SRD: జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థుల యొక్క ఇంటర్నల్ మార్కులను రేపటిలోగా ఆన్లైన్ నమోదు చేయాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ విషయాన్ని అన్ని రకాల పాఠశాలల ప్రధానోపాధ్యాయులు గమనించాలని సూచించారు. నమోదు చేయని పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.