• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

మిరియాలతో ఆరోగ్యం..!

మిరియాలు శ్వాసకోశ సంబంధిత సమస్యలకు అత్యుత్తమ మందు. మిరియాల పొడిని నెయ్యితో లేదా తేనెతో తీసుకుంటే మొండి దగ్గు, గొంతులో పేరుకుపోయిన కఫం కరిగిపోతాయి. ఇందులో ఉండే ‘పైపెరిన్’ అనే పదార్థం మనం తీసుకునే ఆహారంలోని పోషకాలను శరీరం గ్రహించేలా చేస్తుంది. మిరియాలు శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపి చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి. తలనొప్పి ఉన్నప్పుడు మిరియాల కషాయం తాగితే ఉపశమనం లభిస్తుంది.

February 27, 2026 / 04:00 PM IST

‘బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే చర్యలు తప్పవు’

ప్రకాశం: బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తప్పవని మార్కాపురం సీఐ సుబ్బారావు హెచ్చరించారు. శుక్రవారం పట్టణంలోని పూల సుబ్బయ్య కాలనీలో మద్యం సీసాలను స్థానిక ప్రజలతో కలిసి తొలగించారు. అలాగే జేసీబీతో పిచ్చికంప, పరిసరాలను శుభ్రం చేయించారు. పబ్లిక్ ఏరియాలో మద్యం సేవించడం వల్ల శాంతి భద్రతలకు ఆటంకం ఏర్పడుతుందని, అటువంటి పనులకు దూరంగా ఉండాలన్నారు.

February 27, 2026 / 03:57 PM IST

నేను ఆరోగ్యంగానే ఉన్నా: మాజీమంత్రి బొత్స

AP: తాను ఆరోగ్యంగానే ఉన్నానని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. తన ఆరోగ్యంపై ఆందోళన అవసరం లేదన్న బొత్స.. రొటీన్ చెకప్‌లో భాగంగా ఆస్పత్రికి వచ్చినట్లు చెప్పారు. కాగా, బొత్స అస్వస్థకు గురయ్యారంటూ సోషల్ మీడియాలో వార్తలు రావడంతో ఆయన స్పందించారు.

February 27, 2026 / 03:56 PM IST

శ్రమించినా దక్కని ఫలితం

ASF: పురిటి నొప్పులతో తీవ్రంగా బాధపడిన ఆవుకు 2 గంటలపైగా శ్రమించి పశు వైద్యులు మురళి ప్రసవం చేశారు. ఆసిఫాబాద్ మండలం మాణిక్ గుడాకి చెందిన రైతు కన్నెరాం ఆవు శుక్రవారం పురిటి నొప్పులతో బాధపడింది. పరిస్థితిని గమనించిన ఉప సర్పంచ్ అజయ్ పశువైద్య సిబ్బందికి సమాచారం అందించారు. 2 గంటలపైగా శ్రమించి దూడను వైద్యులు బయటకు తీయగా దూడ మృతి చెందిందని తెలిపారు.

February 27, 2026 / 03:55 PM IST

పంచాయతీ భవనాల నిర్మాణానికి భూమి పూజ

KMR: మహమ్మద్ నగర్ మండలం తెల్గాపూర్, హాసన్‌పల్లి గ్రామాల్లో శుక్రవారం గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణానికి భూమి పూజ చేశారు. గాలిపూర్‌లో అంగన్‌వాడీ భవన నిర్మాణానికి జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీ కాంతారావు శంకుస్థాపన చేశారు. సుమారు రూ.52 లక్షల వ్యయంతో ఈ పనులు చేపట్టనున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి గ్రామానికి మౌలిక సదుపాయాలు ఉంచడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

February 27, 2026 / 03:55 PM IST

జాతీయ రహదారిపై వాహనం బోల్తా

SDPT: నంగునూరు(మం) రాంపూర్ వద్ద సిద్దిపేట-వరంగల్ జాతీయ రహదారిపై శుక్రవారం పెను ప్రమాదం తప్పింది. సిద్దిపేట నుంచి వరంగల్ వెళ్తున్న వాహనం ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి బోల్తా పడింది. జనరేటర్ లోడుతో ఉన్న ఈ వాహన బోల్తా కొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు విచారణ చేపట్టారు.

February 27, 2026 / 03:53 PM IST

భారత్‌తో వన్డే సిరీస్ ఆస్ట్రేలియా కైవసం

ఆస్ట్రేలియా మహిళా జట్టుతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఓటమిపాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 251 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 36.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆసీస్ ప్లేయర్ జార్జియా వోల్ (101) సెంచరీతో అదరగొట్టగా, లిచ్‌ఫీల్డ్ (80) పరుగులతో రాణించింది. వరుసగా 2 విజయాలతో ఆసీస్.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది.

February 27, 2026 / 03:53 PM IST

హాలీవుడ్ మూవీకి నో చెప్పిన దీపికా..?

స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే ఒక హాలీవుడ్ చిత్రంలో నటించే అవకాశాన్ని వదులుకున్నట్లు తెలుస్తోంది. ‘ది వైట్ లోటస్’ సీజన్-4లో కీలక పాత్రలో నటించే ఛాన్స్‌ను దీపిక వద్దనుకున్నట్లు ప్రచారం సాగుతోంది. దీంతో ఆమె ఈ అవకాశాన్ని ఎందుకు వదులుకుందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. దీపిక గతంలో ‘xXx: రిటర్న్ ఆఫ్ క్సాండర్ కేజ్’ అనే హాలీవుడ్ చిత్రంలో నటించింది.

February 27, 2026 / 03:53 PM IST

గుంటూరు పశ్చిమ టీడీపీ కార్యాలయంలో గ్రీవెన్స్

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఆదేశాల మేరకు శుక్రవారం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. పలు శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది అర్జీలు స్వీకరించి వివరాలు నమోదు చేశారు.

February 27, 2026 / 03:52 PM IST

అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతుల తనిఖీ

KMR: రాజంపేట మండలం అరగొండలో ఎంపీడీవో బాలకృష్ణ అంగన్వాడీ కేంద్రంలోని మౌలిక వసతులు, ప్రైమరీ స్కూల్, ఉపాధి హామీ పనులను, ఇందిరమ్మ ఇళ్లను శుక్రవారం పరిశీలించారు. తనిఖీ చేసి అక్కడ స్టాక్ రిజిస్టర్లు, పిల్లలు, గర్భిణులు, బాలింతలు తినే మధ్యాహ్న భోజనాలను రుచి చూశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ విక్రాంత్ రెడ్డి, ఉపసర్పంచ్ తుల రవి, ఏపీవో శృతి పాల్గొన్నారు.

February 27, 2026 / 03:52 PM IST

డీజీపీని కలిసిన కల్వకుంట్ల కవిత

TG: నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర జాతర ఘటనపై కల్వకుంట్ల కవిత DGPని కలిశారు. కవితతో పాటు ఆర్. కృష్ణయ్య, విశారదన్ కూడా ఉన్నారు. కుమ్మెర ఘటనలో పసిపాప మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

February 27, 2026 / 03:52 PM IST

‘సీఎం సహకారంతో అభివృద్ధికి కృషి చేస్తున్నాం’

NTR: విజయవాడ బెంజ్ సర్కిల్, లారీ ఓనర్స్ హాల్, పరిసర ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు సులువుగా సాధించడానికి నేషనల్ హైవేస్ ఇంజనీర్లతో కలిసి ఎంపీ కేసినేని చిన్ని శుక్రవారం చర్యలు చేపట్టారు. ఎంపీ మాట్లాడుతూ.. విజయవాడ గ్రేటర్ కాకముందే త్రాగునీటి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యలతో పాటు నగర అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు సహకారంతో కృషి చేస్తున్నామని తెలిపారు.

February 27, 2026 / 03:50 PM IST

విధుల నిర్వహణలో అంకితభావం చూపాలి: కలెక్టర్

ADB: ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమమైన ‘భూ భారతి’లో భాగంగా శిక్షణ పూర్తి చేసుకున్న సర్వేయర్లు ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించాలని శుక్రవారం కలెక్టర్ రాజర్షిషా సూచించారు. రెండవ విడతలో శిక్షణ పొంది ఉత్తీర్ణులైన 65 మంది లైసెన్స్డ్ సర్వేయర్లకు లైసెన్స్‌లను అందజేశారు. కఠినమైన శిక్షణను విజయవంతంగా పూర్తి చేశామన్నారు.

February 27, 2026 / 03:50 PM IST

సేవాలాల్ జయంతి వేడుకకు పీవో, ఎస్పికి ఆహ్వానం

BDK: ఇల్లందు నియోజకవర్గ కేంద్రంలోని సింగరేణి గ్రౌండ్‌లో రేపు నిర్వహించబోయే సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ముగింపు వేడుకలకు హాజరుకావాలని ఐటీడీఏ పీవో రాహుల్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజుకు మార్కెట్ కమిటీ ఛైర్మన్ రాంబాబు ఆహ్వాన పత్రికను శుక్రవారం అందజేశారు. ఈ వేడుకకు ఎమ్మెల్యే కోరం కనకయ్య, ఎంపీ బలరాం నాయక్ హాజరు అవుతారని తెలిపారు.

February 27, 2026 / 03:49 PM IST

మంచ్య తండా సర్పంచ్ భద్రమ్మకు శిక్షణ పత్రం అందజేత

SRPT: మఠంపల్లి మండలంలోని మంచ్య తండా నూతన సర్పంచ్‌గా ఎన్నికైన మలోత్ భద్రమ్మ ఐదు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. శుక్రవారం ముగిసిన ఈ శిక్షణలో భాగంగా డీఎల్‌పీవో చేతుల మీదుగా ఆమె శిక్షణ పత్రాన్ని అందుకున్నారు. ​ఈ సందర్భంగా భద్రమ్మ మాట్లాడుతూ.. శిక్షణలో నేర్చుకున్న అంశాలతో గ్రామ పంచాయతీ పాలనను పారదర్శకంగా నిర్వహిస్తామన్నారు.

February 27, 2026 / 03:49 PM IST