• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డలకు దరఖాస్తులు

W.G: జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు దరఖాస్తులను ఈ నెల 25వ తేదీ వరకు స్వీకరిస్తామని, గడువును సద్వినియోగం చేసుకోవాలని డీఈవో నారాయణ బుధవారం తెలిపారు. డివిజనల్ స్థాయిలో వచ్చిన దరఖాస్తులను 27వ తేదీన పరిశీలించి డీఈవో కార్యాలయానికి అందజేయాలని కోరారు. అన్ని డివిజన్ల నుంచి వచ్చిన వాటిలో ఎంపిక చేసిన ఉపాధ్యాయుల తుది జాబితాను సెప్టెంబరు 3వ తేదీన ప్రకటిస్తామన్నారు.

August 21, 2025 / 08:10 AM IST

ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

E.G: ఎగువ రాష్ట్రల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ధవళేశ్వరం బ్యారేజ్‌కు గోదావరి నది వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బ్యారేజ్‌లో 11.75అడుగులకు నీటిమట్టం చేరింది. 175గేట్లను ఎత్తి సుమారు 10లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. లంక గ్రామాల ప్రజలను పునరావాసాలకు తరలిస్తున్నారు. 

August 21, 2025 / 08:10 AM IST

వైన్ షాపుల దరఖాస్తు ఫీజు రూ.3 లక్షలు

KMM: రాష్ట్ర ప్రభుత్వం వైన్స్ షాపుల టెండర్ నోటిఫికేషన్‌ను బుధవారం విడుదల చేసింది. నూతన ఎక్సైజ్ పాలసీలో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 210 వైన్ షాపులకు త్వరలో దరఖాస్తులు స్వీకరించనున్నారు. గతంలో వైన్స్ దరఖాస్తు ఫీజు రూ.2లక్షలు ఉండగా ఈసారి రూ.3లక్షలకు పెంచారు. వచ్చే నవంబర్‌లో టెండర్ల గడువు ముగియనుంది.

August 21, 2025 / 08:10 AM IST

మునుగుతుందని తెలిసినా.. ముసారాంబాగ్ పై దృష్టి పెట్టరా..?

HYD: భారీ వర్షాలకు HYD ముసారాంబాగ్ వంతెన కొన్నేళ్లుగా పదే పదే మునుగుతుంది. మునుగుతుందని తెలిసినా.. నిర్మాణ పనులు చాలా ఆలస్యంగా నిర్వహిస్తున్నారని స్థానికులు ఆగ్రహిస్తున్నారు. రెండు సంవత్సరాలుగా కేవలం 20 శాతం మేరకు మాత్రమే పనులు పూర్తయ్యాయని అంటున్నారు. ఇకనైనా పనుల్లో వేగం పెంచి, కొన్ని ఏళ్ల నుంచి ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతున్నారు.

August 21, 2025 / 08:10 AM IST

‘మాదకద్రవ్యాల నిషేధాన్ని పకడ్బందీగా అమలు చేయాలి’

NRPT: జిల్లాలో మాదకద్రవ్యాల నిషేధాన్ని పకడ్బందీగా అమలు చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎస్.శ్రీను సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లాలోని కలెక్టరేట్‌లో మాదకద్రవ్యాల నిషేధం (యాంటీ నార్కోటిక్)పై ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. డ్రగ్స్ నిర్మూలనకు ప్రభుత్వం సీరియస్‌గా ఉందని, అందుకు అనుగుణంగా అధికారులు పని చేయాలని పేర్కొన్నారు.

August 21, 2025 / 08:09 AM IST

పట్టణంలో నేడు టీఎల్ఎం మేళా

MBNR: జడ్చర్ల బాయ్స్ జడ్పీహెచ్ఎస్‌లో నేడు మండల స్థాయి టీఎల్ఎం మేళా నిర్వహించనున్నారు. డీఈవో ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరగనుంది. ఈ మేళాలో జడ్చర్ల మండలంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల విద్యార్థులు తమ ప్రతిభ, సృజనాత్మకతను ప్రదర్శిస్తారు. విద్యార్థులలోని నైపుణ్యాలను వెలికితీయడానికి ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని ఎంఈవో తెలిపారు.

August 21, 2025 / 08:07 AM IST

నేడు జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన

ఖమ్మం జిల్లాలో గురువారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించనున్నట్లు మంత్రి పీఏ రాఘవరావు ఓ ప్రకటనలో తెలిపారు. తిరుమలాయపాలెం, కూసుమంచి, నేలకొండపల్లి మండలాల్లో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని చెప్పారు. ఈ విషయాన్ని ఆయా మండలాల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రజలు గమనించి మంత్రి పర్యటనను విజయవంతం చేయాలని పేర్కొన్నారు.

August 21, 2025 / 08:07 AM IST

రేపు జిల్లాలో ఉద్యోగ మేళా

BDK: కొత్తగూడెం ఎంపీడీవో క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఉద్యోగ మేళాను నిర్వహించనున్నట్లు జిల్లా అధికారి కొండపల్లి శ్రీరామ్ ఒక ప్రకటనలో తెలిపారు. నిరుద్యోగులు ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఓ ప్రైవేట్ కంపెనీలో కన్సల్టెంట్ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ కలిగి ఉండి 24 నుంచి 32 ఏళ్లలోపు ఉన్న వాళ్లు అర్హులన్నారు.

August 21, 2025 / 08:05 AM IST

గరుగుబిల్లిలో ఈ నెల 23న నేత్ర వైద్య శిబిరం

PPM: గరుగుబిల్లిమండల కేంద్రంలోని శ్రీ షిరిడీ సాయిబాబా మందిరంలో జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో శ్రీవెంకటేశ్వర పుష్పగిరి కంటి ఆసుపత్రి, విజయనగరం వారి సహకారంతో ఈ నెల 23న ఉదయం 9 గంటల నుంచి కంటి పరీక్షలు నిర్వహించనున్నట్లు శ్రీ షిరిడీ కమిటీ సభ్యులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. కంటి పరీక్షలకు వచ్చే వారు ఆధార్, ఆరోగ్య శ్రీ కార్డు, సెల్ తీసుకురావాలని పేర్కొన్నారు.

August 21, 2025 / 08:04 AM IST

ధర్మవరంలో వ్యక్తి దారుణ హత్య

శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన గురువారం ఉదయం వెలుగు చూసింది. పట్టణంలోని సిద్దార్థ థియేటర్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి (35) మృతదేహాన్ని స్థానికులు కనుగొని పోలీసులకు సమాచారం అందించారు. దుండగులు కత్తులు, కొడవళ్లు, రాళ్లతో దాడులు చేయడంతో అతడు అక్కడిక్కడే మృతి చెందాడు.

August 21, 2025 / 08:04 AM IST

‘సైబర్ నేరాలపై జాగ్రత్తగా ఉండాలి’

KMR: గాంధారి మండలం గండిపేట్‌లో బ్యాంక్ సేవలపై బుధవారం సాయంత్రం అవగాహన సదస్సు నిర్వహించారు. వినియోగదారులకు బ్యాంక్ అందించే పలు సేవలపై అవగాహన కల్పించారు. అదేవిధంగా గుర్తుతెలియని నంబర్లకు ఓటీపీలు పంపించొద్దన్నారు. సైబర్ నేరాలకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ అధికారులు, వినియోగదారులు పాల్గొన్నారు.

August 21, 2025 / 08:03 AM IST

మినీ స్టేడియాన్ని సందర్శించిన జిల్లా యువజన క్రీడాభివృద్ధి అధికారి

NZB: ఆర్మూర్ పట్టణంలోని మినీ స్టేడియం, ఇండోర్ స్టేడియాన్ని జిల్లా యువజన, క్రీడాభివృద్ధి అధికారి పవన్ కుమార్ ఈరోజు పరిశీలించారు. ఆర్మూర్ క్రీడాకారుల సౌకర్యార్థం క్రీడా మైదానాన్ని ఉన్నతీకరిస్తామన్నారు. త్వరలో క్రీడా మైదానంలో వాలీబాల్, కబడ్డీ, కోకో, ప్లే ఫీల్డ్‌ను ఏర్పాటు చేస్తామన్నారు.

August 21, 2025 / 08:02 AM IST

నేటి నుంచి తెలుగు మాటల పండగ

E.G: తెలుగు సరస్వతి పరిషత్, కళా గౌతమి సంయుక్త నిర్వహణలో రాజమండ్రిలో ఇవాళ్టి నుంచి 29 వరకు ‘తెలుగు మాటల పండుగ’ జరగనుందని అధ్యక్షుడు డా. పీవీబీ సంజీవరావు తెలిపారు. తొలి రోజు అక్షర దేవతల ఊరేగింపు, రెండో రోజు జానపద దినోత్సవం, మూడో రోజు విద్యార్థులకు తెలుగు క్విజ్, నాలుగో రోజు తెలుగు పేరంటం వంటి కార్యక్రమాలు ఉంటాయని జక్కంపూడి విజయలక్ష్మి వివరించారు.

August 21, 2025 / 08:02 AM IST

చెత్త పోయి.. చెట్లు వచ్చే.!

KMM: దుర్వాసనతో పరిసర ప్రాంత ప్రజలను ఇబ్బంది పెట్టిన ఖమ్మం నగరంలోని దానవాయిగూడెం డంపింగ్ యార్డు ఇప్పుడు హరిత సోయగంతో అందంగా మారింది. పేరుకుపోయిన లక్షల మె.ట వ్యర్థాలను శుభ్రం చేసే లక్ష్యంతో బయోమైనింగ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. శుభ్రం చేసిన స్థలంలోనే 8 ఎకరాల్లో 8 వేలకు పైగా పండ్లు, పూలు, నీడనిచ్చే పలు రకాల మొక్కలు నాటారు.

August 21, 2025 / 08:01 AM IST

నీటి ప్రవాహ ఉద్ధృతితో నిలిచిన రాకపోకలు

KDP: పెన్నా నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఆ దారి మీదుగా కమలాపురం నుంచి గంగవరం మీదుగా చాపాడుకు రాకపోకలు సాగిస్తారు. ఈ మార్గంలో లో లెవెల్ వంతెన వల్ల సమస్య ఎదురవుతోందని ఆ ప్రాంత వాసులు అంటున్నారు.

August 21, 2025 / 08:00 AM IST