• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

రాష్ట్రం పేరు మార్చడానికి ఎంత ఖర్చవుతుంది?

రాష్ట్రం పేరు మార్చడం అనేది కేవలం కాగితపు పని కాదు. దీనికి దాదాపు వెయ్యి కోట్ల వరకు ఖర్చవుతుంది. రైల్వే స్టేషన్లు, హైవేలు, ప్రభుత్వ భవనాల బోర్డులు మార్చడానికి ఈ భారీ నిధులు అవసరం. తాజాగా కేరళ పేరును కేరళంగా మార్చే ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ ప్రక్రియ వల్ల ప్రభుత్వ ఖజానాపై పెద్ద ఎత్తున భారం పడనుంది.

February 26, 2026 / 02:26 PM IST

ఇసుక మయంగా రోడ్లు.. ప్రజలు అవస్థలు

NLR: నెల్లూరులోని మనుమసిద్దినగర్ వద్ద రోడ్డుపై ఇసుక ఇబ్బందికరంగా ఉంది. ఈ ప్రాంతంలో డ్రైనేజ్ పనుల నిర్మాణానికి రోడ్డు పక్కన ఇసుక తోలారు. నిత్యం వందలాది వాహనాలతో రద్దీగా ఉండే రహదారిపై ఇసుక కనపడక వాహనాలు ప్రమాదానికి గురవుతున్నాయి. అభివృద్ధి పనుల పేరుతో రోడ్లకు అడ్డంగా పనులు చేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. అధికారులు వీటిని అరికట్టాలని కోరుతున్నారు.

February 26, 2026 / 02:24 PM IST

‘ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని తగ్గించాలి’

NLG: దేవరకొండలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డీఎన్టీ హాస్టల్, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ‘ప్లాస్టిక్ వస్తువుల వినియోగం దాని పర్యవసానాలు’ అనే అంశంపై గురువారం వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులకు రాష్ట్ర కార్యదర్శి చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ ప్రశంసాపత్రాలు, బహుమతులు అందజేశారు.

February 26, 2026 / 02:24 PM IST

పెద్ద పులి దాడిలో రెండు ఆవులు బలి

పోలవరం జిల్లాలో పులి సంచారం స్థానికులను భయాందోళనలకు గురిచేస్తోంది. గత కొద్ది రోజులుగా వివిధ గ్రామాల్లో పులి కనిపిస్తున్నట్లు సమాచారం రావడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. గురువారం తెల్లవారుజామున రంపచోడవరం మండలంలోని పెద్దకొండ గ్రామ పరిసర ప్రాంతంలో రెండు ఆవులపై పెద్దపులి దాడి చేసినట్లు గ్రామస్థులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.

February 26, 2026 / 02:23 PM IST

రంజీ ఫైనల్‌: జమ్మూకశ్మీర్‌ ఆలౌట్

కర్ణాటకతో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్‌లో జమ్మూకశ్మీర్‌ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ చేసింది. 527/6 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన ఆ జట్టు 584 పరుగులకు ఆలౌటైంది.  శుభమ్(121) సెంచరీ చేయగా.. హసన్ (88), డోగ్రా (70), సమద్ (61), కన్హయ్య (70), సాహిల్ (72) అర్ధ సెంచరీలతో రాణించారు. బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 5 వికెట్ల ప్రదర్శన చేశాడు.

February 26, 2026 / 02:23 PM IST

పోచమ్మ బోనాల్లో పాల్గొన్న మాజీ మంత్రి

JGL: రూరల్ మండలం రఘురాములకోట గ్రామంలో నిర్వహించిన పోచమ్మ బోనాల పండుగ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి పాల్గొని పోచమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ ప్రజలు, భక్తులతో కలిసి పండుగ వేడుకల్లో పాల్గొని అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

February 26, 2026 / 02:22 PM IST

ఒంటిమామిడిపల్లి పాఠశాలలో కెరీర్ గైడెన్స్ ప్రోగ్రాం

HNK: ఐనవోలు మండలంలోని ఒంటిమామిడిపల్లి పీఎం శ్రీ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో నేడు విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ ప్రోగ్రాం నిర్వహించారు. డాక్టర్ మనోహర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. విద్యార్థులు పరీక్షల పట్ల భయాన్ని, ఒత్తిడిని వదిలి కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని, విద్యతోనే సమాజంలో గౌరవం లభిస్తుందన్నారు.

February 26, 2026 / 02:22 PM IST

ఖుదాబాక్షపల్లిలో ఉచిత పశు వైద్య శిబిరం

NLG: మర్రిగూడ మండలం ఖుదాబాక్షపల్లిలో పశు వైద్య, పశుగణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గురువారం ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ సురేందర్, యమునా ఆధ్వర్యంలో 21 గేదెలకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసి చికిత్స అందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జయలక్ష్మి, గోపాలమిత్ర సూపర్వైజర్ ప్రసాద్ పాల్గొని పశుపోషకులకు అవగాహన కల్పించారు.

February 26, 2026 / 02:21 PM IST

దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే

MDK: రామాయంపేట మండలం కోమటిపల్లి గ్రామంలో శివ పంచాయతన హనుమాన్ దేవాలయంలో విగ్రహ ప్రతిష్ట మహోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు. గురువారం విగ్రహ ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పద్మారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్‌లు చరిత, మాధవి, ప్రవీణ్ పాల్గొన్నారు.

February 26, 2026 / 02:21 PM IST

సకాలంలో టీకాలు వేయాలి: HEO

ADB: గర్భిణీ, బాలింత, చిన్నారులకు సకాలంలో టీకాలు వేయాలని HEO పవార్ రవీందర్ అన్నారు. గురువారం నేరడిగొండ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆసుపత్రిలో వైద్య సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన చికిత్సం అందించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య పర్యవేక్షకులు సంతోష్, స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.

February 26, 2026 / 02:20 PM IST

‘HIT TV’ కథనానికి స్పందన

PLD: నరసరావుపేటలో ఒంటరిగా కనిపించిన బాలుడి వివరాలు ‘HIT TV’లో వార్తగా రావడంతో తక్షణ స్పందన లభించింది. తమ బిడ్డ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఉన్నాడనే సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. సీఐ ఫిరోజ్ సమక్షంలో బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించగా, తమ బిడ్డ ఆచూకీ తెలిపిన పోలీసులకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

February 26, 2026 / 02:20 PM IST

గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

GNTR: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గురుకుల విద్యాలయ సంస్థ ఆధ్వర్యంలో 2026–27 విద్యా సంవత్సరానికి గురుకుల పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా కలెక్టర్ కార్యాలయంలో పోస్టర్లను విడుదల చేశారు. ఇందులో భాగంగా పలువురు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

February 26, 2026 / 02:20 PM IST

‘ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్’ ట్రైల‌ర్ వచ్చేది అప్పుడేనా?

పవన్‌ కళ్యాణ్, హరీష్ శంకర్ క్రేజీ కాంబోలో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ 2026 మార్చి 26న విడుదల కానుంది. ప్రమోషన్లలో భాగంగా మార్చి 9 తర్వాత పవర్ ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. హరీష్ శంకర్ మార్కు డైలాగులు సినిమాలో హైలైట్ కానున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల, రాశిఖన్నా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

February 26, 2026 / 02:20 PM IST

ఇంటర్ పరీక్షకు ఆరుగురు విద్యార్థులు డుమ్మా

SRPT: నడిగూడెంలోని రెండు పరీక్షా కేంద్రాల్లో గురువారం జరిగిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షకు ఆరుగురు విద్యార్థులు డుమ్మా కొట్టారు. పరీక్షల నిర్వహణను చీఫ్ సూపరింటెండెంట్ విజయ, వాణి పర్యవేక్షించారు. ఎస్సై అజయ్ కుమార్ ఆధ్వర్యంలో పరీక్షా కేంద్రాల వద్ద ప్రతిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి.

February 26, 2026 / 02:19 PM IST

‘పది పరీక్షలకు 17 రోజులు మాత్రమే’

AKP: పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు సమయం 17 రోజులే ఉందని డీఈవో అప్పారావు నాయుడు అన్నారు. ప్రతి ఆదివారం నిర్వహించే డయల్ యువర్ టీచర్ ప్రోగ్రాం ప్రతిరోజు చేయడానికి సంబంధిత సబ్జెక్ట్ టీచర్స్ ముందుకు వచ్చినట్లు పేర్కొన్నారు. ప్రతిరోజు రాత్రి ఆరు గంటల నుంచి 9 గంటల వరకు ఉపాధ్యాయులు అందుబాటులో ఉండి ఫోన్ ద్వారా విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తారన్నారు.

February 26, 2026 / 02:19 PM IST