SKLM: నగర మున్సిపాలిటీ ఇంఛార్జ్ కమిషనర్‌గా పల్లి నల్లన్నయ్యను శుక్రవారం ప్రభుత్వం నియమించింది. కొద్ది రోజుల పాటు ఆయన ఇంఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. నేటి మధ్యాహ్నం ఆయన బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. గతంలో కూడా శ్రీకాకుళం కమిషనర్‌గా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఈయన ప్రస్తుతం జీవీఎంసీలో విధులు నిర్వర్తిస్తున్నారు.
HYD: హైదరాబాద్ మహానగర జలమండలి అంతర్గత ఆడిట్ విభాగం రూ. 450 కోట్ల వ్యయంలో జరిగిన తేడాలను గుర్తించింది. ముఖ్యంగా మీటర్ల కొనుగోలులో టెండర్ నిబంధనలను ఒక నిర్దిష్ట కంపెనీకి అనుకూలంగా మార్చినట్లు (Tailor Made Conditions) తేలింది. నిబంధనల ప్రకారం కనీసం మూడు కంపెనీలు పోటీ పడాలి, కానీ ఇక్కడ ‘సిండికేట్’ గా ఏర్పడి రూల్స్‌ను గాలికొదిలేశారు.
TG: CM రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. ‘రైతు భరోసా ఇవ్వకుండా రైతులను మోసం చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలు కాగానే రైతుభరోసా ఇస్తామన్నారు. ఎన్నికల ముందు హామీలిస్తున్నారు.. తర్వాత మర్చిపోతున్నారు. 9 రోజుల్లో రూ.9 వేల కోట్లు వేశామని 9 నెలలుగా చెప్పారు. 67 లక్షల మంది రైతులు పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారు’ అని పేర్కొన్నారు.
ATP: తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఆంజనేయ స్వామి టేకు ప్రతిమ శుక్రవారం కసాపురం దేవాలయానికి చేరుకుంది. ఆలయ అర్చకులు స్వామివారికి ఘనంగా స్వాగతం పలికారు. మేళతాళాల మధ్య ఆలయ ప్రాంగణంలో ప్రతిమను ఊ రేగించారు. అర్చకులు ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. ఈ వేడుకలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
NRML: పోయిన లేదా చోరీకి గురైన మొబైల్ ఫోన్ల పట్ల అశ్రద్ధ వహిస్తే వ్యక్తిగత, సామాజిక భద్రతకు భంగం కలుగుతుందని ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. మొబైల్ ఫోన్లను త్వరగా ట్రేస్ చేసి స్వాధీనం చేసుకోవడానికి CEIR వెబ్‌సైట్ ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. శుక్రవారం వారు ఎస్పీ కార్యాలయంలో బాధితులకు వాళ్ల పోగొట్టుకున్న ఫోన్లను అందజేశారు.
SRCL: చందుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాన్ని శుక్రవారం అదనపు ఎస్పీ చంద్రయ్య సందర్శించారు. ఈ సందర్భంగా పరీక్ష కేంద్రంలో వసతులను పరిశీలించారు. విద్యార్థులకు డెస్కులు, మంచినీటి, ఫ్యాన్లు అన్ని వసతులు ఉన్నాయని చీఫ్ సూపరింటెండెంట్ మోహన్ కుమార్ అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట సీఐ వెంకటేశ్వర్లు ఉన్నారు.
E.G: రాజానగరం నియోజకవర్గ ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను MLA బత్తుల బాలరామకృష్ణ వెంటనే అమలు చేయాలని CPI రాష్ట్ర కార్యదర్శి పలివెల వీరబాబు శుక్రవారం డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించిన రోడ్ల అభివృద్ధి, తాగునీటి సమస్య పరిష్కారం, నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు, రైతులకు మద్దతు ధర తదితర అంశాలు కార్యరూపం దాల్చాలని కోరారు.
టాలీవుడ్ హీరో సందీప్ కిషన్‌కు జోడీగా ‘మిరాయ్’ బ్యూటీ రితికా నాయక్ నటించనున్నట్లు తెలుస్తోంది. సందీప్ హీరోగా దర్శకుడు కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘పవర్ పేట’. ఇందులో కథానాయికగా రితిక నటించనున్నట్లు సమాచారం. కాగా, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమాను 70MM ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ నిర్మిస్తుంది.
AP: వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విచారణ ముగిసింది. బాలిక మృతిపై నిరాధార ఆరోపణలు చేశారని కాకాణిని కోవూరు పోలీసులు విచారించారు. విచారణలో కేసుకు సంబంధంలేని ప్రశ్నలు అడిగారని, ఇబ్బంది పెట్టడానికే పోలీసులు పనిచేస్తున్నారని తెలిపారు. నెల్లూరు జిల్లాలో పోలీసులు ఏకపక్షంగా అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు.
TPT: జిల్లా వ్యాప్తంగా విజిబుల్ పోలీసింగ్, పల్లెనిద్ర కార్యక్రమాలను పోలీసులు చేపట్టారు. నేరాల నియంత్రణకు ప్రత్యేక గస్తీలు, తనిఖీలు నిర్వహిస్తున్నారు. గంజాయి, అసాంఘిక కార్యకలాపాలపై కఠిన నిఘా కొనసాగుతోంది. సైబర్ మోసాలపై అవగాహన కల్పిస్తూ, రోడ్డు భద్రతా నియమాల అమలుపై దృష్టిసారించారు. అనుమానాస్పద సమాచారం ఉంటే వెంటనే 112కు డయల్ చేసి తెలియజేయలన్నారు.
SKLM: మందస మండలం చిన్న బహడ పల్లి లో శ్రీ విశాలాక్షి దేవి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. గ్రామస్తుల ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమంలో పలాస కు చెందిన రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ఛైర్మన్ వజ్జ బాబూరావు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు.
కోనసీమ: అమలాపురంలోని బీఆర్కే కన్వెన్షన్ హాల్‌లో పార్లమెంట్ స్థాయి క్రియాశీలక జనసేన సభ్యత్వం(ఉద్యమి) నమోదు అవగాహనా సదస్సు శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పార్లమెంట్ మెంబర్షిప్ ఇంఛార్జ్ బత్తుల బలరామకృష్ణ, రాజోలు ఎమ్మెల్యే దేవా వరప్రసాద్ విచ్చేసి క్యాడర్ సాధక్‌లకు దిశానిర్దేశం చేశారు. క్షేత్ర స్థాయి కార్యకర్తలకు పూర్తి అవగాహన కల్పించారు.
KMM: ఖమ్మం రైల్వే స్టేషన్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. రైల్వే స్టేషన్ ఫ్లాట్ ఫాంపై ఆకస్మికంగా మృతి చెందినట్లు సమాచారం. మృతుడి వ్యక్తిగత సమాచారాలు అందలేదని, గుర్తు తెలియని కారణంగా రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. మృతుడి వివరాలు తెలిస్తే రైల్వే జీఆర్పీ అధికారులను సంప్రదించాలని సూచించారు.
WGL: ప్రయాణికుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నర్సంపేట ఆర్టీసీ డిపోలో నేడు ‘డయల్ యువర్ డీఎం’ కార్య క్రమం నిర్వహించనున్నారు. శుక్రవారం సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ప్రయాణికులు తమ ఫిర్యాదులు, సలహాలను తెలియజేయాలని డిపో మేనేజర్ ప్రసన్నలక్ష్మి తెలిపారు. 7382926166, 9989038476కు ఫోన్ చేసి బస్సుల రాకపోకలు, సౌకర్యాలపై మాట్లాడాలని ఆమె కోరారు.
AKP: సైన్స్ డే సందర్భాన్ని పురస్కరించుకుని కోటవురట్ల మండలం కొడవటిపూడి జడ్పీ హైస్కూల్లో విద్యార్థులకు శుక్రవారం చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. సైన్స్ డే ప్రాముఖ్యతపై అవగాహన కల్పించేందుకు ఈ పోటీలు ఏర్పాటు చేసినట్లు హైస్కూల్ ఇంఛార్జ్ హెచ్ఎం విజయలక్ష్మి తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు అందరూ సైన్స్ డేలో పాల్గొనాలన్నారు.