• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

మహిళలను సన్మానించిన ఎమ్మెల్యే

SKLM: మహిళల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే తన కార్యాలయంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. మహిళల ఆర్థిక సాధికారత కోసం ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తోందని పేర్కొన్నారు. మహిళలకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఐదు మండలాల అధికారులు నాయకులు పాల్గొన్నారు.

March 8, 2026 / 06:27 PM IST

రేపు నంద్యాల జిల్లాలో చంద్రబాబు పర్యటన

AP: రేపు నంద్యాల జిల్లా కొత్తబురుజులో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రైతులకు ప్రభుత్వం కొత్తగా రూపొందించిన రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను ఆయన పంపిణీ చేయనున్నారు. అనంతరం రైతులు, కార్యకర్తలతో చంద్రబాబు సమావేశంపై పలు అంశాలపై చర్చించనున్నారు.

March 8, 2026 / 06:23 PM IST

ఘనపూర్‌లో మహిళా దినోత్సవ వేడుకలు

JN: స్టేషన్ ఘనపూర్ మున్సిపల్ ఆఫీసులో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహిళా కౌన్సిలర్లు, సిబ్బందిని అధికారులు, ప్రజా ప్రతినిధులు సన్మానించారు. మహిళలు స్వయం ఉపాధి రంగాల్లో రాణిస్తూ సమాజ అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని వారు అన్నారు.

March 8, 2026 / 06:23 PM IST

జాగృతి అధ్యక్షురాలు కవిత కీలక వ్యాఖ్యలు 

TG: జాగృతి అధ్యక్షురాలు కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళా దినోత్సవం రోజే కాదు.. ప్రతీరోజు మహిళలను గౌరవించాలని సూచించారు. తండ్రి, అన్న, భర్త ఇలా అందరూ మహిళలను తక్కువ చేస్తారని .. అటువంటి ధోరణి మారాలని ఆకాంక్షించారు. సామాజిక తెలంగాణ సాధనలో మహిళల పాత్ర చాలా కీలకమన్నారు.

March 8, 2026 / 06:22 PM IST

సెలవు దినాల్లో పనిచేస్తున్న అధికారులు

AKP: ఇంటి పన్నుల వసూళ్లలో లక్ష్యాన్ని చేరుకోవడానికి అధికారులు సెలవు దినాల్లో కూడా పనిచేస్తున్నారు. ఈనెల 15 నాటికి శత శాతం ఇంటి పన్నులు వసూళ్లు చేయాలని రాష్ట్రస్థాయి అధికారులు లక్ష్యాన్ని నిర్దేశించారు. దీంతో ఎస్. రాయవరం(మం) దార్లపూడిలో డిప్యూటీ ఎంపీడీవో బంగారు సత్యనారాయణ ఆధ్వర్యంలో సిబ్బంది ఆదివారం ఇంటింటికి వెళ్లి స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.

March 8, 2026 / 06:22 PM IST

సేవాలాల్ మహారాజ్ చూపిన బాటలో నడవాలి: ఎమ్మెల్యే

BDK: సంత్ సేవాలాల్ మహారాజ్ చూపిన బాటలో బంజారాలు మరింత అభివృద్ధి సాధించాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. ఆదివారం నవభారత్ ఏరియాలో నిర్వహించిన సేవాలాల్ మహారాజ్ జయంతి భోగ్ బండారు కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. జిల్లా కేంద్రంలో సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ భవనాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో KTDM కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్ పాల్గొన్నారు.

March 8, 2026 / 06:20 PM IST

బాలికపై అఘాయిత్యం ఘటనలో యువకుడిపై పోక్సో కేసు

ATP: శింగనమల మండలంలోని ఓ గ్రామానికి చెందిన 16ఏళ్ల బాలిక గర్భం దాల్చడంతో పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. పదో తరగతి పూర్తి చేసి కూలి పనులకు వెళ్తున్న బాలికను ఓ యువకుడు ప్రేమ పేరుతో మోసగించాడు. బాలిక ఆరు నెలల గర్భవతని తేలడంతో పెద్దలు పెళ్లికి ప్రయత్నించినా యువకుడు నిరాకరించాడు. ICDS అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిపై కేసు నమోదైంది.

March 8, 2026 / 06:20 PM IST

మహిళలకు సరుకులు అందించిన ఎమ్మెల్యే

SRD: ఖేడ్ పట్టణంలోని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సంజీవరెడ్డి 15 మంది నిరుపేద ముస్లిం మహిళలకు రంజాన్ కానుకగా నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. అదేవిధంగా మహిళా దినోత్సవం సందర్భంగా రెండు కుట్టుమిషన్లను పేద మహిళలకు ప్రోత్సాహకంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో జోన్ ఛైర్మన్ రాజ్ కుమార్, స్థానిక అధ్యక్షులు సాయి సంగమేశ్వర్, చంద్రశేఖర్ ఉన్నారు.

March 8, 2026 / 06:20 PM IST

కరుణాపురంలో మహిళా దినోత్సవ వేడుకలు

HNK: కరుణాపురంలో గ్రామ సర్పంచ్ గుర్రపు రీనా ప్రవీణ్ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామంలో విద్య, వైద్యం, సామాజిక సేవ, స్వయం ఉపాధి వంటి వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందిస్తున్న మహిళా మణులను గ్రామ పెద్దలు సన్మానించారు. మహిళలు సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని, ప్రతి రంగంలో మహిళలు ముందుకు రావాలని సర్పంచ్ అన్నారు.

March 8, 2026 / 06:20 PM IST

‘మానవత్వం చాటుకున్న చిలువేరు సమ్మయ్య’

MHBD: కేసముద్రం మండలంలోని తాళ్లపూసపల్లి గ్రామానికి చెందిన నరేటి యాదగిరి-ఎల్లమ్మ దంపతుల కుమారుడు నరేటి శ్రీకాంత్ గౌడ్ మరణించాడు. విషయం తెలుసుకున్న సమ్మిగౌడ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు చిలువేరు సమ్మయ్య గౌడ్, శ్రీకాంత్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆ కుటుంబానికి ఒక క్వింటా బియ్యం, రూ.3000 నగదు అందజేసి తన ఊదారతను చాటుకున్నారు.

March 8, 2026 / 06:20 PM IST

సీఎం పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

NDL: డోన్ మండలం కొత్త బురుజులో ఈ నెల 9వ తేదీన జరగనున్న ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి చేపడుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా ఆదివారం క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించారు. పర్యటన సందర్భంగా నిర్వహించనున్న కార్యక్రమం విజయవంతంగా జరిగేలా చేపడుతున్న ఏర్పాట్లను ఆమె వివిధ కోణాల్లో సమీక్షిస్తూ అధికారులకు పలు సూచనలు చేశారు.

March 8, 2026 / 06:18 PM IST

ఘనంగా ప్రపంచకప్ ముగింపు వేడుకలు

టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌లో భాగంగా భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో ప్రపంచకప్ ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గ్రామీ అవార్డు విన్నర్, ప్రముఖ సింగర్ రిక్కీ మార్టిన్, పంజాబీ పాపులర్ సింగర్ సుఖ్‌బీర్ సింగ్ ప్రత్యేక ఆటపాటలతో అభిమానులను ఆకట్టుకుంటున్నారు.

March 8, 2026 / 06:17 PM IST

మహిళా దినోత్సవం వేడుక కాదు.. ‘పోరాట స్మరణ’

NLG: మహిళా దినోత్సవం సందర్భంగా నల్గొండలోని యూటీఎఫ్ ఆఫీసులో ఐద్వా, సీఐటీయూ తదితర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జిల్లా సదస్సు నిర్వహించారు. తుమ్మల పద్మ, కుంచెం కావ్య, శ్రీవాణి అధ్యక్షత వహించిన ఈసభలో ఐద్వా కేంద్ర కమిటీ సభ్యురాలు పాలడుగు ప్రభావతి మాట్లాడుతూ.. మహిళా దినోత్సవం కేవలం వేడుక కాదని, శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా, సమాన హక్కుల కోసం జరిగిన ‘పోరాట స్మరణ’ అన్నారు.

March 8, 2026 / 06:16 PM IST

మండల ఉత్తమ అంగన్వాడీ టీచర్‌గా సరిత

NZB: కమ్మర్ పల్లి మండలంలోని ఉప్లూర్ గ్రామానికి చెందిన కే.సరిత మండల ఉత్తమ అంగన్వాడీ టీచర్‌గా అవార్డును అందుకున్నారు. ఈ మేరకు ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మ గుట్ట మున్నూరు కాపు కళ్యాణ మండపంలో జి.ఆర్ మెమోరియల్ వెల్ఫేర్ సొసైటీ, ఆక్స్ ఫర్డ్ హైస్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళల దినోత్సవం వేడుకలను నిర్వహించారు.

March 8, 2026 / 06:15 PM IST

T20 WC: ఫైనల్‌లో ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ టీజర్

నేడు T20 WCలో భాగంగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఫైనల్ పోరు జ‌రుగబోతున్న విష‌యం తెలిసిందే. ఈ మ్యాచ్ అటు క్రికెట్ ప్రేమికుల్లో, ఇటు సినీ అభిమానుల్లో భారీ ఉత్కంఠను రేపుతోంది. ఈ మ్యాచ్ మధ్యలో బ్రేక్ సమయంలో పవన్ కళ్యాణ్ హీరోగా.. దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తోన్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ టీజర్‌ను ప్రదర్శించబోతున్న‌ట్లు తెలుస్తుంది.

March 8, 2026 / 06:14 PM IST