• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

మల్కాపూర్ గ్రామంలో అంగన్వాడీ కేంద్రం తనిఖీ

BHNG: ఎం తుర్కపల్లి మండలంలోని మల్కాపూర్ గ్రామంలో శుక్రవారం సర్పంచ్ సొన్నాయిల రఘు అంగన్వాడీ కేంద్రంలో అకస్మాత్తుగా తనిఖీ చేశారు. మెనూ ప్రకారం పాలు, గుడ్లు, మురుకులు, పెడుతున్నారని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోషక పదార్థాలను పిల్లలకు టైం ప్రకారం పెట్టాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బాలయ్య , వార్డు వార్డు మెంబర్లు, పాల్గొన్నారు.

February 27, 2026 / 01:17 PM IST

‘రోడ్డు మరమ్మతులు చేపట్టాలి’

VKB: నవాబ్‌పేట్ మండలం ఏక్మామిడి గ్రామ సమీపంలో రోడ్డు నిర్మాణం మధ్యలోనే నిలిపివేశారు. కంకర తేలిపోయి వాహనదారులకు ప్రయాణం నరకంగా మారింది. ‘అర్ధాంతరంగా వదిలేసిన రోడ్డు పనులు వెంటనే పూర్తి చేయాలి. ప్రయాణ సౌకర్యం కల్పించాలని అధికారులు ప్రజా ప్రతినిధులు స్పందించాలని కోరుతున్నాం’ అని వాహనదారులు వ్యాఖ్యానించారు.

February 27, 2026 / 01:17 PM IST

స్పోర్ట్స్ స్కూల్ ఎంపికలు: DYSO పవన్ కుమార్

NZB: రాష్ట్రంలోని హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్, హన్మకొండ క్రీడా పాఠశాలల్లో ప్రవేశాల ప్రక్రియ గురువారం నుంచి మొదలైంది అన్ని DYSO పవన్ కుమార్ తెలిపారు. 3వ తరగతి పూర్తి చేస్తున్న విద్యార్థులు అర్హులన్నారు. మార్చి 13 నుంచి 17 వరకు మండల, మార్చి 28 నుంచి ఏప్రిల్ 1 వరకు జిల్లా, ఏప్రిల్ 27 నుంచి మే 1 వరకు రాష్ట్ర స్థాయి ఎంపికలు ఉంటాయి అన్ని అన్నారు.

February 27, 2026 / 01:15 PM IST

చిరు వ్యాపారుల దుకాణాలు కూల్చడం అక్రమం: కంచర్ల

నల్లగొండ ప్రకాశం బజార్‌లో చిరువ్యాపారుల తొలగింపును మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ముందస్తు నోటీసులు లేకుండా షాపులు కూల్చడం దుర్మార్గమని, అధికారుల తోపులాటలో గాయపడ్డ పండ్ల వ్యాపారి అమీర్‌ను ఆయన శుక్రవారం పరామర్శించారు. ప్రభుత్వం చిరువ్యాపారులకు నష్టపరిహారం చెల్లించి, శాశ్వత ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు.

February 27, 2026 / 01:15 PM IST

ఏప్రిల్ 1 నుంచి ‘వీబీజీ రామ్ జీ’ నూతన చట్టం అమలు

KRNL: ఏప్రిల్ 1 నుంచి ‘వికసిత్ భారత్ జి రామ్ జీ’ (VBG Ram Ji) నూతన చట్టం అమల్లోకి వస్తుందని పెద్దకడబూరు APO చంద్రశేఖర్ తెలిపారు. ఇవాళ MPDO కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. పనిదినాలను 100 నుంచి 125 రోజులకు పెంచినట్లు పేర్కొన్నారు. వేతనాల చెల్లింపు ఆలస్యమైతే వడ్డీతో కలిపి ఇస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు లక్ష్మన్న ఉన్నారు.

February 27, 2026 / 01:15 PM IST

‘మండలి ఛైర్మన్ సభా గౌరవం కాపాడాలి’

AP: శాసనమండలి ఛైర్మన్ సభా గౌరవం కాపాడాలని ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. లడ్డూపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, మంత్రి సమాధానం చెబుతుండగా ఛైర్మన్ అడ్డుకున్నారని తెలిపారు. మండలి ఛైర్మన్ పార్టీ మనిషిగా కాకుండా ప్రజల మనిషిగా వ్యవహరించాలని సూచించారు. 

February 27, 2026 / 01:15 PM IST

మెడికల్ మాఫియాపై రేపు సీపీఐ నిరసన

GNTR: వైద్య రంగంలో మాఫియా ఆగడాలకు వ్యతిరేకంగా రేపు డీఎంహెచ్‌ఓ కార్యాలయం వద్ద నిరసన చేపట్టనున్నట్లు సీపీఐ నేతలు అరుణ్, అంజిబాబు తెలిపారు. శుక్రవారం కొత్తపేటలో మాట్లాడుతూ..పేదలపై వైద్య భారం పెరిగిపోయిందని, ప్రభుత్వ నిర్లక్ష్యంతో మాఫియా ఆగడాలు మితిమీరాయని విమర్శించారు. కావున మెడికల్ మాఫియాకు వ్యతిరేకంగా రేపు ప్రజా సంఘాలు తమ గళాన్ని వినిపించాలని కోరారు.

February 27, 2026 / 01:15 PM IST

గ్రంథాలయాల ఆధునీకరణపై ఛైర్మన్ కీలక చర్చ

ATP: రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ ఛైర్మన్ కోటేశ్వరరావుతో ఉమ్మడి అనంతపురం జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ వడ్డే వెంకట్ తాడేపల్లిలో భేటీ అయ్యారు. జిల్లాలోని గ్రంథాలయాల అభివృద్ధి, భవనాల మరమ్మతులు, నూతన పుస్తకాల కొనుగోలుకు నిధులు కేటాయించాలని కోరారు. పారదర్శకత కోసం సిబ్బందికి ఫేస్ రికగ్నైజేషన్ హాజరు విధానం అమలు చేయాలని ప్రతిపాదించారు.

February 27, 2026 / 01:13 PM IST

‘ముందస్తు అడ్మిషన్లపై DSF ఆందోళన’

KRNL: ఆదోని డివిజన్‌లో ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్నాయని DSF నేతలు ఇవాళ ఆరోపించారు. ప్రెస్‌మీట్‌లో రాష్ట్ర అధ్యక్షుడు ఉదయ్, రాష్ట్ర కార్యదర్శి బాలు మాట్లాడుతూ.. తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిబంధనలు పాటించకపోతే గుర్తింపు రద్దు చేసే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు.

February 27, 2026 / 01:13 PM IST

‘ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజాధర్బార్’

అన్నమయ్య: ప్రజా సమస్యల పరిష్కారానికి ” ప్రజాదర్బార్” కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు TDP పార్టీ రాజంపేట ఇన్‌ఛార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు పేర్కొన్నారు. శుక్రవారం రాజంపేటలోని స్థానిక పార్టీ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. చమర్తి మాట్లాడుతూ.. ప్రజాదర్బార్‌లో వచ్చిన ఫిర్యాదుల సమస్యలను ఆయా శాఖల అధికారులు తక్షణమే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు.

February 27, 2026 / 01:13 PM IST

ప్రజల ముంగిటకే పాలన: కలెక్టర్ వినోద్

BPT: అధికారులు విధులకు పరిమితం కాకుండా నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలని బాపట్ల కలెక్టర్ వినోద్ కుమార్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో దివ్యాంగులు, ఎస్టీల ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ‘బాపట్ల సేవా సేతు’తో ప్రజల వద్దకే పాలన తెస్తున్నామన్నారు. తాగునీటి ఎద్దడిపై యాక్షన్ ప్లాన్, వృద్ధుల హక్కుల కరపత్రాలు విడుదల చేశారు.

February 27, 2026 / 01:13 PM IST

ఈ రహదారి ప్రజలకు నిత్యకష్టం

ASR: రాకోట-బూసిబంధ గ్రామాల రహదారి దుస్థితి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. గత ప్రభుత్వంలో ప్రారంభమైన రహదారి పనులు గ్రావెల్ దశలోనే ఆగిపోవడంతో రహదారి గోతులమయంగా మారింది. స్వల్ప వర్షానికే బురదగా మారి ప్రయాణం ప్రాణాపాయంగా మారిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి పనులు పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.

February 27, 2026 / 01:13 PM IST

ఘనంగా అడవి రాజుల బాబు పండగ

AKP: నాతవరంలో శుక్రవారం అడవిరాజులబాబు పండుగను గ్రామస్థులు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఎస్సై తారకేశ్వరరావు కూడా రాజుబాబులను దర్శించుకున్నారు. సాయంత్రం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనునట్లు కమిటీ సభ్యులు తెలిపారు.

February 27, 2026 / 01:13 PM IST

నూతన కమిషనర్‌గా పల్లి నల్లన్నయ్య

SKLM: నగర మున్సిపాలిటీ ఇంఛార్జ్ కమిషనర్‌‌గా పల్లి నల్లన్నయ్యను శుక్రవారం ప్రభుత్వం నియమించింది. కొద్ది రోజుల పాటు ఆయన ఇంచార్జ్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. నేటి మధ్యాహ్నం ఆయన బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. గతంలో కూడా శ్రీకాకుళం కమిషనర్‌ గా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఈయన ప్రస్తుతం జీవీఎంసీ లో విధులు నిర్వర్తిస్తున్నారు.

February 27, 2026 / 01:12 PM IST

ఇంఛార్జ్ కమిషనర్‌‌ నియామకం

SKLM: నగర మున్సిపాలిటీ ఇంఛార్జ్ కమిషనర్‌‌గా పల్లి నల్లన్నయ్యను శుక్రవారం ప్రభుత్వం నియమించింది. కొద్ది రోజుల పాటు ఆయన ఇంఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. నేటి మధ్యాహ్నం ఆయన బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. గతంలో కూడా శ్రీకాకుళం కమిషనర్‌‌గా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఈయన ప్రస్తుతం జీవీఎంసీలో విధులు నిర్వర్తిస్తున్నారు.

February 27, 2026 / 01:12 PM IST