• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

కొనో కార్పస్ మొక్కల తొలగింపు

NRML: నిర్మల్ పట్టణంలోని శివాజీ చౌక్ నుంచి స్థానిక సెయింట్ థామస్ పాఠశాల వరకు డివైడర్ల మధ్యలో ఏర్పాటు చేసిన కోనో కార్పస్ మొక్కలను పూర్తిగా తొలగించేందుకు మున్సిపల్ యంత్రాంగం సిద్ధమైంది. కోనో కార్పస్ మొక్కలతో శ్వాస సంబంధిత వ్యాధులు వస్తాయన్న ఉద్దేశంతో రానున్న హరితహారం కార్యక్రమంలో వాటిని పూర్తిగా తొలగించి వాటి స్థానంలో ఇతర మొక్కలను నాటనున్నారు.

March 4, 2026 / 11:58 AM IST

న్యాయమైన వేతనం కోసం ఎమ్మెల్యేకు వినతి

GDWL: ఏళ్ల తరబడి విద్యుత్ శాఖలో సేవలందిస్తున్న మాకు కనీస వేతనం అందడం లేదు, మమ్మల్ని శాశ్వత ఉద్యోగులుగా గుర్తించలని మీటర్ రీడర్స్ యూనియన్ నాయకులు అలంపూర్ ఎమ్మెల్యే విజయుడుకు విన్నవించారు. బుధవారం తెలంగాణ రాష్ట్ర విద్యుత్తు మీటర్ రీడర్స్ యూనియన్ (ఔట్సోర్సింగ్ ఉద్యోగులు) ప్రతినిధులు అలంపూర్ ఎమ్మెల్యేను కలిసి తమ సమస్యలపై వినతి పత్రం అందజేశారు.

March 4, 2026 / 11:58 AM IST

రాష్ట్రంలో లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయి: మంత్రి

AP: SIPB ఆమోదం మేరకు విశాఖకు పరిశ్రమలు వస్తున్నాయని మంత్రి టీజీ భరత్ తెలిపారు. అందులో భాగంగా 1,38,000 ఉద్యోగాలు రాబోతున్నాయని చెప్పారు. ఇటీవల జరిగిన పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ ద్వారా మరో రూ.99 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. దీంతో 2 లక్షల ఉద్యోగాలు లభించనున్నట్లు మంత్రి వెల్లడించారు.

March 4, 2026 / 11:58 AM IST

ఉపాధి హామీ పనులు ప్రారంభం..!

MDK: కొల్చారం మండలం వెంకటాపూర్ గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులను సర్పంచ్ కన్నబోయిన సుజాత శేఖర్ బుధవారం కొబ్బరికాయ కొట్టి లాంఛనంగా ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వార్డు సభ్యులు, కూలీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

March 4, 2026 / 11:57 AM IST

మహిళా సాధికారత పై అవగాహన

ప్రకాశం: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం పొన్నలూరు గ్రామ సమీపంలో మహిళా భద్రత, హక్కులపై అవగాహన నిర్వహించారు. పొన్నలూరు SI ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు పాల్గొన్నారు. సమాజంలో మహిళల పట్ల వివక్షను వీడి లింగ సమానత్వాన్ని పెంచే బాధ్యత అందరిపైన ఉందని SI తెలిపారు.

March 4, 2026 / 11:57 AM IST

మున్సిపల్ నూతన పాలకవర్గానికి ఘన సన్మానం

MDK: రామాయంపేట పురపాలక సంఘం, నూతన పాలకవర్గంను ఇవాళ ఘనంగా సన్మానించారు.ఈ  కార్యక్రమం మున్నూరు కాపు సంఘం బేడ-4 ఆధ్వర్యంలో నిర్వహించారు. పట్టణంలోని గౌడ సంఘం రేణుక మాత ఆలయ ప్రాంగణంలో అధ్యక్షులు బీర రామచంద్రం, కర్ల వెంకటి, మాజీ కౌన్సిలర్ దేమె యాదగిరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన గజవాడ లావణ్య నాగరాజు దంపతులు, వార్డు కౌన్సిలర్లు.

March 4, 2026 / 11:56 AM IST

‘ఇంటర్నల్ మార్కులను నమోదు చేయాలి’

SRD: జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థుల యొక్క ఇంటర్నల్ మార్కులను రేపటిలోగా ఆన్‌లైన్ నమోదు చేయాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ విషయాన్ని అన్ని రకాల పాఠశాలల ప్రధానోపాధ్యాయులు గమనించాలని సూచించారు. నమోదు చేయని పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

March 4, 2026 / 11:55 AM IST

భూవివాదాల కేసులపై ప్రత్యేక దృష్టి: మంత్రి

AP: భూ వివాదాల పరిష్కారం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి అనగాని పేర్కొన్నారు. హైకోర్టులో ఉన్న ప్రభుత్వ భూవివాదాల కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. కేసుల లైజనింగ్ కోసం జిల్లాకు ఒక అధికారిని నియమించినట్లు వెల్లడించారు. ఎవరైనా తప్పు చేసినట్లు తేలితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి వివరించారు.

March 4, 2026 / 11:52 AM IST

గ్రామస్థుల సహకారంతో వేగంగా గుడి నిర్మాణం

NLG: చందంపేట మండలం పాత కంబాలపల్లిలో శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీ రాములవారి దేవాలయ నిర్మాణం పనులు వేగంగా జరుగుతున్నట్లు దేవస్థాన కమిటీ వారు బుధవారం తెలిపారు. ఇంతవరకు దాతల సహాయ సహకారాలతో రూ.60 వేలు అందించారని, మరి కొందరు నిర్మాణ సామాగ్రి, గ్రామానికి చెందిన మరో దాత రూ.లక్ష ధ్వజస్తంభం ఏర్పాటుకు విరాళం ప్రకటించినట్లు తెలిపారు.

March 4, 2026 / 11:52 AM IST

సోమందేపల్లిలో బాణాసంచా వ్యాపారులకు నోటీసు అందజేసిన ఎస్ఐ

సత్యసాయి: సోమందేపల్లిలో బాణాసంచా వ్యాపారులకు ఎస్ఐ రమేశ్ బాబు బుధవారం నోటీసులు జారీ చేశారు. ఎస్ఐ మాట్లాడుతూ.. అనుమతులు లేకుండా ఇళ్లలో లేదా అనుమతులు లేని గోదాముల్లో బాణాసంచా నిల్వ ఉంచరాదని వారికి హెచ్చరించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే రైడ్స్ నిర్వహించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

March 4, 2026 / 11:50 AM IST

ఈ నెల 6న చలో విజయవాడ కార్యక్రమం

AKP: తమ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 6న చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తామని నాతవరం మండల సమగ్ర శిక్ష ఉద్యోగుల అధ్యక్షుడు శ్రీనివాస్ తెలిపారు. బుధవారం నాతవరం ఎంఈవోకు వినతిపత్రం అందజేశారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ వేతనాలు, టైమ్ స్కేల్ అమలు, హెచ్ఆర్ పాలసీ, ఉద్యోగ భద్రత వంటి సమస్యలు ఇంకా పరిష్కారమవ్వలేదని వెల్లడించారు.

March 4, 2026 / 11:49 AM IST

ఆగని ఇసుక అక్రమ రవాణా

WNP: వీపనగండ్ల మండలంలోని తూంకుంట పెద్ద వాగులో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. సంబంధిత పోలీసులు, రెవెన్యూ అధికారులు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం ఎలాంటి అనుమతులు లేకుండానే అక్రమ రవాణాను యథేచ్ఛగా సాగిస్తున్నారు. పోలీసుల కళ్లముందు ట్రాక్టర్లు వెళ్తున్నా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

March 4, 2026 / 11:49 AM IST

నేటి నుంచి జిల్లాస్థాయి కబడ్డీ పోటీలు

NLG: కనగల్ శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల సందర్భంగా జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి 6వ తేదీ వరకు జరిగే ఈ టోర్నమెంట్‌ను గ్రామ సర్పంచ్ నర్సింగ్, మురళిగౌడ్, నిర్వహణ కమిటీ సభ్యులు ఘనంగా ఏర్పాటు చేశారు. విజేత జట్లకు ఆకర్షణీయమైన నగదు బహుమతులు అందజేస్తామని ప్రకటించారు. తమ జట్ల పేర్లు వెంటనే నమోదు చేసుకోవాలన్నారు.

March 4, 2026 / 11:48 AM IST

థాయిలాండ్ మాస్టర్స్ మీట్‌కు గాజువాక అథ్లెట్స్

విశాఖ క్రీడాకారులు అంతర్జాతీయ వేదికపై మెరవనున్నారు. ఈ నెల 5న (గురువారం) ప్రారంభమై 8న ఆదివారం వరకు జరిగే 30వ థాయిలాండ్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఇంటర్నేషనల్ మీట్‌లో వెటరన్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆఫ్ విశాఖ సభ్యులు పాల్గొంటున్నారు. డి.వి.భాస్కరరాజు, గుడ్ల శివరామరెడ్డి, జి.సీతారామ్, డా.మంగ వరప్రసాద్ పోటీపడనున్నారు.

March 4, 2026 / 11:48 AM IST

విష్ణుపురి కాంప్లెక్స్‌లో ఎంఎంసీ కమిషనర్

HYD: మౌలాలి డివిజన్ పరిధిలోని విష్ణుపురి కాంప్లెక్స్‌లో మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి పర్యటించారు. స్థానికంగా కొనసాగుతున్న పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్తను ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ ఉండాలని అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. సిబ్బంది పనితీరును అధికారులు ఎల్లప్పుడూ పర్యవేక్షిస్తూ ఉండాలని సూచించారు.

March 4, 2026 / 11:47 AM IST