నేడు మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని మెట్టుగడ్డ గిరిజన భవన్‌లో శ్రీశ్రీశ్రీ సంత్ సేవాలాల్ మహారాజు జయంతి ముగింపు ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని గిరిజన విద్యార్థి సేవా సంఘం అధ్యక్షులు రవి రాథోడ్ ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఈ కార్యక్రమానికి గిరిజన సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు హనుమాన్ నాయక్ ముఖ్యఅతిథిగా వస్తారన్నారు. నేడు అన్నదాన కార్యక్రమం ఉంటుందన్నారు.
E.G: కొవ్వూరు MEO-1గా బాధ్యతలు చేపట్టిన ఉందుర్తి శాంసన్ శనివారం MLA ముప్పిడి వెంకటేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థుల కోసం రూపొందించిన 100 రోజుల ప్రణాళికను పక్కాగా అమలు చేయాలని MLA ఆదేశించారు. మండలం వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ భేటీలో UTF నాయకులు పల్లికొండ, విజయ్ రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.
AP: కాకినాడ జిల్లా వేట్లపాలెం పేలుడు ఘటనకు సంబంధించి సూర్యశ్రీ ఫైర్ క్రాకర్స్ యూనిట్ యజమానిని పోలీసులు అరెస్ట్ చేశారు. యజమాని అర్జున్‌తో పాటు సోదరుడు వీరబాబును అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఈ ప్రమాదంలో 22 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.
విజయ్ దేవరకొండ, రష్మిక జంట తమ వివాహ వేడుకను వినూత్నంగా, సేవా కార్యక్రమాలతో జరుపుకుంటూ ఆదర్శంగా నిలిచారు. పెళ్లి తర్వాత ఈ జంట దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఇవాళ అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, రాజస్థాన్, గుజరాత్, యూపీ, అస్సాంలలోని ప్రధాన ఆలయాల్లో భక్తులకు అన్నప్రసాదం, మిఠాయిలు పంచుతూ తమ సంతోషాన్ని అందరితో పంచుకుంటున్నారు.
GDWL: ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు సూచించారు. శనివారం ఇటిక్యాల మండలం వావిలాలలో లివర్ ఆపరేషన్ కోసం బాధిత కుటుంబానికి రూ.5 లక్షల విలువైన LOC అందజేశారు. నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ చంద్రగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
BDK: కరకగూడెం మండలంలోని అశ్వారావుపాడు వలస ఆదివాసీ గ్రామంలో కోవాసి వెంకటేష్ అనే గిరిజనుడు దారుణ హత్యకు గురయ్యాడు. శనివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు అతడిని హతమార్చినట్లు సమాచారం. ఈ ఘటనతో ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై నాగేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
SRD: నారాయణఖేడ్ పట్టణంలోని వీరశైవ పంచ ఆచార్య జంగమ భవన ప్రాంగణంలో ఆదివారం ఆది జగద్గురు రేణుకాచార్యుల జయంతి కార్యక్రమం వీరశైవ జంగమ, లింగాయత్ సమాజ్ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. తాలూకా జంగమ సమాజ్ అధ్యక్షులు శివకుమార్ స్వామి, మనూర్ మాజీ ఎంపీపీ శంకరయ్య స్వామి రేణుక చార్యుల చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ATP: జిల్లాలో పింఛన్ల పంపిణీ ప్రక్రియ సజావుగా సాగింది. మొదటి రోజే 2,58,775 మందికి రూ. 115.34 కోట్ల సొమ్మును అధికారులు అందజేశారు. 93 శాతం పంపిణీ పూర్తి చేసి రాష్ట్రస్థాయిలో జిల్లా నాలుగో స్థానంలో నిలిచింది. కలెక్టర్ ఆనంద్ స్వయంగా ఉప్పరపల్లిలో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. శనివారం పింఛన్ అందుకోలేని వారికి ఇవాళ అందజేయనున్నారు.
E.G: యానాం 51వ ప్రాంతీయ పరిపాలనాధికారిగా PCS అధికారి శివరాజ్ మీనా శనివారం సాయంత్రం బాధ్యతలు చేపట్టారు. గతంలో కోవిడ్ సమయంలో అడ్మినిస్ట్రేటర్గా పనిచేసిన ఆయనపై ప్రజల్లో మంచి గుర్తింపు ఉంది. బాధ్యతలు స్వీకరించిన ఆయనకు పలువురు నేతలు శుభాకాంక్షలు తెలిపారు. పాత పరిచయాలతో యానాం అభివృద్ధికి వేగంగా నిర్ణయాలు తీసుకుంటారని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
సత్యసాయి: జిల్లాలోని పలు డైరీలు, పాల కేంద్రాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఎనుములపల్లి, జగరాజుపల్లె, కొత్తచెరువు, బత్తలపల్లి ప్రాంతాల్లోని ఐదు ప్రధాన డైరీల నుంచి పాల నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపారు. పాలలో పిండి పదార్థాలు, యూరియా వంటి హానికర రసాయనాలు కలిపితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
యుద్ధంలోకి అమెరికాను ట్రంప్ లాగుతున్నారని ఆ దేశ మాజీ ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ మండిపడ్డారు. ఇరాన్‌లో పాలన మార్పు యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నానని తెలిపారు. యుద్ధం కోసం అమెరికా దళాలకు హాని కలిగిస్తున్నారని చెప్పారు. కాగా ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడి వల్ల ఆ దేశ సుప్రీం ఖమేనీ మరణించిన విషయం తెలిసిందే.
SRCL: వేములవాడ సబ్ డివిజనల్ పోలీసు అధికారిగా ఏ. శ్రీనివాసులు నియమితులయ్యారు. హైదరాబాద్ సిటీ సీపీటీసీలో ఏసీపీగా పనిచేస్తున్న ఆయనను వేములవాడ డీఎస్పీగా బదిలీ చేస్తూ డీజీపీ కార్యాలయం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ ఏఎస్పీగా పనిచేస్తున్న ఐపీఎస్ అధికారి సాయి రుత్విక్ ను ఉట్నూర్ ఏఎస్పీగా బదిలీ చేసినట్లు సమాచారం.
KRNL: BJP జిల్లా అధికార ప్రతినిధిగా గురురాజారావును అధిష్ఠానం ఎన్నుకున్నట్లు ఆయన ఇవాళ తెలిపారు. పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తామన్నారు. తనపై నమ్మకం ఉంచి జిల్లా అధికార ప్రతినిధిగా తనను నియమించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు సహకరించిన వారందరికి కృతజ్ఞతలు తెలిపారు. రానున్న ఎన్నికల్లో ఎమ్మిగనూరు నియోజకవర్గంలో పార్టీని అధికారంలోకి తెస్తామన్నారు.
కన్నడ స్టార్ యష్, దర్శకురాలు గీతూ మోహన్ దాస్ కాంబోలో ‘టాక్సిక్’ మూవీ తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన టీజర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ ఫస్ట్ సింగిల్‌కు టైం ఖరారైంది. మార్చి 2న మధ్యాహ్నం 12:59 గంటలకు పాటను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. యష్, కియారా అద్వానీలపై వచ్చే ఈ పాటపై ఆసక్తి నెలకొంది. ఇక ఈ మూవీ 2026 మార్చి 19న విడుదలవుతుంది.
AP: కాకినాడ జిల్లా వేట్లపాలెం పేలుడు ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది. కాకినాడ GGHలో చికిత్స పొందుతూ లోవరాజు అనే వ్యక్తి మృతి చెందడంతో సంఖ్య 22కు చేరింది. మిగిలిన తొమ్మిది మందికి చికిత్స కొనసాగుతోంది. వీరిలో ఆరుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. సామర్లకోట మార్చురీలో 11 మృతదేహాలకు పోస్ట్‌మార్టం పూర్తయింది.