• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘కార్యకర్తల క్షేమానికి ఉద్యమి సభ్యత్వ నమోదు కీలకం’

ELR: పార్టీ బలోపేతానికి, కార్యకర్తల క్షేమానికి ఉద్యమి సభ్యత్వ నమోదు కీలకమని ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు అన్నారు. బుధవారం ఉంగుటూరు శాసనసభ్యుల క్యాంపు కార్యాలయంలో భీమడోలు మండలానికి సంబంధించి ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించిన సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భీమడోలు మండలానికి చెందిన జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

February 25, 2026 / 04:46 PM IST

ప్రభుత్వ ఆసుపత్రి నీ పరిశీలించిన ఎమ్మెల్యే

KMM: సత్తుపల్లి పట్టణంలోని నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ఆసుపత్రి నీ బుధవారం సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాగమయి పరిశీలించడం జరిగింది. ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన వైద్య పరికరాల గురించి ఆమె వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మట్ట దయానంద్. సత్తుపల్లి మున్సిపల్ ఛైర్మన్ రహీనా బేగం ఎంపీడీవో ఎమ్మార్వో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

February 25, 2026 / 04:45 PM IST

ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోండి’

ATP: గుత్తిలోని ఏపీ బాలికల గురుకుల పాఠశాలలో 5వ తరగతిలో కొత్తగా ప్రవేశం కోసం 6, 7, 8 తరగతుల్లో మిగిలిపోయిన సీట్ల ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ స్వాతి బుధవారం ఆమె ఒక ప్రకటనలో తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. మార్చి 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఏప్రిల్ 24న ప్రవేశ పరీక్ష జరుగుతుందన్నారు.

February 25, 2026 / 04:45 PM IST

‘మావోయిస్టు గణపతి లొంగిపోవాలి’

‘ఆపరేషన్ కగార్’ నేపథ్యంలో మావోయిస్టు కీలక నేతలు లొంగిపోతున్నారు. ఈ క్రమంలోనే మావోయిస్టు పార్టీ అగ్రనేత గణపతికి ఆయన సోదరుడు రామచంద్రరావు కీలక విజ్ఞప్తి చేశారు. వెంటనే పోలీసుల ఎదుట లొంగిపోవాలని కోరారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఎదురుచూస్తున్నారని తెలిపారు. గణపతితో పనిచేసిన అందరూ లొంగిపోయారని వెల్లడించారు. గణపతిపై 12 రాష్ట్రాల్లో ఉన్న కేసులను ఎత్తివేయాలని కోరారు.

February 25, 2026 / 04:44 PM IST

50 మంది విద్యార్థులు గైర్హాజరు

KNR: జమ్మికుంట పట్టణంలోని మూడు కేంద్రాల్లో బుధవారం ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జనరల్ విభాగంలో 22 మంది, ఓకేషనల్‌లో 28 మంది.. మొత్తంగా 50 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. అధికారులు ‘సెట్-బి’ ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేయగా, ఎక్కడా మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదు. విద్యార్థులకు అవసరమైన అన్ని వసతులు కల్పించినట్లు తెలిపారు.

February 25, 2026 / 04:44 PM IST

మల్కాజ్‌గిరి పరిధిలో పెరిగిన దోమల బెడద

MDCL: మల్కాజ్‌గిరి పరిధిలోని బండ చెరువు, షఫీ నగర్, హనుమాన్ నగర్, మౌలాలి, భారత్ నగర్ ప్రాంతాల్లో దోమల విపరీతంగా పెరిగినట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువుల వద్ద నిల్వ నీరు, డ్రైనేజీ సమస్యల వల్ల పరిస్థితి విషమించిందని చెబుతున్నారు. వెంటనే ఫాగింగ్, యాంటీ లార్వల్ చర్యలు చేపట్టి ప్రజలను వ్యాధుల నుంచి రక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

February 25, 2026 / 04:43 PM IST

‘వెలిగొండ కోసం రూ.5,458 కోట్లు ఖర్చు చేశాం’

AP: వెలిగొండ కోసం ఇప్పటివరకు రూ.5,458 కోట్లు ఖర్చు చేశామని సీఎం చంద్రబాబు అన్నారు. ‘ఈ ప్రాజెక్టు కోసం రూ.9,081 కోట్లు అవసరం. ఈ రోజు రూ.456 కోట్లతో లైనింగ్ పనులు ప్రారంభించాం. మరో రూ.2,540 కోట్లు ఖర్చు చేస్తే అన్ని జిల్లాలకు నీళ్లు ఇవ్వొచ్చు. గత ప్రభుత్వం రూ.500 కోట్లు ఖర్చు చేసి పనులు అయిపోయాయని ప్రజలను మోసం చేశారు’ అని విమర్శించారు.

February 25, 2026 / 04:42 PM IST

మరో OTTకి నవీన్ చంద్ర హర్రర్ థ్రిల్లర్!

టాలీవుడ్ హీరో నవీన్ చంద్ర, దివ్య పిళ్లై ప్రధాన పాత్రల్లో నటించిన సైకలాజికల్ హర్రర్ థ్రిల్లర్ ‘హనీ’. కరుణ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమా సన్‌నెక్స్ట్‌లో FEB 27 నుంచి తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ సినిమా మరో OTTలోకి రాబోతుంది. అమెజాన్ ప్రైమ్‌లో కూడా FEB 27 నుంచి అందుబాటులో ఉండనుంది.

February 25, 2026 / 04:42 PM IST

ప్రకాశం జిల్లాలో మనం దెబ్బతిన్నాం: సీఎం చంద్రబాబు

ప్రకాశం: గత ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో మనం దెబ్బతిన్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. మార్కాపురంలో ఇవాళ నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. దర్శి, ఎర్రగొండపాలెంలో ఓడిపోయామని, వచ్చే ఎన్నికల్లో అన్ని సీట్లు గెలిపించే బాధ్యత మీదే అని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో మార్కాపురం జిల్లా చేస్తానని చెప్పాను, చేసి చూపించానని చెప్పుకొచ్చారు.

February 25, 2026 / 04:40 PM IST

రేపటి నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

JGL: రాయికల్ మండలంలోని ఇటిక్యాల గ్రామంలో శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు గురువారం నుంచి వైభవంగా ప్రారంభం కానున్నాయి. ధర్మకర్తలు చెన్నమనేని విష్ణువర్ధన్, వంశీవర్ధన్ ఆధ్వర్యంలో ఉత్సవాలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అర్చకులు రామకృష్ణాచార్యులు తెలిపారు. ఈనెల 26- మార్చి 5వ తేదీ వరకు ఈ వేడుకలు శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు.

February 25, 2026 / 04:40 PM IST

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

NDL: బనగానపల్లె(మం) గులాంనబిపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. బైకులో అతివేగంగా వెళుతూ.. ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో బైకులో ప్రయాణిస్తున్న యువకుడి తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు.

February 25, 2026 / 04:40 PM IST

‘మార్చి 2న చలో విజయవాడకు పిలుపు’

CTR: మార్చి 2న తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని AP అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్ యూనియన్ గౌరవాధ్యక్షుడు వాడ గంగరాజు పిలుపునిచ్చారు. బుధవారం పుంగునూరులో ఆయన మాట్లాడుతూ.. అంగన్వాడీల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం దిగి రావాలని విజ్ఞప్తి చేశారు.

February 25, 2026 / 04:39 PM IST

లక్కిరెడ్డిపల్లిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

అన్నమయ్య: లక్కిరెడ్డిపల్లి(మం) అప్పకొండయ్య గారిపల్లిలో ఉపాధి హామీ పనులు, దీన్నేపాడు గ్రామంలోని కోమటివాని వంక వాటర్‌షెడ్, రామరాజు వంక వాటర్‌షెడ్, కోనంపేట గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం, మామిడి తోట, దొర్రి చెరువు, లక్కిరెడ్డిపల్లి సాంఘిక సంక్షేమ హాస్టల్, సీసీ రోడ్ల పనులు, సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

February 25, 2026 / 04:39 PM IST

క్రీడల అభివృద్ధిపై సీఎం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు: మంత్రి

NRPT: యువజన సర్వీసులు, క్రీడల శాఖలకు సంబంధించి బడ్జెట్ కేటాయింపులపై బుధవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఉన్నతాధికారులు, సంబంధిత అధికారులతో మంత్రి వాకిటి శ్రీహరి సమీక్ష నిర్వహించారు. తెలంగాణను క్రీడారంగాన్ని అగ్రగామి నిలిపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అధికారులకు మంత్రి సూచించారు.

February 25, 2026 / 04:39 PM IST

పులివెందుల రూరల్ సీఐపై మరో కేసు నమోదు

KDP: ఏసీబీ అధికారుల దాడులలో పట్టుబడిన పులివెందుల రూరల్ సీఐ వెంకటరమణపై మరో కేసు నమోదైంది. ఏసీబీ సీఐ నాగరాజు తన సిబ్బందితో కలిసి రూరల్ సీఐ ఇంటిలో సోదాలు నిర్వహించి 59 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ బాటిళ్లను పులివెందుల ఎక్సైజ్ కార్యాలయానికి అప్పగించగా, ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ సీఐ చెన్నారెడ్డి బుధవారం తెలిపారు.

February 25, 2026 / 04:39 PM IST