• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

CM రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి

HNK: సీఎం రేవంత్ రెడ్డిని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి కలిశారు. వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కళాశాల, MGM దవాఖానాల అభివృద్ధి కోసం ఆర్థిక సహాయం ప్రకటించిన ఎన్‌ఆర్‌ఐ వైద్యుడు డాక్టర్ సుజిత్ రెడ్డిని సీఎం అభినందించారు. వరంగల్ ప్రాంతంలో వైద్య సేవల స్థాయిని మరింత పెంచే దిశగా ప్రభుత్వం కూడా అవసరమైన సహకారం అందిస్తుందని సీఎం అన్నారు.

February 27, 2026 / 08:25 PM IST

ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన పరకాల ఎమ్మెల్యే

WGL: గంగదేవిపల్లి, సింగ్యతండా గ్రామాల్లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లును పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రారంభించారు. అర్హులైన పేద ప్రజలకు ఇందిరమ్మ ఇళ్లును మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని, పేద ప్రజల సొంత ఇంటి కళ ప్రజా ప్రభుత్వంలోనే నెరవేరుతోందని, ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని ఎమ్మెల్యే కోరారు.

February 27, 2026 / 08:25 PM IST

ఇందిరమ్మ ఇళ్లును ప్రారంభించిన పరకాల ఎమ్మెల్యే

WGL: గంగదేవిపల్లి, సింగ్యతండా గ్రామాల్లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లును పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రారంభించారు. అర్హులైన పేద ప్రజలకు ఇందిరమ్మ ఇళ్లును మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని, పేద ప్రజల సొంత ఇంటి కళ ప్రజా ప్రభుత్వంలోనే నెరవేరుతోందని, ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని ఎమ్మెల్యే కోరారు.

February 27, 2026 / 08:25 PM IST

అప్రోచ్ రోడ్డు పనులు వేగిరం చేయాలి: కలెక్టర్

పెద్దపల్లి పట్టణంలోని కూనారం ఆర్ఓబి అప్రోచ్ రోడ్డు పనులు వేగిరం చేయాలని కలెక్టర్ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. ఇవాళ ఆయన ఆర్‌వోపీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నెల రోజులలోపు అండర్ పాస్ పనులు పూర్తి చేయాలని తెలిపారు. ఆర్వోబీ పూర్తయ్యలోపు అప్రోచ్ రోడ్డు పనులు పూర్తిచేసి అందుబాటులోకి తేవాలని రైల్వే మరియు ఆర్& బీ అధికారులను ఆదేశించారు.

February 27, 2026 / 08:24 PM IST

కళ్యాణ లక్ష్మి పథకాలు పేదలకు వరం: ఛైర్ పర్సన్

VKB: కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేదల పెళ్లిళ్లకు వికారాబాద్ మున్సిపల్ ఛైర్ పర్సన్ గడ్డం అనన్య పేర్కొన్నారు. శుక్రవారం వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు ఆమె స్థానిక కౌన్సిలర్‌తో కలిసి చెక్కులను పంపిణీ చేశారు.

February 27, 2026 / 08:24 PM IST

పాల కేంద్రాలలో తనిఖీలు చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు

నెల్లూరు: జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలెం, సంఘం మండలాల్లో పాల డైరీలలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. పాలలో కొవ్వు శాతం అధికంగా చూపించేందుకు అన్య పదార్థాలు కలుపుతున్నారని ఆరోపణ రావడంతో తనిఖీలు చేపట్టామని ఫుడ్ సేఫ్టీ అధికారి వెంకటేశ్వరరావు వెల్లడించారు. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామన్నారు.

February 27, 2026 / 08:24 PM IST

కల్వకుర్తిలోని పలు వార్డులో పర్యటించిన నాయకులు

NGKL: కల్వకుర్తి మున్సిపాలిటీలోని 6, 11, 13, 20వ వార్డులలో మున్సిపల్ ఛైర్మన్ భర్త ఆనంద్ కుమార్ వైస్ ఛైర్మన్ శానవాజ్ ఖాన్‌తో కలిసి శుక్రవారం పర్యటించారు. అనంతరం వార్డులలో నెలకొన్న సమస్యలను పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి వారి ఎదుర్కొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు.

February 27, 2026 / 08:23 PM IST

స్ట్రక్చర్ సమావేశంలో కార్మికుల సమస్యలపై చర్చ

MNCL: శ్రీరాంపూర్ ఏరియా జీఎం కార్యాలయంలో శుక్రవారం సింగరేణి యాజమాన్యం, గుర్తింపు సంఘం ఏఐటీయూసీ నాయకులకు మధ్య స్ట్రక్చర్ సమావేశం జరిగింది. జీఎం శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కార్మికులు ఎదుర్కొంటున్న 10 ప్రధాన సమస్యలపై చర్చించారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని జీఎం తెలిపారు. సమావేశంలో నాయకులు కిషన్ రావు, తదితరులు పాల్గొన్నారు.

February 27, 2026 / 08:22 PM IST

డ్వాక్రా బజారును ప్రారంభించిన ఎమ్మెల్యే

NTR: విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన డ్వాక్రా బజారును ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళా సంఘాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, స్వయం సహాయక సంఘాలు ఉత్పత్తులను మార్కెటింగ్ వేదికలను కల్పించడం ద్వారా వారి ఆదాయాలను పెంపొందించేందుకు తోడ్పడతాయని తెలిపారు.

February 27, 2026 / 08:22 PM IST

జనగణన శిక్షణపై కలెక్టర్ దిశానిర్దేశం

అన్నమయ్య: మదనపల్లి ప్రభుత్వ విధానాల రూపకల్పనలో జనగణన గణాంకాలు కీలకమని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన జనగణన దశ-1, గృహ జాబితా శిక్షణలో పాల్గొని మాట్లాడారు. ఖచ్చితమైన సమాచార సేకరణతోనే సంక్షేమ పథకాల అమలు సాఫీగా సాగుతుందన్నారు. ఈసారి సెల్ఫ్ ఇన్యూమరేషన్ విధానం ప్రవేశపెట్టినట్లు తెలిపారు.

February 27, 2026 / 08:20 PM IST

మిస్టరీ స్పిన్నర్ కమ్ బ్యాక్ ఇస్తాడు: పఠాన్

టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గత రెండు మ్యాచ్‌ల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. సౌతాఫ్రికా, జింబాబ్వేలపై చక్రవర్తి భారీగా పరుగులు ఇచ్చాడు. ఈ నేపథ్యంలో అతడిపై విమర్శలు వస్తుండగా.. ఇర్ఫాన్ పఠాన్ అతడికి మద్దతుగా నిలిచాడు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగే మ్యాచ్‌లో చక్రవర్తి ఖచ్చితంగా రాణిస్తాడని పఠాన్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

February 27, 2026 / 08:20 PM IST

సీఎం రేవంత్ కు కొత్తగూడెం ఎమ్మెల్యే లేఖ..!

BDK: కొత్తగూడెం కార్పొరేషన్ పేరును ‘కొత్తగూడెం-పాల్వంచ కార్పొరేషన్’గా మార్చాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలు, సుజాతనగర్లోని 7 గ్రామాలను విలీనం చేసి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే, పాల్వంచ పేరు చేర్చాలని అక్కడి ప్రజల నుంచి డిమాండ్ రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

February 27, 2026 / 08:19 PM IST

పులికోన వద్ద క్షుద్ర పూజల కలకలం

CTR: చౌడేపల్లి మండలం ఆమెనిగుంట గ్రామ సమీపంలో శుక్రవారం పులికోన వద్ద క్షుద్ర పూజల కలకలం రేగింది. నేలపై రక్తం, నిమ్మకాయలు, రకరకాల పూజ సామాగ్రితో ఉండటంతో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేశారని స్థానికులు అనుమానిస్తున్నారు. దీంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 27, 2026 / 08:19 PM IST

కొవ్వొత్తులతో నిరసన చేపట్టిన ఐద్వా సంఘం

WNP: నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో రజక కుటుంబంపై దాడి చేసి 2 నెలల పసికందు మరణానికి కారణమైన అగ్రకుల కుల దృహంకారులను అరెస్ట్ చేయాలని ఆదర్శ్ నగర్ కాలనీలో కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఐద్వా జిల్లా అధ్యక్షురాలు సాయిలీల మాట్లాడుతూ.. ఈ నెల 15 నుంచి జరుగుతున్న కుమ్మెర గ్రామ ఉత్సవాలలో ఆలయంలోకి ప్రవేశించకుండా రజకులను అడ్డుకోవడం అమానుషం అన్నారు.

February 27, 2026 / 08:18 PM IST

బల్కంపేట ఆలయంలో మంత్రి ఆకస్మిక తనిఖీ

TG: హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆకస్మిక తనిఖీ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేశారు. ఆలయ పరిసరాలను పరిశీలించి శుభ్రత, నిర్వహణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు రెండు గంటల పాటు ఆలయ రికార్డులను పరిశీలించి.. అమ్మవారికి చెందిన డిపాజిట్లు, బంగారం, వెండి ఆభరణాల వివరాలను తెలుసుకున్నారు.

February 27, 2026 / 08:17 PM IST