• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

జిల్లాలో ఎంత మంది విద్యార్థుల గైర్హాజరు అంటే..!

కర్నూలు: జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలకు 358 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్ బోర్డు ప్రాంతీయ అధికారి లాలప్ప శుక్రవారం తెలిపారు. మొత్తం 5,069 మందికి గానూ 4,711 మంది పరీక్షలకు హాజరయ్యారని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగలేదని, పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయని అధికారి వెల్లడించారు.

February 27, 2026 / 02:20 PM IST

నకిరేకల్‌లో ప్లకార్డులతో డీవైఎఫ్ఐ నిరసన

NLG: నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో అగ్రకుల అహంకారంతో రెండు నెలల పసిపాప ప్రాణాలు తీయడం పట్ల డీవీఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లం మహేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నకిరేకల్ బస్టాండ్ వద్ద ప్లకార్డులతో నిరసన చేపట్టారు. బాధితులపై దాడి చేసిన 8 మందిని వెంటనే అరెస్ట్ చేయాలని, నిర్లక్ష్యం వహించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని సీఎంను కోరారు.

February 27, 2026 / 02:20 PM IST

MLAను సన్మానించిన MLC

మంచిర్యాల MLA కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుని శుక్రవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్, కాగజ్ నగర్ మున్సిపల్ ఛైర్మన్ షాహిన్ సుల్తాన్ దస్తగిరి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా MLAను కౌన్సిలర్‌లతో కలిసి శాలువాలతో సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే వారందరికీ హార్థిక శుభాకాంక్షలు తెలిపారు.

February 27, 2026 / 02:19 PM IST

T20 WC: సెమీస్‌కు అడుగు దూరంలో భారత్

టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా సెమీస్‌కు అడుగు దూరంలో నిలిచింది. జింబాబ్వేపై విజయం సాధించిన భారత్, రెండు మ్యాచ్‌ల్లో 2 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. వెస్టిండీస్ కూడా రెండు మ్యాచ్‌ల్లో 2 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. అయితే, చివరి మ్యాచ్‌లో ఈ రెండు జట్లే తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా సెమీస్‌కు చేరుకుంటుంది.

February 27, 2026 / 02:19 PM IST

ఇసుక అక్రమ రవాణాకు చెక్.. ‘మన ఇసుక వాహనం’ ప్రారంభం

NZB: పోతంగల్ మండలంలోని సుంకిని గ్రామంలో మన ఇసుక వాహనం ఆన్‌లైన్ కార్యక్రమాన్ని తహసీల్దార్ గంగాధర్ శుక్రవారం స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమం ప్రవేశపెట్టిందని ఆయన తెలిపారు. ఇసుక అవసరమైన వినియోగదారులు మన ఇసుక వాహనం యాప్ ద్వార ఆన్‌లైన్లో బుక్ చేసుకుని పొందాలన్నారు.

February 27, 2026 / 02:17 PM IST

‘ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి’

ELR: గణపవరం చింతలపాటి మూర్తి రాజు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. శుక్రవారం హిస్టరీ, వొకేషనల్ పరీక్షలకు 25 మంది మంది విద్యార్థులు హాజరు కావలసి ఉండగా 23 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇద్దరు విద్యార్థులు గైరాజరయ్యారు. పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంది.

February 27, 2026 / 02:15 PM IST

ఆదోనిలో CMRF చెక్కుల పంపిణీ

KRNL: ఆదోని నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు. సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు చేతుల మీదుగా 70 మంది లబ్ధిదారులకు రూ. 27,56,659 విలువైన ఆర్థిక సహాయాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు సీఎం చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

February 27, 2026 / 02:15 PM IST

‘బషీరాబాద్‌ ప్రజల చిరకాల వాంఛ నెరవేరింది’

VKB: నవాంద్గీ రైల్వే స్టేషన్‌లో హుబ్లీ ఎక్స్‌ప్రెస్ రైలు స్టాప్ శుక్రవారం ప్రారంభమైంది. MP కొండ విశ్వేశ్వర్ రెడ్డి, MLA బుయ్యని మనోహర్ రెడ్డి కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొని రైలుకు పచ్చజెండా ఊపారు. రైలు ఆగడం వల్ల బషీరాబాద్ ప్రాంతానికి రవాణా సౌకర్యం పెరుగుతుందని, అభివృద్ధికి దోహదం అవుతుందని ఇద్దరూ పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.

February 27, 2026 / 02:15 PM IST

పాఠశాలలో చంద్రశేఖర్ ఆజాద్ వర్ధంతి

SRCL: చందుర్తి మండలం సనుగుల గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఇవాళ చంద్రశేఖర్ ఆజాద్ వర్ధంతిని నిర్వహించారు . ఈ సందర్భంగా చంద్రశేఖర్ ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రధానోపాధ్యాయుడు కటుకూరి ముఖేష్ మాట్లాడుతూ.. స్వాతంత్య్ర పోరాటంలో చంద్రశేఖర్ ఆజాద్ కీలక భూమిక పోషించారన్నారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేశారన్నారు.

February 27, 2026 / 02:15 PM IST

‘ఉపాధి హామీలో అవినీతి జరిగితే కఠిన చర్యలు తప్పవు’

JGL: ఉపాధి హామీ పథకం పనుల్లో సిబ్బంది అవినీతికి పాల్పడితే చర్యలు తప్పవని డీఆర్డీవో రఘువరన్ హెచ్చరించారు. ఇబ్రహీంపట్నంలోని రైతు వేదికలో ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ ప్రజావేదికను శుక్రవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. గత ఏడాది ఈ పథకంలో చేపట్టిన పనులపై తనిఖీ నిర్వహించి, ఫీల్డ్ అసిస్టెంట్ పంచాయతీ కార్యదర్శుల నుంచి రూ. 18 వేలను రికవరీ చేసి జరిమానా ఆదేశించారు.

February 27, 2026 / 02:14 PM IST

నగరి ఎమ్మెల్యేను కలిసిన ఆర్డీవో

CTR: నగరి డివిజన్ ఆర్డీవోగా బాధ్యతలు స్వీకరించిన ఎం.అనుపమ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అభివృద్ధి పనులు, ప్రజలకు సేవలు వేగంగా అందించడంలో రెవెన్యూ శాఖ కీలక పాత్ర పోషించాలని ఎమ్మెల్యే సూచించారు. మాంగాడు, వీకేఆర్ పురం, కోసలనగరం పారిశ్రామిక వాడల పనులను వేగవంతం చేయాలని సూచించారు.

February 27, 2026 / 02:12 PM IST

జాతీయ స్థాయి క్రీడాకారులకు రామలింగారెడ్డి ఆర్థిక సాయం

ATP: షూటింగ్ బాల్ పోటీల్లో ప్రతిభ చాటి జాతీయ స్థాయికి ఎంపికైన సిద్ధరాంపురం విద్యార్థులు అభిలాష్, అంజలికి టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి రూ.10 వేల ఆర్థిక సాయం అందించారు. తల్లిదండ్రులు లేకపోయినా అంజలి కనబరిచిన పట్టుదలను ఆయన అభినందించారు. ఆ విద్యార్థిని చదువుకు, భవిష్యత్తుకు అన్ని విధాలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

February 27, 2026 / 02:12 PM IST

రేపు మల్లంపేటలో ఉచిత వైద్య శిబిరం

కాకినాడ: రౌతులపూడి మండలం మల్లంపేటలో శనివారం ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తామని నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. మమత ఆసుపత్రి, రాఘవ ఆసుపత్రి, పుష్ప ప్రాథమిక కంటి ఆసుపత్రులకు చెందిన వైద్య బృందం శిబిరంలో సేవలందిస్తుందని పేర్కొన్నారు. అవసరమైన వారు ఈ సేవలు వినియోగించుకోవాలని కోరారు.

February 27, 2026 / 02:12 PM IST

నేడు ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ పరీక్ష

NZB: ధర్పల్లి మండల కేంద్రంలోని రెండు పరీక్ష కేంద్రాల్లో శుక్రవారం మొదటి సంవత్సరం ఇంగ్లీష్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జూనియర్ కళాశాలలో 302 విద్యార్థులకు గాను ముగ్గురు, ప్రభుత్వ ఆదర్శ కళాశాలలో 180 విద్యార్థులకు గాను ఒక్కరు గైర్హాజరైనట్లు GNC ప్రిన్సిపల్ శ్రీనాథ్, MJC ప్రిన్సిపాల్ శ్రీనివాస్ తెలిపారు.

February 27, 2026 / 02:11 PM IST

చెట్టును ఢీకొన్న కారు.. నలుగురికి తీవ్ర గాయాలు

BHNG: మోత్కూర్ మండలం పాటిమట్ల గ్రామంలో మూల మలుపు వద్ద ఇవాళ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో వెళ్తున్న స్విఫ్ట్ కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురికి తీవ్ర గాయాలవ్వగా.. పరిస్థితి విషమంగా ఉన్న ఒకరిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించినట్లు స్థానికులు పేర్కొన్నారు.

February 27, 2026 / 02:10 PM IST