RR: చంపాపేట్ డివిజన్ పరిధిలో పనిచేస్తున్న మీటర్ రీడర్లు 30 రోజుల పూర్తి పని కల్పించాలని డిమాండ్ చేశారు. రీడింగ్ అనంతరం పని దినాలు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. సంబంధిత అధికారులు తక్షణం స్పందించి స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. సమస్యలపై స్పందన రాకపోతే ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు.
నెల్లూరు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి సైలెంట్ అయిపోయారు. వైసీపీని వీడి బీజేపీలో చేరుతారని గత కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టుగానే ఆయన వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఇవాళ నెల్లూరుకు వచ్చిన జగన్‌ను ఆదాల కలిశారు.
JGL:పెగడపల్లి మండలం సుద్దపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని గురువారం మాల్యాల ఏసీడీపీవో అరవింద ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేంద్రంలోని స్టాక్ రిజిస్టర్, విద్యార్థుల హాజరును పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రాల్లోకి చిన్నారులు ఎక్కువ సంఖ్యలో వచ్చేలా చూడాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో మండల సూపర్వైజర్ మహేశ్వరి, టీచర్ శ్రీదేవి ఉన్నారు.
రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ ఈడీ ఎదుట హాజరయ్యారు. అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్ నకు ప్రమేయం ఉన్న రూ.40 వేల కోట్ల బ్యాంకింగ్, కార్పొరేట్ మోసం కేసులో ఈడీ ఆయనను విచారిస్తోంది. కాగా, ఇటీవల ఆయనకు ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
MBNR: జిల్లా కలెక్టర్‌గా ఖుష్బూ గుప్తా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్ విజయేంద్ర బోయి రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ కార్యదర్శిగా బదిలీ చేశారు. అలాగే నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పాట్నాయక్‌ను ఆర్థిక శాఖకు ప్రత్యేక కార్యదర్శిగా బదిలీ చేశారు. ప్రదీప్ జైన్‌ను నారాయణపేట్ కలెక్టర్‌గా నియమించారు.
నల్గొండ మెడికల్ కళాశాల వార్షికోత్సవంలో మంత్రి కోమటిరెడ్ వెంకటరెడ్డి పాల్గొని, కళాశాలను రాష్ట్రంలోనే ఉత్తమంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. నిర్మాణం ఆగిపోయిన సమయంలో రూ.85 కోట్లు కేటాయించి పూర్తి చేశామని చెప్పారు. విద్యార్థుల రాకపోకల కోసం నెలలోనే రెండు ప్రత్యేక బస్సులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. అలాగే, మున్సిపల్ కార్పొరేషన్‌ను మోడల్ సిటీగా మారుస్తానని పేర్కొన్నారు.
HYD: మెట్రో ఫేజ్-2 అలైన్‌మెంట్ అకస్మాత్తుగా మారడం వెనుక సాంకేతిక కారణాల కంటే ఆర్థిక కారణాలే ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది. కొత్తగా ప్రతిపాదించిన నాగోల్-చాంద్రాయణగుట్ట-మైలార్ దేవ్ పల్లి రూట్, భవిష్యత్తులో అభివృద్ధి చేయాలనుకుంటున్న ‘ఫార్మా విలేజ్’ కనెక్టివిటీకి అనుసంధానంగా ఉండబోతోంది.
E.G: తాళ్ళపూడి మండలం మలకపల్లిలో నిర్వహించిన ప్రజావేదికలో గ్రామానికి చెందిన సనమండ్ర పోసియ్యకు చెందిన గృహాన్ని నిర్మిస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. కొవ్వూరు MLA ముప్పిడి వెంకటేశ్వరరావు ఆదేశాల మేరకు లబ్ధిదారుడి గృహాన్ని హౌసింగ్ డిపార్ట్‌మెంట్, MRO గురువారం పరిశీలించారు. లబ్దిదారుడికి హౌసింగ్ డిపార్ట్‌మెంట్ నుంచి ఇల్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
KNR: జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయం ప్రాజెక్ట్‌లో భాగంగా కనగర్తి గ్రామంలో అవగాహన సదస్సు నిర్వహించారు. బీఆర్సీ ఇంఛార్జ్ మురళీధర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మోగి, పచ్చ పురుగులు, తాటి ఆకు తెగుళ్లు తదితర సమస్యల నివారణపై వివరించారు. నీమాస్త్రం, జీవామృతం, పుల్లటి మజ్జిగ ప్రయోజనాలను తెలియజేసి అగ్ని అస్త్రం తయారీని ప్రదర్శించారు.
TG: పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని హట్టిఘాట్ పంప్ హౌస్, చనాకా-కోరాట బ్యారేజ్ ప్రాంతాలను ఏరియల్ సర్వే ద్వారా మంత్రి పరిశీలించారు. హట్టిఘాట్ పంప్ హౌస్ వద్ద క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రాజెక్టు పనుల పురోగతిని సమీక్షించారు.
KMR: తాడ్వాయి మండలం కృష్ణాజివాడి గ్రామ సీనియర్ రేషన్ డీలర్ పరందాములు అనారోగ్యంతో మృతి చెందారు. జిల్లా రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు నాగం సురేందర్, ప్రధాన కార్యదర్శి సంతోష్ రావు, గౌరవాధ్యక్షుడు లద్దూరి లక్ష్మీపతి యాదవ్, గౌరిశెట్టి రాజు తాడ్వాయి మండల రేషన్ డీలర్ల సమక్షంలో పరంధాముల కుటుంబ సభ్యులకు ఇవాళ రూ.10 వేలు ఆర్థిక సహాయం అందజేశారు.
ATP: రాయదుర్గంలో అసంపూర్తిగా ఉన్న టిడ్కో ఇళ్లను త్వరగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలని MLA కాలవ శ్రీనివాసులు కోరారు. గురువారం అసెంబ్లీలో మాట్లాడుతూ.. రూ.64.81 కోట్లతో చేపట్టిన ఈ గృహ సముదాయాల్లో ఇప్పటికే 70 శాతం పనులు పూర్తయ్యాయని వివరించారు. మిగిలిన నిధులు కేటాయిస్తే 1008 పేద కుటుంబాలకు సొంతింటి కల నెరవేరుతుందన్నారు.
VZM: గజపతినగరం మండలంలో ఈదురుగాలులకు 150 ఎకరాలు మొక్కజొన్న పంట నేలకొరిగిందని సహాయ వ్యవసాయ సంచాలకులు నిర్మల జ్యోతి చెప్పారు. నేలకొరిగిన మొక్కజొన్న పంటను పలు గ్రామాల్లో ఏడిఏ నిర్మల జ్యోతితో పాటు మండల వ్యవసాయ అధికారి ఏ కిరణ్ కుమార్ పరిశీలించారు. ప్రభుత్వానికి నివేదిక పంపిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.
MBNR: జడ్చర్ల మండలం చర్లపల్లి సర్పంచ్ లక్ష్మమ్మ మిషన్ భగీరథ పైప్‌లైన్ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. ఎన్నికల సమయంలో ప్రజల సమస్యలను గుర్తించి దాదాపు లక్ష యాభై వేల రూపాయలతో పనులను ప్రారంభించారు. భవిష్యత్తులో మెయిన్ లైన్ నుంచి గ్రామానికి నీరు సరఫరా సాఫీగా కొనసాగుతుందని తెలిపారు.