TPT: శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాద్ ట్రస్టుకు రూ.10 లక్షల విరాళం అందింది. హైదరాబాద్‌కు చెందిన దాత బత్తల ఇషాన్ మహాదేవ్ కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలలోని దాతల విభాగంలో అధికారికి చెక్కును అందజేశారు. భక్తుల ఆరోగ్య సేవల కోసం ఈ విరాళాన్ని వినియోగించనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
కోనసీమ: రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ నేటి పర్యటన వివరాలను ఎమ్మెల్యే కార్యాలయం సిబ్బంది వెల్లడించారు. ఉదయం 9.30 గంటలలకు మాజీ లోకసభ స్పీకర్, దివంగత GMC.బాలయోగి వర్ధంతి సందర్భంగా దిండి Y జంక్షన్‌లో ఆయన విగ్రహానికి ఘన నివాళి అర్పిస్తారు. 10.30 గంటలకు చింతలపల్లి గ్రామంలో జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొననున్నట్లు తెలిపారు.
ప్రముఖ బల్లితెర నటి దేవిప్రియ నిన్న తెల్లవారుజామున కారులో చెన్నై నుంచి తిరుచ్చి వైపు బయల్దేరారు. పెరంబలూరు వద్ద కారు టైరు పంక్ఛర్ కావడంతో డ్రైవర్ ముత్తుగణేష్(38) కారును రోడ్డు పక్కన ఆపి టైరు మారుస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. కారులో ఉన్న ముత్తుగణేష్ అక్కడికక్కడే మృతిచెండాడు. దేవిప్రియ తృటిలో తప్పించుకున్నారు. ఆమె పీఏ దివాకర్ తీవ్రంగా గాయపడ్డాడు.
VKB: హోలీ పండుగను ప్రమాదాలకు దూరంగా, సంతోషకరమైన వాతావరణంలో జరుపుకోవాలని బంట్వారం ఎస్సై విమల సూచించారు. వేడుకల పేరుతో మహిళలు, యువతులపై బలవంతంగా రంగులు పూయడం లేదా అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, మత్తులో వాహనాలు నడిపి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదన్నారు.
KRNL: కోసిగి సుంకులమ్మ అవ్వ దేవర సందర్భంగా మండలంలోని జంపాపురంలో ఈ నెల 4, 5 తేదీల్లో రాష్ట్ర స్థాయి కబడ్డీ టోర్నమెంట్ జరగనుంది. ఈ మేరకు నిర్వాహకులు లోకేష్, హనుమంతు, బసప్ప నాయుడు, శంఖర్, శేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల జట్లు మంగళవారం సాయంత్రంలోపు పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.
సత్యసాయి: పుట్టపర్తిలో ఈ నెల 5వ తేదీన జరగాల్సిన దివ్యాంగుల మూడు చక్రాల స్కూటర్ల అర్హత ఎంపిక శిబిరం అనివార్య కారణాల వల్ల తాత్కాలికంగా రద్దు చేయబడింది. దరఖాస్తు చేసుకున్న దివ్యాంగులు ఈ మార్పును గమనించాలని జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ సూచించారు. తదుపరి తేదీని ప్రకటించే వరకు ఎవరూ పుట్టపర్తికి రావద్దని ఆయన కోరారు.
ATP: గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయాన్ని మంగళవారం చంద్రగ్రహణం సందర్భంగా మూసి వేస్తున్నట్లు ఆలయ ఈవో విజయరాజు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఇవాళ తెల్లవారుజామున 6.30 గంటల లోపల ఆలయంలో స్వామివారికి పూజలు చేసి మూసివేసి బుధవారం తెల్లవారుజామున 5 గంటలకు ఆలయాన్ని శుద్ధి, సంప్రోక్షణ చేసి స్వామివారిని భక్తులకు దర్శనం కల్పిస్తామన్నారు.
TPT: మార్చి 5వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కమిషనర్ ఎన్. మౌర్య తెలిపారు. జీవకోనలోని విశ్వం స్కూల్‌లో ఉదయం 9 గంటల నుంచి ఈమేళా జరుగనుంది. హైస్కూల్ టీచర్, ప్రి-ప్రైమరీ టీచర్, హాస్టల్ వార్డెన్, పీఆర్‌వో, ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఇంటర్వ్యూలు జరుగనున్నాయి. వయస్సు 18-35 ఏళ్లు. వేతనం రూ.15,000 నుంచి రూ.50,000 వరకు ఉంటుంది.
TPT: చంద్రగ్రహణం నేపథ్యంలో తిరుపతి జిల్లాలలోని పలు ఆలయాలను మంగళవారం మూసివేయనున్నారు. TTD ఆధ్వర్యంలోని తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు కపిలతీర్థం, శ్రీనివాసమంగాపురం, తిరుచానూరు, అప్పలాయగుంట,సూళ్లూరుపేట చెంగాళమ్మ ఆలయాలను ఉదయం 9 గంటలకు మూసి, రాత్రి 7.30 గంటలకు తెరిచి శుద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తారు. అయితే శ్రీకాళహస్తి ఆలయం మాత్రం యథావిధిగా తెరిచి ఉంచుతారు.
NDL: చంద్రగ్రహణం సందర్భంగా శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల ఆలయాన్ని ఇవాళ ఉదయం 6 గంటలకు ఉభయ దేవాలయాల ద్వారాలు వేసి, రాత్రి 7.30 గంటలకు తెరవను న్నట్లు ఈవో ఎం. శ్రీనివాసరావు తెలిపారు. సంప్రోక్షణ నిర్వహించి రాత్రి 9 గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు భక్తులను దర్శనానికి అనుమతి ఇస్తామన్నారు.
దక్షిణ సూడాన్‌లోని ఓ గ్రామంలో సాయుధులు జరిపిన దాడిలో 169 మంది మరణించారు. ప్రతిపక్ష నేత రీక్ మచర్ మద్దతుదార్లు ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. 90 మంది సాధారణ పౌరులు చనిపోయారని.. మృతుల్లో పిల్లలు, మహిళలు ఉన్నట్లు US మిషన్ వెల్లడించింది. ఈ దాడి తర్వాత వెయ్యి మంది తమను ఆశ్రయించినట్లు తెలిపింది. చర్చల ద్వారా ప్రెసిడెంట్, ప్రతిపక్ష నేతలు సంధి కుదుర్చుకోవాలని కోరింది.
HYD: MIM ఆధ్వర్యంలో సోమవారం మలక్‌పేట నియోజకవర్గంలోని అజాంపురాలోని ఫరత్నగర్ గ్రౌండ్ వద్ద దావత్-ఎ-ఇఫ్తార్ విందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దులహ్ బలాల, MLC మీర్జా రియాజ్ ఉల్ హసన్ పాల్గొన్నారు. మత పెద్దలతో కలిసి వారు (దువా) ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ముస్లింలతో కలిసి విందు ఆరగించారు.
W.G: కోకాపేటలోని అల్లు స్టూడియోలో జరిగిన నటుడు అల్లు శిరీష్ వెడ్డింగ్ వేడుకలకు ఉండి ఎమ్మెల్యే, శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణంరాజు హాజరయ్యారు. కాబోయే నూతన వధూవరులను ఆయన ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకలో రఘురామతో పాటు పలువురు రాజకీయ, సినీ రంగ ప్రముఖులు పాల్గొని సందడి చేశారు.
MBNR: జడ్చర్లలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్న విషయం తెలుసుకున్న MLA అనిరుధ్ రెడ్డి సిబ్బంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజనర్సింహతో మాట్లాడుతామన్నారు. ఘటనకు బాధ్యులైన సిబ్బంది అధికారులపై సస్పెన్షన్ వేటు వేయాలని కోరినట్లు తెలిపారు.
CTR: హోలీ సందర్భంగా జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలలకు మంగళవారం సెలవు ఇస్తున్నట్లు డీఈవో రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఎక్కడైనా పాఠశాలలు నిర్వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అకడమిక్ క్యాలెండర్‌లో సెలవు దినంగా పేర్కొన్న బుధవారం (4వ తేది) సాధారణ పనిదినంగా ఉంటుందన్నారు.