SRCL: వేములవాడ మున్సిపల్ శాత్రాజ్పల్లిలో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 2వ వార్డు కౌన్సిలర్ ఏనుగు జ్యోతి ఆధ్వర్యంలో మున్సిపల్ మహిళా పారిశుధ్య కార్మికులను శాలువాలతో ఘనంగా సన్మానించి, వారి సేవలను కొనియాడారు. అనంతరం వారికి ప్రత్యేక బహుమతులుగా చీరలను అందజేసి అభినందించారు.
KRNL: ఆదోని మండలం సంతెకూడ్లురూ గ్రామంలోని ఆరుద సిద్ద లింగేశ్వర స్వామి ఆలయంతో పాటు, బలదూరు గ్రామంలోని ఎల్లమ్మ ఆలయాన్ని ఎంపీ నాగరాజు దర్శించుకున్నారు. ఈ కార్యక్రమాలలో రాష్ట్ర కురువ కార్పొరేషన్ ఛైర్మన్ దేవేంద్రప్ప, డైరెక్టర్లు శ్రీనివాసులు, రామకృష్ణ పాల్గొన్నారు. ఆలయ పూజారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.
VZM: బొబ్బిలి నియోజకవర్గ పరిధిలో ఉన్న మహిళా ప్రజాప్రతినిధులు, మున్సిపల్, మెప్మా, వెలుగు, హెల్త్ డిపార్టుమెంటు సిబ్బందితో కళాభారతిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే బేబీ నాయన మహిళలను సత్కరించారు. సమాజంలో మహిళలది ఎంతో కీలకపాత్ర అన్నారు. అనంతరం మహిళలు ఏర్పాటు చేసిన స్టాళ్లు సందర్శించారు.
ATP: కళ్యాణదుర్గంలోని ప్రజావేదిక కార్యాలయంలో ఆదివారం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబును విద్యుత్ శాఖ నూతన ఈఈ కళ్యాణ్ చక్రవర్తి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలో విద్యుత్ సమస్యలు రాకుండా చూడాలని, ముఖ్యంగా రైతులకు అవసరమైన ట్రాన్స్‌ఫార్మర్లను ఎప్పటికప్పుడు సరఫరా చేసి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
TG: తెలుగు రాష్ట్రాల్లో హల్ చల్ చేసిన అఘోరీ మరోసారి తెరపైకి వచ్చారు. హైదరాబాద్‌లో జరుగుతున్న గో హత్యలపై పోరాటం చేస్తానంటూ వీడియో విడుదల చేసింది. రాష్ట్రంలో చాలా చోట్ల గోహత్యలు జరుగుతున్నాయని సర్కార్ దీనిపై దృష్టి పెట్టాలని సూచించింది.
సత్యసాయి: కదిరి మండలం కుమ్మరోళ్లపల్లిలో గుడి నిర్మాణంలో వున్న అసంపూర్తిగా వున్న విగ్రహాలను ధ్వంసం చేసిన కేసులో వెంకటేష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపినట్లు డీఎస్పీ శివన్నారాయణ స్వామి తెలిపారు. ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఆయన కేసు వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కదిరి టౌన్ సీఐ నారాయణ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
కోనసీమ: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రామచంద్రపురంలో సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళల కోసం పలు వినూత్న కార్యక్రమాలు ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు మంత్రి వాసంశెట్టి సుభాష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ పట్ల అవగాహన కల్పించేందుకు హెచ్‌పీవీ వ్యాక్సిన్‌పై అవగాహన ర్యాలీ నిర్వహించారు.
NLR: కోవూరు పట్టణం శాంతినగర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ నాయకులు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రం వద్ద కొనుగోలు చేసి 24 గంటల్లో రైతులకు డబ్బులు జమ చేస్తామని తెలిపారు. ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే తెలిపారు.
నంద్యాల పట్టణం తెలుగుపేటలోని మద్దిలేటి శ్రీ లక్ష్మీ నృసింహా స్వామి ఆలయంలో స్వామి జన్మ నక్షత్రమైన ‘స్వాతి’ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అదివారం స్వామికి పంచామృతాభిషేకాలు, స్నపన తిరుమంజనం నిర్వహించారు. స్వామి అమ్మవార్లను పట్టు వస్త్రాలతో అలంకరించారు. భక్తులు సామూహిక కుంకుమార్చనలో పాల్గొన్నారు.
TPT: మహిళల సాధికారతతోనే సమాజ అభివృద్ధి సాధ్యమని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ ఎన్. మౌర్యతో కలిసి పాల్గొన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తోందని, అవకాశాలను వినియోగించుకోవలన్నారు.
ELR: నూజివీడు పట్టణంలోని సబ్‌కలెక్టర్ కార్యాలయంలో రేపు ఉదయం 10 గంటలకు మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు సబ్‌కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న తెలిపారు. ఆమె ఆదివారం మాట్లాడుతూ.. రెవిన్యూ డివిజన్ పరిధిలోని ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో అందించవచ్చన్నారు. సమస్యలను నిర్ణీత వ్యవధిలో పరిష్కరిస్తామని పేర్కొన్నారు.
SRPT: కోదాడ ప్రభుత్వ పశు వైద్యశాలను సూర్యాపేట జిల్లా పశు వైద్యాధికారి శ్రీనివాసరావు ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. దాతల సహకారంతో సూర్యాపేట జిల్లాలోనే ఆదర్శంగా నిలుస్తున్న పశు వైద్య బ్యాంక్‌ను ఆయన పరిశీలించారు. వినూత్న పద్ధతుల్లో శస్త్రచికిత్సలు చేస్తూ మూగజీవుల ప్రాణాలు కాపాడుతున్న కోదాడ ఆసుపత్రి సేవలను ఆయన కొనియాడారు.
SKLM: ఎచ్చెర్ల(మం) బుడగట్లపాలెంలో మహిళలు సముద్రపు నాచు (సీ వీడ్) సాగు చేసి మంచి ఫలితాలు సాధిస్తున్నారు. సీఎం చంద్రబాబు సూచనలతో గ్రామంలోని 10 స్వయం సహాయక సంఘాలు గత 8 నెలలుగా సాగు చేస్తున్నారు. ప్రస్తుతం 40 రాఫ్ట్‌లలో సీ వీడ్ పెంచుతున్నారు. ఇటీవల అమృత విశ్వవిద్యాలయం మహిళలకు సీ వీడ్‌తో సబ్బులు, పచ్చళ్లు, ఎరువులు తయారీపై శిక్షణ ఇచ్చింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ చిత్రం ‘AA23’. అయితే, ఈ సినిమా కోసం మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఒక్క మూవీ కోసమే అనిరుధ్ ఏకంగా రూ.25 కోట్లు పారితోషికంగా డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఆదిలాబాద్ పట్టణంలో నూతనంగా స్థాపించిన డా. చంద్రికాస్ ఫెర్టిలిటీ సెంటర్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరై ప్రారంభించారు. ఫెర్టిలిటీ సెంటర్ సభ్యులు ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, తదితరులు ఉన్నారు.