PLD: జిల్లాలో వికలాంగుల పెన్షన్లకు సంబంధించి రీ-అసెస్మెంట్ తర్వాత 2,727 మందికి నోటీసులు ఇచ్చారు. వారిలో ఇప్పటివరకు 1,807 మంది మాత్రమే అప్పీలు చేసుకున్నారు. నోటీసులు పొందిన మిగిలిన వికలాంగులు అర్హతను బట్టి మున్సిపల్ కమిషనర్ లేదా ఎంపీడీవో కార్యాలయాల్లో అప్పీలు చేసుకోవాలని జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ శుక్రవారం తెలిపారు.