలని పేర్కొన్నారు.

March 8, 2026 / 08:08 PM IST