• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఉరుసు ఉత్సవాల పోస్టర్లను విడుదల చేసిన మంత్రి

నంద్యాల: ఇవాళ ఎల్లార్తి శేక్షావలి షాషావలి సాహెబ్ 363 వ ఉరుసు ఉత్సవాలకు సంబంధించిన వాల్ పోస్టర్లను మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ విడుదల చేశారు. ఎల్లార్తి దర్గా EO ఇమ్రాన్ మాట్లాడుతూ.. ఈ వచ్చేనెల 18 న గంధం 19 న ఉరుసు ఉత్సవాలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకుడు ఈడిగ గోవింద్ గౌడ్ యువ నాయకుడు ఈడిగ రాజేంద్ర గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

August 29, 2025 / 10:09 AM IST

మెరుగైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే

NLR: కందుకూరు నియోజకవర్గంలోని దివ్యాంగ విద్యార్థుల కోసం నిర్వహించిన మెడికల్ క్యాంపును ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరావు గురువారం ప్రారంభించారు. ఎంఈవో కార్యాలయం ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడం లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందన్నారు.

August 29, 2025 / 10:09 AM IST

బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా తణుకు నాయకురాలు

W.G: బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా తణుకు మాజీ మున్సిపల్ ఛైర్ పర్సన్ ముళ్ళపూడి రేణుక నియమితులైనారు. భీమవరంలోని నరసాపురం పార్లమెంటు కార్యాలయంలో గురువారం బీజేపీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో BJP AP అధ్యక్షుడు PVN మాధవ్, కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

August 29, 2025 / 10:08 AM IST

సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు భూసేకరణ పూర్తి: కలెక్టర్

ELR: ప్రధానమంత్రి కుసుమ్ పథకం కింద ఏలూరు జిల్లాలో సోలార్ ప్లాంట్ ఏర్పాటు కోసం 78 ఎకరాల భూసేకరణ పనులు పూర్తయ్యాయని కలెక్టర్ వెట్రిసెల్వి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌కు తెలిపారు. ఏపీ సచివాలయం నుంచి గురువారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ ఈ విషయాన్ని వెల్లడించారు. త్వరలో సోలార్ ప్లాంట్ నిర్మాణ పనులు ప్రారంభిస్తామని ఆమె చెప్పారు.

August 29, 2025 / 10:08 AM IST

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో జిల్లా జనసేన అధ్యక్షుడు భేటీ

ATP: విశాఖపట్నంలో జరుగుతున్న జనసేన పార్టీ కార్యవర్గ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు టీసీ వరుణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో పార్టీ బలోపేతం, కూటమి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై అధినేత దిశానిర్దేశం చేసినట్లు వరుణ్ తెలిపారు.

August 29, 2025 / 10:07 AM IST

సర్వేపల్లి రాధాకృష్ణ ప్రతిభా పురస్కారానికి చిట్యాల వాసి ఎంపిక

NLG: హైదరాబాద్, ఖైరతాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సంస్కృత భాష అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న గంటెపాక శ్రీను (చిట్యాల వాసి) సర్వేపల్లి రాధాకృష్ణ ప్రతిభా పురస్కారానికి ఎంపికయ్యారు. ఈనెల 31న గుంటూరులో జరిగే కార్యక్రమంలో ఆయనకు ఈ పురస్కారాన్ని అందించనున్నట్లు సంస్థ ఫౌండర్ వై నాగయ్య, గౌరవ అధ్యక్షులు లక్ష్మణ్ రావులు ఉత్తర్వులు జారీ చేశారు.

August 29, 2025 / 10:06 AM IST

తెనాలిలో మధ్యాహ్నం వరకే బుకింగ్ కౌంటర్

GNTR: తెనాలి రైల్వేస్టేషన్‌లో వెస్ట్ బుకింగ్ కౌంటర్ ఉన్నప్పటికీ అది ప్రయాణికులకు ఉపయోగపడటం లేదని ప్రయాణికులు వాపోతున్నారు. ఈ కౌంటర్ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకే పనిచేస్తుండటంతో చెంచుపేట, సుల్తానాబాద్ వైపు నుంచి వచ్చే వారు ఇబ్బంది పడుతున్నారు. మెయిన్ వైపు కౌంటర్లు ఉన్నా, చాలామంది వెస్ట్ బుకింగ్ కౌంటర్‌పైనే ఆధారపడతారు. ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు.

August 29, 2025 / 10:05 AM IST

‘పళ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు వేసినట్లుంది నా పరిస్థితి’

AP: సుగాలి ప్రీతి కేసులో తన పరిస్థితి పళ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్నట్లుగా ఉందని Dy CM పవన్ అన్నారు. గత ప్రభుత్వంలో ఎవరూ మాట్లాడలేని సమయంలో, ప్రీతి తల్లి ఆవేదన చూసి కర్నూలు వెళ్లి గట్టిగా పోరాడానని గుర్తు చేసుకున్నారు. ఆ పోరాటం ఫలితంగానే అప్పటి ప్రభుత్వం కేసును ముందుకు తీసుకెళ్లిందని తెలిపారు. అంతేకాక, ప్రీతి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకునేలా చేశామని తెలిపారు.

August 29, 2025 / 10:05 AM IST

సెల్‌ఫోన్ దొంగతనాలకు పాల్పడుతున్న జార్ఖండ్‌ ముఠా

HNK: పోలీస్ స్టేషన్ పరిధిలో సెల్ ఫోన్ దొంగతనాలకు పాల్పడిన జార్ఖండ్‌కు చెందిన ఐదుగురు నిందితులను శుక్రవారం పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి రూ.1,50,000 విలువ గల మూడు సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేశామని సీఐ శివకుమార్ అన్నారు. రెండు రోజుల క్రితం నిందితులు హమ్మకొండకు వచ్చి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు.

August 29, 2025 / 10:04 AM IST

భారీ వదర.. నిండిపోయిన హైస్కూల్ గ్రౌండ్

KNR: హుజురాబాద్‌లో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో హైస్కూల్ గ్రౌండ్ నీటితో నిండిపోయింది. వాకింగ్ ట్రాక్ నిర్మాణం కోసం పోసిన మట్టి వల్ల నీరు బయటకు వెళ్లకుండా నిలిచిపోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. రూ.10 లక్షలతో పనులు ప్రారంభించినప్పటికీ, ప్రణాళిక లోపంతో సమస్య ఏర్పడింది. వాకర్స్ అసోసియేషన్, బీజేపీ నాయకులు తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు.

August 29, 2025 / 10:03 AM IST

ప్రజల భాషనే నిజమైన భాష

KDP : ప్రజల భాషనే నిజమైన భాష అని చాటి చెప్పిన మహనీయుడు గిడుగు రామ్మూర్తి పంతులు అని పులివెందుల నియోజకవర్గంTDP ఇంఛార్జ్ మారెడ్డి రవీంద్రనాథ రెడ్డి అన్నారు. తెలుగు భాషా దినోత్సవం సందర్బంగా గిడుగు రామ్మూర్తి పంతులు గురించి ఆయన వివరించారు. మన పిల్లలు చదివే పాఠ్యపుస్తకాలలో, మాట్లాడే మాటల్లో గిడుగు చూపించిన విధానాలే ఉన్నాయని తెలిపారు.

August 29, 2025 / 10:03 AM IST

వికలాంగుల పెన్షన్లపై అప్పీలుకు అవకాశం

PLD: జిల్లాలో వికలాంగుల పెన్షన్లకు సంబంధించి రీ-అసెస్‌మెంట్ తర్వాత 2,727 మందికి నోటీసులు ఇచ్చారు. వారిలో ఇప్పటివరకు 1,807 మంది మాత్రమే అప్పీలు చేసుకున్నారు. నోటీసులు పొందిన మిగిలిన వికలాంగులు అర్హతను బట్టి మున్సిపల్ కమిషనర్ లేదా ఎంపీడీవో కార్యాలయాల్లో అప్పీలు చేసుకోవాలని జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ శుక్రవారం తెలిపారు.

August 29, 2025 / 10:03 AM IST

కుక్కల స్వైర విహారం…భయాందోళనలో పురవాసులు…!

SRPT: సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మున్సిపల్ పరిధిలో వీధి కుక్కల బెడద అధికమైంది. పట్టణ వీధులలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. రోడ్లమీద ప్రయాణించాలంటేనే ప్రజలు భయాభ్రాంతులకు గురవుతున్నారు. ఏ క్షణాన ఏ వైపు నుంచి చిన్నారులపై కుక్కలు దాడి చేస్తాయోనని తల్లిదండ్రులు భయాందోళన గురవుతున్నారు. కుక్కలు గుంపులు, గుంపులుగా స్వైరవిహారం చేస్తున్నాయని పేర్కొంటున్నారు.

August 29, 2025 / 10:03 AM IST

ఆదర్శ పాఠశాలలో గిడుగు రామ్మూర్తి జయంతి

SKLM: జలుమూరు ఆదర్శ పాఠశాలలో శుక్రవారం గిడుగు రామ్మూర్తి జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రధానోపాధ్యాయులు ఇప్పిలి మాధవ రావు, ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. తెలుగు భాష గొప్పతనంపై పలువురు ఉపాధ్యాయులు తెలియజేశారు.

August 29, 2025 / 10:02 AM IST

రేపు SVCCలో జాబ్‌మేళా

తిరుపతి ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో స్థానిక బాలాజీ కాలనీలోని SVCC డిగ్రీ కళాశాలలో శనివారం జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి లోకనాథం ఒక ప్రకటనలో తెలిపారు. SSC, ఇంటర్, డిగ్రీ, పీజీ ఉత్తీర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

August 29, 2025 / 10:02 AM IST