• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘జాతీయ స్థాయిలోనూ రాణించాలి’

WGL: సైబరాబాద్ వేదికగా జరిగిన రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడల్లో పతకాలు సాధించిన వరంగల్ కమిషనరేట్ క్రీడాకారులకు సోమవారం అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన సీపీ సన్ ప్రీత్ సింగ్ క్రీడాకారులను అభినందించారు. విధి నిర్వహణలో ఒత్తిళ్లు ఉన్నప్పటికీ పతకాలు సాధించడం ప్రశంసనీయమని పేర్కొన్నారు. మరింత శ్రమిస్తే జాతీయ స్థాయిలో కూడా పతకాలు సాధించగలమన్నారు.

February 23, 2026 / 08:28 PM IST

‘ఓం శాంతి శాంతి శాంతిః’ ఓటీటీ డేట్ ఫిక్స్

తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా జంటగా నటించిన చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిః’. జనవరి 30న థియేటర్లలోకి విడుదలైన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. మార్చి 4 నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. కోపిష్టి ఓంకార్(తరుణ్), స్వేచ్ఛ కోరుకునే ప్రశాంతి(ఈషా)ల పెళ్లి తర్వాత వారి జీవితాల్లో ఎదురైన నాటకీయ పరిణామాల సమాహారమే ఈ మూవీ కథ.

February 23, 2026 / 08:28 PM IST

‘స్టేషన్ చుట్టూ తిరగకుండా చూడాలి’

PPM: ఫిర్యాదు చేసిన వ్యక్తి పలుమార్లు స్టేషన్ చుట్టూ తిరగకుండా చూడాలని జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవరెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. జిల్లా నలుమూల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించి, వారితో ముఖాముఖి మాట్లాడారు. మొత్తం తొమ్మిది పిర్యాదులు వచ్చాయన్నారు.

February 23, 2026 / 08:27 PM IST

రేపు మహమ్మదాపూర్‌కు మంత్రి రాక

WNP: మంత్రి జూపల్లి కృష్ణారావు రేపు పాల్గల్ మండలం మహమ్మదాపూర్ గ్రామంలో పర్యటించనున్నారు. పూర్తయిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారని జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ గోవర్ధన్ సాగర్ వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులను ఆయన కోరారు.

February 23, 2026 / 08:24 PM IST

వీరభద్ర స్వామికి భక్తుల పవళింపు సేవ

మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం రాత్రి దేవత మూర్తులకు అర్చకులు పవళింపుసేవ నిర్వహించారు. భారీగా తరలివచ్చిన భక్తులు ఉత్సవ విగ్రహాలను ప్రత్యేక రథంపై పురవీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్‌తో పాటు పుర ప్రముఖులు పాల్గొన్నారు.

February 23, 2026 / 08:21 PM IST

‘పరిహారం పెంచి ఇవ్వాలి’

AKP: నక్కపల్లి మండలం రాజయ్యపేటలో 2016లో తీసుకున్న భూములకు రేటు పెంచాలని మత్యకారులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు నక్కపల్లిలో నర్సీపట్నం ఆర్డీవో వీవీ రమణను కలిసి వినతిపత్రం అందజేశారు. అప్పుడు ఎకరం రూ.18 లక్షల మాత్రమే ఇచ్చారన్నారు. ప్రస్తుతం ఇస్తున్న రేట్ల ప్రకారం రూ.32 లక్షలు ఇవ్వాలని కోరారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తానని వారికి తెలిపారు.

February 23, 2026 / 08:21 PM IST

RTCకి కొత్త ఎలక్ట్రిక్‌ బస్సులు

TG: TGRTCకి ఒలెక్ట్రా సంస్థ 1,085 ఎలక్ట్రిక్‌ బస్సులను సరఫరా చేయనుంది. పీఎం ఈ-డ్రైవ్‌ కార్యక్రమంలో భాగంగా ఈ-బస్సులను సరఫరా చేయనుంది. ఈ మేరకు టీజీఎస్‌ ఆర్టీసీ లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌ జారీ చేసింది.

February 23, 2026 / 08:20 PM IST

25న గుంటూరుకు గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్

GNTR: ఏపీ రాష్ట్ర గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ ఈనెల 25న గుంటూరులోని కాటూరి మెడికల్ కాలేజీని సందర్శించనున్నారు. అక్కడ కొత్తగా ఏర్పాటు చేసిన అత్యాధునిక క్యాత్ ల్యాబ్, కార్డియాక్ OTలను ప్రారంభించి, అనంతరం కాలేజీ 22వ గ్రాడ్యుయేషన్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని సూపర్డెంట్ డాక్టర్ కిరణ్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.

February 23, 2026 / 08:20 PM IST

నానో ఎరువులపై రైతులకు అవగాహన

JGL: రైతుల ఆదాయం పెంపు, ఖర్చుల తగ్గింపు, ప్రకృతి వ్యవసాయం నానో ఎరువుల వినియోగంపై సోమవారం మండలంలోని ఎల్లాపూర్ రైతు వేదికలో వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించారు. ధర్మపురి, పెగడపల్లి ఏవోలు రాజకుమార్ శ్రీకాంత్ పాల్గొని సహజ పద్ధతుల్లో సాగు చేయడం ద్వారా భూసారాన్ని మెరుగుపరచడం, రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించడం వల్ల కలిగే లాభాలను రైతులకు వివరించారు.

February 23, 2026 / 08:19 PM IST

ఎగ్జామినేషన్ కిట్స్ పంపిణీ చేసిన కలెక్టర్

W.G: ఉండి మండలం మహాదేవ పట్నం హైస్కూల్‌లో జిల్లా కలెక్టర్ నాగరాణి చేతుల మీదుగా టెన్త్ క్లాస్ విద్యార్థులకు ఎగ్జామినేషన్ కిట్స్ సోమవారం పంపిణీ చేశారు. పూర్వపు విద్యార్థి,దాత అల్లూరి రామకృష్ణంరాజును ఆమె అభినందించారు. జిల్లా గ్రంధాలయ ఛైర్మెన్ జుత్తిగ నాగరాజు, జిల్లా D.E.O. నారాయణ, సమగ్ర శిక్ష A.P.C.శ్యాం సుందర్, H.M. ఎం.జాన్ బాబు పాల్గొన్నారు.

February 23, 2026 / 08:19 PM IST

ఆటో లైన్ వివాదం పలువురిపై కేసులు

KRNL: ఎమ్మిగనూరు ఆటోలు లైన్లో పెట్టుకునే విషయంలో హనుమాపురానికి చెందిన నవీన్, రామాంజి మధ్య వివాదం చోటుచేసుకుంది. ఈ గొడవ గ్రామంలో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణగా మారి పరస్పరం దాడులు, ఆటోల అద్దాల ధ్వంసానికి దారితీసింది. గాయపడిన వారు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇరువురి ఫిర్యాదుల మేరకు 14 మందిపై కేసునమోదు చేసినట్లు SI నిరంజన్ రెడ్డి తెలిపారు.

February 23, 2026 / 08:18 PM IST

అర్జీలను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్

SRPT: ప్రజావాణి ఫిర్యాదులపై అధికారులు తక్షణమే స్పందించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి 99 వినతులు స్వీకరించారు. ఇందులో 48 భూ సమస్యలే ఉన్నాయని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి బాధితులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు.

February 23, 2026 / 08:18 PM IST

ఇంటర్ పరీక్షలకు 133 మంది హాజరు

TPT: ఏర్పేడు మండలం పాపానాయుడుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం జరిగిన ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలకు 138 మందిలో 133 మంది విద్యార్థులు హాజరయ్యారని ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. పరీక్షలు సజావుగా జరిగాయన్నారు. ఏర్పేడు సీఐ బి. శ్రీకాంత్ రెడ్డి నేతృత్వంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

February 23, 2026 / 08:17 PM IST

ఏసీబీకి సమాచారం ఇచ్చిన వ్యక్తి ఇతనే..!

KDP: సింహాద్రిపురం సీఐ వెంకట రమణ, ఎస్సై అనిల్ కుమార్‌లను లంచం కేసులో ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.  ఆయన సమాచారం మేరకు, అధికారులపై మొత్తం రూ.700,000 డిమాండ్ ఆరోపణలు రావడంతో, చివరికి రూ.4 లక్షలకు డీల్ కుదిరినట్లు తెలిపారు. బాధితుడు ఏసీబీని ఆశ్రయించడంతో అధికారులు ఉచ్చుపన్ని, లంచం స్వీకరిస్తున్న సమయంలో ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

February 23, 2026 / 08:16 PM IST

విద్యార్థుల పురుగులు అన్నం ఎలా తినాలి:PDSU

GDWL: తక్కశిల బడిలో ప్రతిరోజూ విద్యార్థుల కంచంలో పురుగులు దర్శనమిస్తున్నాయి అని పిడిఎస్.యు జిల్లా కార్యదర్శి వెంకటేష్ పేర్కొన్నారు. ఎంఈఓ పర్యవేక్షణ లోపంతోనే విద్యార్థులు ఈ నరకాన్ని అనుభవిస్తున్నారని జిల్లా విద్యాశాఖ అధికారికి సోమవారం వినతిపత్రం అందజేశారు. పేద పిల్లల ఆకలిని ఆసరాగా చేసుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే సహించేది లేదన్నారు.

February 23, 2026 / 08:16 PM IST