• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

పేద మహిళలకు కట్టుమిషన్లు అందజేసిన ప్రత్తిపాటి

AP: పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొని మహిళా సాధికారతపై కీలక వ్యాఖ్యలు చేశారు. 116 స్వయం సహాయక సంఘాలకు రూ.22.33 కోట్ల విలువైన రుణాల చెక్కులను ఆయన పంపిణీ చేశారు. వీటితో పాటు పేద మహిళలకు కుట్టుమిషన్లు, విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ చేసి వారిని ప్రోత్సహించారు.

March 8, 2026 / 08:09 PM IST

రేపటి నుంచి సైన్స్ కళాశాల తరగతులు

NZB: TU నూతనంగా నిర్మించిన యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమం రేపు నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరి ఉత్తర్వులు జారీ చేశారు. భవన నిర్మాణం పూర్తయి, ఇటీవలే వర్చువల్ వేదికగా సీఎం ప్రారంభించిన నేపథ్యంలో కార్యకలాపాలను కొనసాగించేందుకు రేపటి నుంచి అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. యూనివర్సిటీ సిబ్బంది హాజరుకావాలని పేర్కొన్నారు.

March 8, 2026 / 08:08 PM IST

విద్యార్థి మృతి.. కుటుంబాన్ని ఓదార్చిన ఎమ్మెల్యే

KRNL: హొళగుంద మండలం సమ్మతగేరి గ్రామానికి చెందిన అడ్వకేట్ లక్ష్మీకాంత కుమారుడు బళ్లారిలో గురుకుల వసతి గృహంలో జరిగిన ఘర్షణలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి గ్రామానికి చేరుకుని మృతదేహానికి ఇవాళ నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

March 8, 2026 / 08:07 PM IST

ఆసిఫాబాద్‌లో 36°C ఉష్ణోగ్రత

ASF: జిల్లా కేంద్రంలో ఆదివారం మధ్యాహ్నం తీవ్ర ఎండల కారణంగా ఉష్ణోగ్రత 36°Cకి చేరింది. మధ్యాహ్న వేళల్లో రోడ్లపై ప్రజలు లేక ఖాళీగా మారాయి. చిన్నపిల్లలు, వృద్ధులు ఇళ్లకే పరిమితమయ్యారు. ఉదయం లేదా సాయంత్రం మాత్రమే బయటికి రావాలని జిల్లా అధికారులు సూచిస్తున్నారు. ఎండాకాలంలో తగినంత నీరు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

March 8, 2026 / 08:06 PM IST

ఆలయానికి హుండీ సమర్పించిన దాతలు

SRD: మనూర్ మండలం బోరంచ నల్ల పోచమ్మ దేవస్థానానికి దాతలు మహా హుండీని బహుకరించారు. మండలంలోని తుమ్నూరు గ్రామానికి చెందిన మంగలి నారాయణ, యాదగిరి, మహేష్ దాదాపు రూ. 65వేలు విలువగల హుండీని ఆలయ ఛైర్మన్ మల్లయ్య ఆధ్వర్యంలో సమర్పించారు. అనంతరం దాతలకు అర్చకులు అమ్మవారి ఆశీస్సులు అందజేశారు. ఇందులో ఆలయ క్లర్కు శివానంద్, అర్చక బృందం, సిబ్బంది శేఖర్ ఉన్నారు.

March 8, 2026 / 08:05 PM IST

‘అభివృద్ధికి నిధులు మంజూరు’

SDPT: నంగునూరు మండలంలోని 12 గ్రామాల అభివృద్ధి కోసం ఇంఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి రూ.60 లక్షల నిధులు మంజూరు చేయించారని టీపీసీసీ కార్యదర్శి దేవులపల్లి యాదగిరి తెలిపారు. మండల కేంద్రంలో సీసీ రోడ్లు, మురికికాలువల కోసం మరో రూ.40 లక్షల నిధులకు ప్రతిపాదనలు పంపినట్లు పేర్కొన్నారు. నిధులు కేటాయించిన మంత్రి వివేక్, సీఎం రేవంత్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలియజేశారు.

March 8, 2026 / 08:05 PM IST

ఇందిరమ్మ గృహాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

WGL: దుగ్గొండి మండల కేంద్రంలోని గుడ్డేలుగులపల్లె గ్రామంలో నిర్మించిన ఇందిరమ్మ గృహాన్ని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులతో కలిసి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యంలో పేదల సొంతింటి కల నెరవేరుతోందని తెలిపారు. అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని అన్నారు.

March 8, 2026 / 08:04 PM IST

సంజూ ఖాతాలో సరికొత్త రికార్డు

న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ప్లేయర్ సంజూశాంసన్ సరికొత్త రికార్డు సంపాదించుకున్నాడు. అత్యధిక వరుస 50+ స్కోర్ ( వరుసగా మూడో హాఫ్ సెంచరీ) సాధించిన ఆటగాడిగా రికార్డు నమోదు చేసుకున్నాడు. గతంలో టీమిండియా బ్యాటర్లలో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఈ ఘనత సాధించారు.

March 8, 2026 / 08:03 PM IST

సింగుపురంలో మెగా క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం(మం) సింగుపురంలో జాకరమ్మ తల్లి యువత ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా క్రికెట్ టోర్నమెంట్‌ను ఎల్విన్‌పేట సీఐ బీ. హరి ప్రారంభించారు. టోర్నమెంట్‌లో 60కి పైగా జట్లు పాల్గొంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. యువత క్రీడలతో పాటు చదువులో రాణించాలని సీఐ సూచించారు.

March 8, 2026 / 08:03 PM IST

ఉపనిషత్ మందిరంలో ఆధ్యాత్మిక ప్రవచనం

శ్రీకాకుళం ఉపనిషత్ మందిరంలో ఆదివారం సాయంత్రం “హనుమంతుడు-కార్యాసాధకుడు” అనే అంశంపై ఆసక్తికర ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమం జరిగింది. ప్రముఖ ప్రవచనకర్త, విశ్రాంత బ్యాంకు మేనేజర్ డీ. జ్ఞానేశ్వర్ పట్నాయక్ తన దైన పంధాలో నిర్వహించిన అధ్యాత్మిక మేధో మధనం శ్రోతల్ని అమితంగా ఆకట్టుకొంది.

March 8, 2026 / 08:03 PM IST

అర్ధనారీశ్వర రూపంలో అమ్మవారి అలంకరణ

SRD: సంగారెడ్డి మండలం ఇస్మాయిల్ ఖాన్ పేట (ఈశ్వరపురం)లోని దుర్గాభవాని ఆలయ 25 వార్షికోత్సవాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. అమ్మవారిని అర్ధనారీశ్వర రూపంలో ప్రత్యేకంగా అలంకరించారు. మహిళలు ఆలయంలో సామూహిక కుంకుమార్చనలు జరిపించారు. చివరి రోజైన సోమవారం రాత్రి 7 గంటలకు ఆలయ ఆవరణలో లక్ష దీపోత్సవ కార్యక్రమం జరుగుతోందని కమిటీ సభ్యులు తెలిపారు.

March 8, 2026 / 08:02 PM IST

భక్తిశ్రద్ధలతో శ్రీ గద్దిరాల మారెమ్మ దేవి రథోత్సవ వేడుకలు

ATP: గుంతకల్లులో ఆదివారం శ్రీ గద్దిరాల మారెమ్మ దేవి 17 వార్షికోత్సవ వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి. ఆలయంలో అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. అమ్మవారి ఉత్సవ విగ్రహానికి ప్రత్యేకంగా అలంకరించి రథములో కొలువు తీర్చి పట్టణంలోని పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.

March 8, 2026 / 08:01 PM IST

ముగిసిన వార్డు సభ్యుల శిక్షణా తరగతులు: ఎంపీడీవో

SRPT: అనంతగిరి మండలంలోని 10 గ్రామాల వార్డు సభ్యులకు నిర్వహించిన శిక్షణ తరగతులు ఆదివారంతో ముగిసినట్లు ఎంపీడీవో హరి సింగ్ నాయక్ తెలిపారు. పారదర్శక పాలన, గ్రామ అభివృద్ధి, ప్రభుత్వ పథకాల అమలుపై సభ్యులకు అవగాహన కల్పించినట్లు ఎంపీడీవో తెలియజేశారు. గ్రామాల అభివృద్ధిలో వార్డు సభ్యుల పాత్ర కీలకమన్నారు.

March 8, 2026 / 08:01 PM IST

మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి: కలెక్టర్

సత్యసాయి: పుట్టపర్తిలోని ఎస్జీ కన్వెన్షన్‌లో డీఆర్‌డీఏ, ఐసీడీఎస్, మెప్మా ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రసంగించారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. 1200 మంది మహిళా పారిశ్రామికవేత్తలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

March 8, 2026 / 08:00 PM IST

జాతీయ స్థాయి పోటీలకు విద్యార్థిని ఎంపిక

KMR: ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాల బీఎస్సీ తృతీయ సంవత్సరం విద్యార్థిని ఎం.అకిత జాతీయ స్థాయి హ్యాండ్బాల్ పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ డాక్టర్ విజయ్ కుమార్ ఆదివారం తెలిపారు. ఈనెల 17న కేరళలోని కొట్టాయం ఎంజీయూ వేదికగా జరిగే సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్లో అకిత తెలంగాణ విశ్వవిద్యాలయం తరఫున పాల్గొననుంది.

March 8, 2026 / 08:00 PM IST