KNR: సీపీఐ మాజీ పార్లమెంటు సభ్యులు, సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభ సందర్భంగా శనివారం కరీంనగర్ నుండి సీపీఐ నాయకులు భారీగా తరలివెళ్లారు. ఈ సందర్భంగా పలువురు సీపీఐ నాయకులు మాట్లాడుతూ.. సురవరం సుధాకర్ రెడ్డి మరణం కమ్యూనిస్టు పార్టీకి తీరని లోటని అన్నారు.
ELR: చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెంలోని తమ్మిలేరు జలాశయం నుంచి ఇరిగేషన్ అధికారులు శుక్రవారం 1,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టులోకి 5,000 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉందని ఏఈ లాజర్ తెలిపారు. ప్రాజెక్టు నీటిమట్టం 348 అడుగులకు చేరుకోవడంతో దిగువ ప్రాంతాలకు ఈ నీటిని విడుదల చేసినట్లు ఆయన వివరించారు.
PDPL: జిల్లా కొత్త DSCDOగా మండల రవీందర్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. మంచిర్యాల జిల్లా సహాయ సాంఘిక సంక్షేమ అధికారిగా విధులు నిర్వహిస్తున్న ఆయన DSCDOగా పదోన్నతి పొందారు. తాజాగా పెద్దపెల్లి జిల్లా షెడ్యూలు కులాల అభివృద్ధిశాఖ అధికారిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ను శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసిన రవీందర్ విధుల్లో చేరారు.
NGKL: జిల్లాలో గడిచిన 24 గంటలో వివిధ ప్రాంతాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా పాలెంలో 20.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. తిమ్మాజిపేట 14.8 మి.మీ, ఏల్లికల్ 14.3 మి.మీ, కొండారెడ్డిపల్లి 13.3 మి.మీ, అచ్చంపేట 11.0 మి.మీ, మంగనూర్ 9.5 మి.మీ, పెద్ద కొత్తపల్లి 9.0, ఉప్పునుంతల 4.8 మి.మీ, తోటపల్లి 3.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది.
అన్నమయ్య: క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించాలని సబ్‌కలెక్టర్ చల్లా కళ్యాణి అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా మదనపల్లిలోని సాయి ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం ఆమె మాట్లాడుతూ.. క్రీడల వల్ల శారీరక, మానసిక ఉల్లాసం కలుగుతుందని, క్రీడా కోటాలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఆమె క్రీడాకారులకు సూచించారు.
JGL: ఎరువులను MRP కంటే ఎక్కువ ధరకు అమ్మినట్లయితే అట్టి డీలర్లపైన కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని జగిత్యాల జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్ హెచ్చరించారు. శుక్రవారం జగిత్యాల అర్బన్ మండలంలోని పలు ఫర్టిలైజర్ దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు చేసి, ఎరువుల స్టాకు రిజిస్టర్లు, e-PASSలో ఉన్న స్టాక్ వివరాలు, గోదాములలో ఉన్న ఎరువుల నిల్వలను తనిఖీ చేశారు.
NLG: గట్టుప్పల్ మండలం తెరట్ పల్లి గ్రామ ప్రజల సౌకర్యార్థం మాజీ సర్పంచ్ వీరమల్ల శ్రీశైలం గౌడ్ వైకుంఠ రథాన్ని బహుకరించారు. ఆయన తన తాత, నాయనమ్మలు వీరమల్ల డేగయ్య, పాపమ్మ,సత్తమ్మ జ్ఞాపకార్థం ఈ వాహనాన్ని అందించారు. వైకుంఠ రథం అందుబాటులోకి రావడంతో గ్రామస్తులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వీరమల్ల యాదయ్య, యాదమ్మ గ్రామ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
SRCL: వీర్నపల్లిలోని తెలంగాణ మోడల్ స్కూల్లో 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు మిగిలిన సీట్ల కోసం స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ అశోక్ శనివారం తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి SEP1, 2025న ఉదయం 10 గంటలకు పాఠశాలలో హాజరుకావాలని ఆయన సూచించారు. అడ్మిషన్ కోసం వచ్చే విద్యార్థులు స్టడీ సర్టిఫికెట్స్, ఆధార్ కార్డు తీసుకురావలన్నారు.
ప్రకాశం: చీమకుర్తిలోని మిడ్ వేస్ట్ గ్రానైట్ క్వారీలో భారీ ప్రమాదం జరిగినట్లు సమాచారం. శుక్రవారం రాత్రి క్వారీలోని ఓ అంచు విరిగి పడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అయితే రాళ్లు విరిగిపడిన సమయంలో 50 మంది కూలీలు భోజనానికి వెళ్లినట్లు తెలిసింది. దీనితో పెను ప్రమాదం తప్పింది. కాగా క్వారీలో ఉన్న మెషిన్ పూర్తిగా ధ్వంసం అయినట్లు తెలుస్తుంది.
GNTR: వైసీపీ సానుభూతి పరుడు గుంటూరుకు చెందిన బోరుగడ్డ అనిల్‌పై గతంలో నమోదైన బెదిరింపుల కేసును గుంటూరు 6వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి మొహ్మద్ గౌస్ శుక్రవారం కొట్టివేశారు. పొలం సర్వే చేసే క్రమంలో పెదకాకాని తహసీల్దార్ కార్యాలయంలో సర్వేయర్‌గా పనిచేస్తున్న మల్లిఖార్జునరావుని 2016లో బోరుగడ్డ బెదిరించినట్లు పెదకాకాని పోలీసులు కేసు నమోదు చేశారు.
అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రిగా యూపీ సీఎం ఆదిత్యనాథ్ దేశంలో నిలిచారు. దేశంలోని 28 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలితప్రాంతాల సీఎంల పనితీరుపై ‘ఇండియా టుడే’ సర్వే నిర్వహించింది. దాంట్లో 36% ఆదరణతో ఆయన తొలి స్థానంలో ఉన్నారు. 13%తో బెంగాల్ సీఎం మమత రెండో స్థానంలో, 7%తో ఏపీ సీఎం చంద్రబాబు మూడో స్థానంలో ఉన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి 2.1% ఆదరణ లభించింది.
హైదరాబాద్‌లో పేదోడు ఓ ఫంక్షన్ చేయాలంటే కొండంత భారంగా మారింది. ఇందుకోసం అప్పు మీద అప్పు చేయాల్సిన పరిస్థితి. HYDలో ఒక ఫంక్షన్ కోసం లక్షల్లో ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. అనేక జిల్లాల నుంచి బతుకు తెరువు కోసం వలస వచ్చిన ఎంతో మంది ఈ ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. HYDలో ప్రభుత్వం ప్రతి డివిజన్‌లో కనీసం రెండు ఫంక్షన్ హాల్స్ నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.
BDK: రానున్న 5 రోజులు జిల్లాలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ఆగస్టు 30, సెప్టెంబర్ 1న భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఆగస్టు 31న అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని చెప్పారు. 5 రోజులు వర్ష సూచన ఉన్న నేపథ్యంలో రైతులు పంట పొలాల్లో నీరు నిలువ లేకుండా చూసుకోవాలని సూచించారు.
BHPL: జిల్లా తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి స్పాట్ అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలైందని జిల్లా అల్పసంఖ్యాక సంక్షేమ అధికారి వెంకటేశ్వర్లు శనివారం తెలిపారు. 5వ తరగతిలో ఎస్సీలకు 2, బీసీలకు 2 సీట్లు, ఇంటర్ ఫస్టియర్‌లో ఎంపీసీ/బైపీసీలకు ఓసీలకు 1, ఎస్టీలకు 1 సీటు ఖాళీగా ఉన్నాయని, ఈ నెల 31లోపు దరఖాస్తు చేయాలని కోరారు.
WGL: రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాలన్నారు. పాలకుర్తి MLA యశస్విని రెడ్డి,టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి ఆదేశాల మేరకు రాయపర్తి మండలం గట్టికల్, గ్రామ కోఆర్డినేటర్లతో శనివారం ఉదయం ఏర్పాటు చేసిన సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కృషి చేయాలని మండల నాయకులు దిశా నిర్దేశం చేశారు.