• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

భోజన నాణ్యతను పరిశీలించిన సర్పంచ్

BDK: విద్యార్థులకు అందుతున్న మధ్యాహ్న భోజన నాణ్యతను సర్పంచ్ ప్రేమేందర్ నాయక్ పరిశీలించారు. లక్ష్మీదేవిపల్లి మండల పరిషత్ ప్రభుత్వ పాఠశాలను శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల చుట్టూ ప్రహరీ గోడ నిర్మించాలని ప్రధానోపాధ్యాయురాలు భద్రమ్మ కోరగా, సర్పంచ్ సానుకూలంగా స్పందించి త్వరలోనే పనులు చేపడతామని హామీ ఇచ్చారు.

February 27, 2026 / 02:43 PM IST

‘రాజమండ్రి నగర సమగ్రాభివృద్ధి లక్ష్యంగా బడ్జెట్ రూపకల్పన’

తూ.గో: ప్రజల సంక్షేమం, నగరాభివృద్ధి లక్ష్యంగా బడ్జెట్ ఉండాలని కమిషనర్ రాహుల్ మీనా పేర్కొన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో బడ్జెట్ ముసాయిదాపై అన్ని విభాగాల అధికారులతో శుక్రవారం ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సొంత ఆదాయ వనరులు, పన్నులు, పన్నేతర ఆదాయ వనరులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే గ్రాంట్లకు సంబంధించిన పద్దులపై సుధీర్ఘంగా చర్చించారు.

February 27, 2026 / 02:42 PM IST

కారు కొంటే రూ.10 వేలు.. కొత్త సెస్‌

TG: రాష్ట్రంలో వాహన కొనుగోలుదారులకు అదనపు భారం పడనుంది. ప్రభుత్వం మార్చి 1 నుంచి రోడ్డు భద్రత సెస్ అమలు చేయాలని నిర్ణయించింది. ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థలను బలోపేతం చేయడం, రాష్ట్రవ్యాప్తంగా ప్రమాద నివారణ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. మోటారు వాహనాల చట్టం యాక్ట్ 1963కు సవరణలు చేసిన నేపథ్యంలో ఈ కొత్త సెస్ అమల్లోకి రానుంది.

February 27, 2026 / 02:42 PM IST

‘జనసేన సభ్యత్వ నమోదుతో రూ.5 లక్షల ప్రమాద బీమా’

కోనసీమ: జనసేన ఉద్యమి సభ్యత్వ కార్యక్రమం ఈనెల 26 నుంచి ప్రారంభమైందని ఆ పార్టీ మండల అధ్యక్షులు సూరపురెడ్డి సత్య తెలిపారు. చొప్పెల్ల గ్రామంలో పార్టీ నియమించిన నాయకులతో శుక్రవారం సభ్యత్య కార్యక్రమాన్ని నిర్యహించారు. కొణిదల పవన్ కళ్యాణ్ సభ్యత్వ రుసుమును రూ.400కు తగ్గించారని, సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి రూ. 5 లక్షల ప్రమాద బీమా కల్పించనున్నట్లు తెలిపారు.

February 27, 2026 / 02:39 PM IST

ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

SRCL: వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్ పరీక్ష కేంద్రంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు, కనీస వసతుల కల్పనను పరిశీలించి, అధికారులతో మాట్లాడారు. పరిశీలనలో తహసీల్దార్ జయంత్ కుమార్, అధ్యాపకులు, సిబ్బంది ఉన్నారు.

February 27, 2026 / 02:39 PM IST

గుంటూరులో అంగన్వాడీల నిరసన

GNTR: కలెక్టరేట్ వద్ద అంగన్వాడీల రిలే నిరాహార దీక్షలు శుక్రవారం 3వ రోజుకు చేరుకున్నాయి. కనీస వేతనం రూ. 26 వేలు, గ్రాట్యుటీ, మే నెల సెలవులు కల్పించాలని సీఐటీయూ డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ దీక్షలో పాల్గొన్న అంగన్వాడీలు, సమస్యల పరిష్కారం కోసం మార్చి 2న చేపట్టే ‘చలో విజయవాడ’ను విజయవంతం చేయాలని యూనియన్ అధ్యక్షురాలు రమణ పిలుపునిచ్చారు.

February 27, 2026 / 02:37 PM IST

అశ్వరావుపేటలో పర్యటించిన ఎమ్మెల్యే

BDK: అశ్వరావుపేట నియోజకవర్గంలో శుక్రవారం ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. దమ్మపేట మండలం పూసుకుంట, ఆర్లపెంట గ్రామంలో డ్వాక్రా మహిళల కోసం కమ్యూనిటీ భవన నిర్మాణం, జడ్పీ స్కూల్ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సుధాపల్లి, పాతలచ్చాపురం గ్రామంలో సీసీ రోడ్లు పనులకు శంకుస్థాపన చేశారు.

February 27, 2026 / 02:37 PM IST

కామారెడ్డి: ఇంటర్ పరీక్షకు 314 మంది గైర్హాజరు

KMR: జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నట్లు నోడల్ అధికారి షేక్ సలాం తెలిపారు. శుక్రవారం జరిగిన ప్రథమ సంవత్సర పరీక్షకు 9,572 మంది విద్యార్థులకు గాను 9,258 మంది హాజరయ్యారని, 314 మంది గైర్హాజరయ్యారని వివరించారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులు ఎటువంటి ఆందోళన చెందకుండా పరీక్షలు రాయాలని సూచించారు.

February 27, 2026 / 02:36 PM IST

వెంకటగిరి-ఏర్పేడు హైవేపై రోడ్డు ప్రమాదం

TPT: వెంకటగిరి-ఏర్పేడు మార్గంలో శుక్రవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. వెంకటగిరి నుంచి ఏర్పేడు వైపు వస్తున్న కారు దుగ్గిపేరి వద్ద అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా, మరొకరు చనిపోయినట్లు తెలుస్తోంది. క్షతగాత్రుడిని అంబులెన్సులో తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని గ్రామస్తులు చెబుతున్నారు.

February 27, 2026 / 02:36 PM IST

పిల్లల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

పిల్లల ఎదుగుదలలో తల్లిదండ్రుల పాత్ర కీలకం. పౌష్టికాహారం, టీకాలు ఇస్తూనే వారిని గ్యాడ్జెట్స్‌కు దూరంగా ఉంచి శారీరక ఆటలను ప్రోత్సహించాలి. ప్రతిరోజూ వారితో సమయం గడుపుతూ, వారి భావాలకు గౌరవం ఇవ్వాలి. ప్రేమ, క్రమశిక్షణల మధ్య సమతుల్యత పాటిస్తూ, అపరిచితుల పట్ల జాగ్రత్తలు నేర్పాలి. ఒత్తిడి లేని వాతావరణంలో పెంచుతూ వారిని బాధ్యతాయుతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దాలి. 

February 27, 2026 / 02:36 PM IST

‘జనగణన ప్రక్రియ గడువుకు ముందే పూర్తిచేయాలి’

PPM: మన్యం జిల్లాలో చేపట్టబోయే జనగణన 2027 ప్రక్రియను నిర్ణీత గడువుకు ముందే పూర్తి చేసేలా ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి మండల అధికారులకు పిలుపునిచ్చారు. సెల్ఫ్ ఎన్యూమరేషన్‌కు అత్యంత ప్రాధాన్యతను ఇస్తూ, మండల అధికారులు సమన్వయంతో పనిచేయాలని హితవు పలికారు. గడువు వరకు వేచి ఉండకుండా ముందస్తు ప్రణాళికతో పని చెయ్యాలన్నారు.

February 27, 2026 / 02:35 PM IST

ఇంటర్ పరీక్షకు నలుగురు గైర్హాజరు

KMR: దోమకొండలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం మొదటి సంవత్సర ఇంగ్లీష్-I (సెట్–C) పరీక్షను విజయవంతంగా నిర్వహించారు. మొత్తం 140 మంది విద్యార్థులకు 136 మంది హాజరయ్యారు. జనరల్ విభాగంలో 116 మంది విద్యార్థులకు 115 మంది, వొకేషనల్ విభాగంలో 24 మందికి గానూ 21 మంది పరీక్ష రాశారు. నలుగురు గైర్హాజరయ్యారని కళాశాల ప్రిన్సిపల్ శంకర్ తెలిపారు.

February 27, 2026 / 02:35 PM IST

‘ఒక్క CC కెమెరా 100 మంది పోలీసులతో సమానం’

ASF: కాగజ్ నగర్ పట్టణంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బస్టాండ్ నుంచి ఓల్డ్ చెకోపోస్ట్ వరకు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను జిల్లా SP నీతికా పంత్ శుక్రవారం ప్రారంభించారు. SP మాట్లాడుతూ.. నేరాల నియంత్రణకు CC కెమెరాలు మూడవ కన్నులా పనిచేస్తాయని తెలిపారు. ఒక్క CC కెమెరా 100 మంది పోలీసులతో సమానం అని పేర్కొన్నారు.

February 27, 2026 / 02:34 PM IST

ఉచిత కంటి వైద్య పరీక్షలు

SRD: కంగి మండలంలోని ముర్కుంజాల్లో సర్పంచ్ సారంగి అనుష ఆహ్వానం మేరకు, లయన్స్ క్లబ్ ఖేడ్ శాఖ సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఓ ఆసుపత్రి బృందం గ్రామస్థులకు పరీక్షలు చేసి, అవసరమైన వారికి ఉచిత శస్త్రచికిత్సలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు సాయి రెడ్డి, సాయ గౌడ్, లాల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

February 27, 2026 / 02:34 PM IST

నేటితో ముగియనున్న వార్డు సభ్యుల శిక్షణ

KNR: శంకరపట్నం మండలంలోని తాడికల్ రైతు వేదికలో నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులకు 5 రోజులుగా శిక్షణా తరగతులు కొనసాగుతున్నాయి. ఎంపీవో ప్రభాకర్ అధ్యక్షతన జరిగుతున్న ఈ కార్యక్రమంలో కొత్తగట్టు, గొల్లపల్లి, లింగాపూర్‌తో సహా 12 గ్రామాల సభ్యులకు పంచాయతీరాజ్ చట్టం-2018పై అవగాహన కల్పించారు. నేటితో ఓరియంటేషన్ శిక్షణ ముగియనుంది.

February 27, 2026 / 02:32 PM IST