WNP: తెలంగాణ క్రీడా స్పోర్ట్స్ స్కూల్ హకింపేట్ మరి ఆదేశాలు మేరకు జిల్లా నుంచి 10 మంది బాలురు,10 మంది బాలికలు 4వ తరగతి ప్రవేశానికి వనపర్తి జిల్లాలో ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు యువజన అధికారి సుధీర్ రెడ్డి తెలిపారు. అర్హులైన వారు ఫిబ్రవరి 26 నుంచి మార్చి 4 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. వెబ్‌సైట్లో http:/tgss.telangana.gov.in లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
MDK: నిజాంపేట మండలంలో 120 ఎకరాలలో ఆయిల్ ఫామ్ సాగు చేసేందుకు గుర్తించినట్లు లీవ్ ఫామ్ రిసోర్సెస్ కంపెనీ ఫీల్డ్ ఆఫీసర్ సుజాత తెలిపారు. నార్లాపూర్‌లో నారాయణ, లక్ష్మి రైతుల భూముల్లో ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ చేపట్టారు. ఆయిల్ ఫామ్ తోటల ప్లాంటేషన్ చేసిన రైతులు సబ్సిడీ అందజేస్తున్నట్లు వివరించారు. రైతులు ఆయిల్ ఫామ్ తోటలు సాగు చేసేందుకు ముందుకు రావాలన్నారు.
NGKL: పోలీసులపై మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి ఫైర్ అయ్యారు. బుధవారం జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా మర్రి మాట్లాడుతూ.. ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్న పోలీసు అధికారుల పేర్లు పింక్ బుక్లో రాస్తామన్నారు. అత్యుత్సాహం చూపిన ఏ పోలీసు అధికారిని వదిపెట్టామని హెచ్చరించారు.
భారత యూజర్ల కోసం వాట్సాప్ సిమ్ వెరిఫికేషన్‌ను తెస్తోంది. దీంతో సైబర్ నేరాలకు చెక్ పెట్టనుంది. ఇప్పటివరకు ఫోన్‌లో సంబంధిత అకౌంట్ సిమ్ లేకపోయినా వేరే డివైజ్‌లో ఆ ఫోన్ నంబర్‌కు వచ్చే ఓటీపీతో వాట్సాప్‌లో లాగిన్ కావొచ్చు. దీంతో వేరే వ్యక్తులు వాట్సాప్ వాడుకునే అవకాశం ఉంది. కొత్త వెరిఫికేషన్‌తో సిమ్ ఫోన్‌లో ఉంటేనే లాగిన్ అవకాశం ఉంటుంది.
PPM: అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్రీడ పోటీలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. ఇప్పటికే కబడ్డీ, టేక్ ఆఫ్ వారు వంటి ఆటలు పూర్తికాగా బుధవారం క్రికెట్ పోటీలు సందడిగా సాగాయి. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కెప్టెన్‌గా వ్యవహరించిన టీంలో ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర పాల్గొన్నారు. బ్యాటింగ్, బౌలింగ్ చేసి క్రికెట్లో సత్తా చాటారు.
MNCL: పదవ తరగతి విద్యార్థులు పరీక్ష సమయంలో ఎలాంటి మానసిక ఒత్తిడికి గురికావద్దని పీఎంశ్రీ పాఠశాలల వ్యక్తిత్వ వికాస నిపుణులు, రాష్ట్రపతి అవార్డు గ్రహీత గుండేటి యోగేశ్వర్ అన్నారు. బుధవారం భీమారంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో మాట్లాడుతూ.. పరీక్షల సమయంలో, పరీక్ష రోజు ఎలా చదవాలో జ్ఞాపకశక్తి పెంచుకునే పద్ధతులను నేర్పించారు.
మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్ష రాసే విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ మహమ్మదాబాద్ మండల కేంద్రంలోని ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పరీక్షా కేంద్రాల వద్ద అన్ని రకాల మౌలిక వసతులను ఏర్పాటు చేయాలని సూచించారు.
ADB: ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు ‘లెర్న్ స్మార్ట్ విత్ AI’ కార్యక్రమాన్ని కలెక్టర్ రాజర్షి షా ప్రారంభించారు. బుధవారం ఆదిలాబాద్ ప్రభుత్వ బాలికల ఆశ్రమ పాఠశాలలో ఐటీడీఏ, ధ్యేయ లెర్నింగ్ సొల్యూషన్స్ సంయుక్తంగా ఈ శిక్షణను చేపట్టాయి. కృత్రిమ మేధతో విద్యాబోధన విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తుందన్నారు.
W.G: జిల్లాలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను ఈనెల 28నే పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. మార్చి 1 ఆదివారం కావడంతో, ప్రభుత్వం ఒకరోజు ముందుగానే పంపిణీకి ఉత్తర్వులు జారీ చేసిందని వివరించారు. జిల్లాలో 2,22,982 మంది లబ్ధిదారులకు రూ. 96.3 కోట్లను సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. శనివారం ఉదయమే లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్లు అందజేయాలన్నారు.
ASF:ఆ సిఫాబాద్ పట్టణంలో ఇటుక లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటన రద్దీ ప్రాంతంలో చోటుచేసుకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తూ ఎవరికి గాయాలు కాలేదు. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాక్టర్ను పక్కకు తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు.
VZM: విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడమే ముఖ్య లక్ష్యంగా వక్త పోటీలను నిర్వహించినట్లు జనవిజ్ఞాన వేదిక జనవిజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎరుకొండ ఆనంద్, మిరియాల కృష్ణారావు తెలిపారు. జనవిజ్ఞాన వేదిక జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి వక్త పోటీలను బుధవారం గురజాడ పాఠశాలలో నిర్వహించారు. అనంతరం విజేతలకు నగదు బహుమతి అందజేశారు.
VSP: ఒడిశా గవర్నర్ హరిబాబు 26 నుంచి మార్చి 5 వరకు విశాఖలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు విద్యా, సాంస్కృతిక కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఫిబ్రవరి 26న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్లో పుస్తకావిష్కరణ, అనంతరం నోవోటెల్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొంటారు. 27న బాలాజీ హైఫీల్డ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ వార్షికోత్సంలో పాల్గొననున్నారు.
SRPT: యజమాని నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. వల్లభాపురం శివారులోని ఇటుక బట్టీలో మట్టి తొక్కుతుండగా ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడటంతో డ్రైవర్ పల్లపు రాజు(40) అక్కడికక్కడే మృతి చెందాడు. కండిషన్ లేని వాహనాన్ని నడపాలని యజమాని చల్లా నాగరాజు ఒత్తిడి చేయడమే ప్రమాదానికి కారణమని పోలీసులు తేల్చారు. ఈరోజు నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.
PLD: నాదెండ్ల(M) ఇర్లపాడుకు చెందిన మంజుభార్గవి ఫిర్యాదు మేరకు కృష్ణా జిల్లా ఆర్టీసీ కానిస్టేబుల్ మేకల నరేంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ సుబ్బనాయుడు పర్యవేక్షణలో నాదెండ్ల ఎస్ఐ ఈ కేసు దర్యాప్తు చేశారు. సోమవారం అదుపులోకి తీసుకున్న నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి అతనికి 14 రోజుల రిమాండ్ విధించడంతో బుధవారం పోలీసులు జైలుకు తరలించారు.
కొలంబో వేదికగా న్యూజిలాండ్, శ్రీలంక మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే, ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉందని ఆక్యూవెదర్ పేర్కొంది. ఒకవేళ వర్షంతో మ్యాచ్ రద్దయితే, ఇరు జట్లు పాయింట్లను పంచుకోవాల్సి ఉంటుంది. అప్పుడు 2 మ్యాచ్‌ల్లో 2 పాయింట్లతో NZ.. 2 మ్యాచ్‌ల్లో ఒక పాయింట్‌తో SL, PAK ఉంటాయి. దీంతో సెమీస్ చేరాలంటే చివరి మ్యాచ్ గెలవడం వీటికి కీలకం కానుంది.