• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

జనసేన పార్టీ బలోపేతమే లక్ష్యం: మేడిశెట్టి

కాకినాడ: ఏలేశ్వరంలో జనసేన నాయకుడు బంక కోదండరాం ఆధ్వర్యంలో పార్టీ క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. రాష్ట్ర కార్యదర్శి మేడిశెట్టి సూర్యకిరణ్ హాజరై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సభ్యత్వం వల్ల లభించే బీమా, ఇతర ప్రయోజనాలను కార్యకర్తలకు వివరించారు. పార్టీ శ్రేణులు తప్పనిసరిగా సభ్యత్వం తీసుకోవాలని పవన్ కళ్యాణ్ ఆశయాలను బలోపేతం చేయాలన్నారు

February 26, 2026 / 02:59 PM IST

‘అగ్నిప్రమాద బాధితులకు ఇందిరమ్మ ఇల్లు’

NLG: గుడిపల్లి మండలం ఘనిపల్లి అగ్నిప్రమాద బాధితులకు ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ నేతృత్వంలో ఇందిరమ్మ ఇల్లు కల్పిస్తామని మండల పార్టీ నాయకులు కసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. గురువారం తహసీల్దార్ మధుసుహాసిని, ఎంపీడీవో అండాలు, ఆర్ఐ సత్య రాజ్, సర్పంచ్ మల్లిక వెంకటేశ్వర్లు బాధితుడు భిక్షం కుటుంబాన్ని పరామర్శించారు.

February 26, 2026 / 02:57 PM IST

పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్

బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ గురువారం చీరాలలోని ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలను సందర్శించారు. పరీక్షలు జరుగుతున్న తీరును ప్రతి గదికి వెళ్లి స్వయంగా పరిశీలించారు. ప్రశ్నాపత్రం ఎలా ఉందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఎక్కడా మాల్ ప్రాక్టీస్‌కు తావులేకుండా, కట్టుదిట్టంగా పరీక్షలు నిర్వహించాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు.

February 26, 2026 / 02:56 PM IST

మాజీ మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన కౌన్సిలర్

RR: శంకర్ పల్లి మున్సిపల్ 13వ వార్డు కౌన్సిలర్ చాకలి అశోక్ ఇవాళ మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం బొకే అందజేశారు. ఈ సందర్భంగా రెండో సారి స్వతంత్ర అభ్యర్థిగా, కౌన్సిలర్‌గా గెలిచిన అశోక్‌ను ఎమ్మెల్యే అభినందించారు. వార్డులో ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరించాలని సూచించారు.

February 26, 2026 / 02:56 PM IST

‘బ్యాండ్ మేళం’ సెకండ్ సింగిల్ డేట్ ఫిక్స్

‘కోర్ట్’ సినిమా జోడీ రోషన్, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న మూవీ ‘బ్యాండ్ మేళం’. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ కాగా.. తాజాగా సెకండ్ సింగిల్ విడుదలకు సిద్ధమైంది. ఫిబ్రవరి 28న మాస్ మహారాజా రవితేజ ఈ పాటను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక దర్శకుడు సతీష్ జివ్వాజి తెరకెక్కిస్తోన్న ఈ మూవీ 2026 మార్చి 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

February 26, 2026 / 02:56 PM IST

‘నీటి పిల్లుల సంరక్షణ అందరూ సహకరించాలి’

కాకినాడ: కోరంగి అభయారణ్యంలో పర్యావరణ పరిరక్షణకు కీలకమైన నీటి పిల్లులను కాపాడుకోవాలని ఫారెస్ట్ రేంజర్ ఎస్.ఎస్.ఆర్. వరప్రసాద్ కోరారు. వీటిని వేటాడితే వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972 ప్రకారం ఏడేళ్ల జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు వీటి ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ఈ అరుదైన జీవుల సంతతిని పెంచేందుకు ప్రజలందరూ సహకరించాలన్నారు.

February 26, 2026 / 02:55 PM IST

లైబ్రరీ ఏర్పాటు స్థలం పరిశీలన

NGKL: కల్వకుర్తి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేయనున్న లైబ్రరీ భవన నిర్మాణానికి సంబంధించి స్థలాన్ని మాజీ సర్పంచ్ ఆనంద్ కుమార్, మున్సిపాలిటీ వైస్ ఛైర్మన్ షానవాజ్ ఖాన్ తదితరులు గురువారం పరిశీలించారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి చొరవ వల్ల లైబ్రరీ భవన నిర్మాణానికి నిధులు మంజూరు అయినట్లు వారు తెలిపారు.

February 26, 2026 / 02:55 PM IST

పసుపు రైతుల ఆగ్రహం.. ఆందోళన

TG: నిజామాబాద్ మార్కెట్ యార్డులో పసుపు రైతులు కన్నెర్ర చేశారు. గత కొన్ని రోజులుగా పసుపుకు మద్దతు ధర లేకపోవడం.. ఈనామ్‌ సర్వర్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ పనిచేయకపోవడంతో అధికారులు లాట్ నంబర్ కేటాయిండం లేదు. దీంతో నిజామాబాద్ మార్కెట్‍లో పసుపు కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఈ క్రమంలో మార్కెట్‍లోని కార్యాలయం ఆద్దాలను ధ్వంసం చేసి మరీ నిరసన తెలిపారు.

February 26, 2026 / 02:54 PM IST

విగ్రహ ప్రతిష్ట మహోత్సవం లో శ్రీలంక న్యాయమూర్తి

BDK: పాల్వంచ మండలం, గుడిపాడు గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీదేవి, గోదాదేవి సమేత శ్రీ మోక్ష వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రతిష్టా మహోత్సవం ఇవాళ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీలంక దేశానికి సుప్రీమ్ న్యాయమూర్తి ఎస్ తురాయి రాజా పాల్గొన్నారు. వారికి సీపీఐ పార్టీ జిల్లా కార్యదర్శి ఎస్కె సాబీర్ పాషా, కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ గణేష్ ఆహ్వానం పలికారు.

February 26, 2026 / 02:53 PM IST

అధిక లోడ్‌తో ఇటుక ట్రాక్టర్లు.. స్థానికులు ఆగ్రహం

NTR: విజయవాడలోని లోటస్ ల్యాండ్‌మార్క్ ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా ఇటుక ట్రాక్టర్లు పట్టపగలే అధిక లోడుతో రాకపోకలు సాగిస్తున్నాయి. నగర పరిధిలో ఉదయం వేళ ట్రాక్టర్లకు అనుమతి లేకపోయినా, యథేచ్ఛగా నడుస్తుండటంపై స్థానికులు, వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధిక లోడు కారణంగా ఇటుకలు రోడ్డుపై జారిపడి ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని భయాందోళన చెందుతున్నారు.

February 26, 2026 / 02:53 PM IST

‘సీతారాముల కళ్యాణ తలంబ్రాల కోసం బుక్ చేసుకోండి’

MBNR: భద్రాచలం సీతారాముల కళ్యాణ తలంబ్రాల కోసం ఒక ప్యాకెట్ ధర 151 రూపాయలు పెట్టి బుక్ చేసుకోవాలని రీజనల్ మేనేజర్ సంతోష్ కుమార్ గురువారం అన్నారు. జిల్లా కార్యాలయంలో అందుకు సంబంధించిన గోడపత్రికలను ఆవిష్కరించి మాట్లాడారు. ఈ నెల 25 నుంచి మార్చి 31 వరకు బుక్ చేసుకోవాలని సూచించారు. నేరుగా ఇంటికే తలంబ్రాలు చేరవేస్తారని తెలిపారు. పూర్తి వివరాల కోసం 9154298637 సంప్రదించాలన్నారు.

February 26, 2026 / 02:53 PM IST

విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి పాఠాల బోధన

SRD: స్వయం పాలన దినోత్సవం సందర్భంగా ZPHS ఏదుల నాగులపల్లిలో విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు. వారి బోధనను ఉపాధ్యాయులు పర్యవేక్షించారు. కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయులను విద్యార్థులు సన్మానించారు. ఈ కార్యక్రమం హెచ్‌ఎం, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

February 26, 2026 / 02:53 PM IST

జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం

AKP: నర్సీపట్నంలో జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. నియోజకవర్గ ఇంఛార్జ్ రాజాన వీరసూర్యచంద్ర ఆధ్వర్యంలో ప్రత్యేక స్టాల్స్‌ను ప్రారంభించి సభ్యత్వాన్ని వేగవంతం చేశారు. పార్టీ అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని తెలిపారు.

February 26, 2026 / 02:53 PM IST

ప్రత్యేక ఉపకారాగారాన్ని సందర్శించిన మేజిస్ట్రేట్

W.G: భీమవరం ప్రత్యేక ఉపకారాగారాన్ని 2వ అదనపు జుడీషియల్ మొదటి తరగతి మేజిస్ట్రేట్ N.జ్యోతి గురువారం సందర్శించారు. ఆమె మాట్లాడుతూ.. ముద్దాయిల కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. బెయిల్ మంజూరై చాలా కాలం నుంచి జైలులోనే ఉండిపోయిన ముద్దాయిల జామీను కోర్టుకు సమర్పిస్తే విడుదలకు ఆదేశాలు జారీ చేస్తామన్నారు. అనంతరం సౌకర్యాలు అడిగి తెలుసుకున్నారు.

February 26, 2026 / 02:51 PM IST

SA vs WI: హెడ్ టు హెడ్ రికార్డు

సౌతాఫ్రికా, వెస్టిండీస్ జట్లు T20Iల్లో 29 సార్లు తలపడ్డాయి. ఇందులో వెస్టిండీస్ 15 సార్లు, సౌతాఫ్రికా 14 సార్లు విజయం సాధించాయి. ఈ రెండు జట్లు తలపడ్డ గత చివరి 10 T20Iల్లో వెస్టిండీస్ 7 విజయాలతో సౌతాఫ్రికాపై పూర్తి ఆధిపత్యం సాధించింది. అయితే, T20 ప్రపంచకప్‌లో విండీస్‌తో జరిగిన 5 మ్యాచ్‌ల్లో సౌతాఫ్రికా 4 విజయాలతో మంచి రికార్డు కలిగి ఉంది.

February 26, 2026 / 02:51 PM IST