MHBD: అర్హులైన వారందరికీ పెన్షన్లు డాక్టర్ బిఆర్. అంబేద్కర్ అభయా హస్తం పథకాన్ని తక్షణమే అమలు చేయాలని సీపీఎం పార్టీ మండల కార్యదర్శి గుడిషాల వెంకన్న డిమాండ్ చేశారు. గురువారం కేసముద్రం ఎంపీడీవో క్రాంతికి సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేసిన అనంతరం వెంకన్న మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత హామీలను విస్మరించడం సరికాదని అన్నారు.
KRNL: సి.బెళగల్ కెనరా బ్యాంకు 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వేడుకలు నిర్వహించారు. మేనేజర్ ప్రసంగి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఏజీఎం సుశాంత్ కుమార్, వెలుగు ఏపీఎం రమేష్, ప్రిన్సిపల్ చింతలయ్య పాల్గొన్నారు. కేక్ కట్ చేసి బ్యాంకు సీనియర్ కస్టమర్లను శాలువాలతో సన్మానించారు.
KRNL: శివారులోని జగన్నాథ గట్టుపైకి వెళ్లే ప్రేమికులను బెదిరించి డబ్బు, చైన్లు లాక్కుంటున్న నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నగరానికి చెందిన నాగేంద్రుడు, రమేశ్, మాలిక్ బాషాలను అరెస్ట్ చేసినట్లు సీఐ విక్రమ సింహ వెల్లడించారు. ఈ నెల 19న వచ్చిన ఫిర్యాదుపై విచారణ చేసి నిందితులను అదుపులోకి తీసున్నామని తెలిపారు.
PDPL: రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ మక్కన్ సింగ్ గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన ఆసుపత్రిలోని అన్ని విభాగాలను పరిశీలించి, వార్డులలోని రోగులను కలిసి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రోగులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా 24 గంటలు వైద్య సేవలు అందించాలని ఎమ్మెల్యే ఆదేశించారు.
BHNG: ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో ఆలేరు – కొలనుపాక గ్రామాల మధ్య ప్రధాన రహదారిపై నుంచి ప్రవహిస్తున్న వరద ప్రవహన్ని జిల్లా కలెక్టర్ హనుమంత రావు పరిశీలించారు. వరద ప్రవాహం పూర్తిగా తగ్గేంతవరకు కూడా ఎవరు దాటకుండా రాకపోకలు నిలిపివేయాలన్నారు. పోలీస్ సిబ్బంది అందుబాటులో ఉండాలని, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని అన్నారు.
WNP: వనపర్తిలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో కొత్తగా ఎన్రోల్మెంట్ అయిన విద్యార్థులను యూ డైస్‌లో అప్డేట్ చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో అన్ని మండలాల ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతిరోజు తప్పకుండా విధులకు హాజరైన ఉపాధ్యాయులు ఎఫ్ఆర్‌ఎస్‌లో అటెండెన్స్ నమోదు చేయాలని ఆదేశించారు.
W.G: ఉండిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (PHC) జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె ఆసుపత్రిలోని మందుల స్టాక్, రికార్డులు, సిబ్బంది హాజరును పరిశీలించారు. రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలు అదించాలని కలెక్టర్ సిబ్బందికి సూచించారు.
శ్రీకాకుళం: యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, సంతబొమ్మాళి మండలం భావనపాడు మెరైన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ శ్రీనివాసరావు అన్నారు. గురువారం రాత్రి వజ్రపుకొత్తూరు మండలం, తామాడపేట గ్రామంలో ఎస్సైతో పాటు పోలీస్ సిబ్బంది పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలు రవాణా జరిగితే, అటువంటి సమాచారం పోలీసులకు తెలియజేయాలన్నారు.
NLR: బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీలోని మూడో వార్డులో కౌన్సిలర్ అందే ప్రత్యూష స్మార్ట్ రైస్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రత్యూష మాట్లాడుతూ.. నకిలీ రవాణా, పారదర్శక పాలన అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్మార్ట్ రైస్ కారులను అందజేస్తున్నారని చెప్పారు. ఈ రైస్ కార్డులతో ప్రజలకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని తెలిపారు.
BHPL: జాప్యం లేకుండా సీఎంపీఎఫ్ సేవలను త్వరగా అందించేందుకు కృషి చేస్తున్నామని ఆర్‌సీ గోవర్ధన్ అన్నారు. గురువారం భూపాలపల్లి జీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎంపీఫ్, పెన్షన్‌కు సంబంధించిన లావాదేవీలు సీ కేర్స్ పోర్టల్ ద్వారా మాత్రమే జరుగుతున్నాయని, కొత్త సీఎంపీఫ్, పెన్షన్‌లను త్వరగా పూర్తి చేయడానికి ప్రయాస్ పద్దతి తీసుకువచ్చామన్నారు.
MBNR: పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కురుమూర్తి అన్నారు. వారు మాట్లాడుతూ.. ప్రైవేటు ఉద్యోగులు, పరిశ్రమ కార్మికులు, ఇతర రాష్ట్రాల కార్మికులకు ఈఎస్ఐ ,పిఎఫ్ బోనస్ ,గ్రాటివిటీ ,సంక్షేమ పథకాలను వర్తింపజేయాలన్నారు. కార్మిక చట్టాన్ని ఉల్లంఘిస్తూ ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్నారన్నారు. స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలన్నారు.
KMM: అధికంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లాలోని అధికారులు పూర్తి సంసిద్ధతతో స్థానికంగా ఉంటూ పని చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ సూచించారు. ఖమ్మం కలెక్టరేట్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామని, ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నట్లయితే 1077, వాట్సాప్ సెల్ నెంబర్ 9063211298 లను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
NLR: బుచ్చి నగర పంచాయతీ వాసవి నగర్‌లో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా రెండవ రోజు సాయంత్రం ఉట్టి కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక యువత ఉట్టి కొట్టేందుకు ఉత్సాహం చూపించారు. ఒకరిపై ఒకరు రంగు నీళ్లు చల్లుకుంటూ కోలాహంగా ఉట్టి కార్యక్రమాన్ని పూర్తి చేశారు.
కృష్ణా: అవగాహనతో కూడిన పాలన చేసి జరిగే మంచిని కూటమి ప్రభుత్వం ప్రజలకు అందిస్తుందని ఎమ్మెల్యే రాము అన్నారు. మెగా డీఎస్సీ పోస్టులపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. సమాజ ఉన్నతిలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమన్నారు. సీఎం చంద్రబాబు మార్గదర్శకంలో ప్రజల భావితరాల కోసం ఇచ్చిన హామీలన్నీ కూటమి ప్రభుత్వం అమలు చేయడం సంతోషకరమని తెలిపారు.
RR: షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట మండలంలో వినాయక నిమజ్జనం, పారిశుధ్యంపై మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ కిష్టయ్య గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. వినాయక నిమజ్జనం ఏర్పాట్లు,పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా వంటి అంశాలపై తగిన సూచనలు చేశారు. వారు మాట్లాడుతూ.. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.