• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

మత్స్యకారులకు స్క్వేర్ మెష్ కాడ్-ఎండ్ శిక్షణ

VSP: PMMSY కింద NFDB నిధులతో CIFNETలో ‘ఫ్యాబ్రికేషన్ ఆఫ్ స్క్వేర్ మెష్ కాడ్-ఎండ్’పై ఒకరోజు నైపుణ్యాభివృద్ధి శిక్షణ శుక్రవారం ఫిషింగ్ హార్బర్ వద్ద నిర్వహించారు. మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ పి. లక్ష్మణ్‌రావు, CIFNET డిప్యూటీ డైరెక్టర్ హృసికేష్ బిసోయి ప్రారంభించారు. నిపుణులు సిద్ధాంత, ప్రాయోగిక ప్రదర్శనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 50 మంది మత్స్యకారులు పాల్గొన్నారు.

February 27, 2026 / 05:35 PM IST

‘యువత చేతిలో గ్లోబల్ కంపెనీల ఆఫర్ లెటర్లు ఉండాలి’

ప్రకాశం: కంచికచర్ల మిక్ కాలేజీలో “డ్రగ్స్ పై దండయాత్ర” కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య యువతను డ్రగ్స్ నుంచి దూరంగా ఉండాలని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ యువత చేతిలో గంజాయి కాదని, గ్లోబల్ కంపెనీల ఆఫర్ లెటర్లు ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

February 27, 2026 / 05:35 PM IST

‘JNUలో జరిగిన దాడి అమానుషం’

NLG: దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థ జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో విద్యార్థులు, అధ్యాపకులపై జరిగిన అమానుష దాడిని ఎస్‌ఎఫ్‌ఐ తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ.. శుక్రవారం దేవరకొండలో డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.

February 27, 2026 / 05:34 PM IST

సాయుధ సిబ్బందికి క్రమశిక్షణ తప్పనిసరి: SP

ADB: సాయుధ సిబ్బందికి విధులలో క్రమశిక్షణ, సమయపాలన తప్పనిసరిగా ఉండాలని జిల్లా SP అఖిల్ మహాజన్ తెలిపారు. పట్టణంలోని పోలీసు ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో సాయుధ సిబ్బందికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విశ్రాంతి గదిని వాహనాల రక్షణ నిమిత్తం ఏర్పాటు చేసిన షెడ్డును SP శుక్రవారం ప్రారంభించారు. AR DSP ఇంద్రవర్ధన్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు వెంకటి, మురళి తదితరులున్నారు.

February 27, 2026 / 05:34 PM IST

విఘ్నేశ్వరుని ఆలయ ఆదాయం రూ.2.52 లక్షలు

కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో శుక్రవారం భక్తులు చేసిన వివిధ సేవల ద్వారా రూ.2,52,464 ఆదాయం లభించిందని ఆలయ ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 236 మంది స్వామివారిని దర్శించుకున్నారని, 35 ద్విచక్ర వాహనాలకు పూజలు నిర్వహించారు అని, 2943 మంది అన్న ప్రసాదం స్వీకరించారని అన్నారు.

February 27, 2026 / 05:34 PM IST

ఎంపీని కలిసిన అంబటి మురళీకృష్ణ

GNTR: పొన్నూరు వైసీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ శుక్రవారం తాడేపల్లిలో ఆ పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్, ఎంపీ వైవీ సుబ్బారెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో అనుబంధ విభాగాల కమిటీలను త్వరితగతిన పూర్తి చేయాలని, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు అందరూ సమన్వయంతో పనిచేయాలని వైవీ సుబ్బారెడ్డి మురళీకృష్ణకు సూచించారు.

February 27, 2026 / 05:33 PM IST

రేపు పిట్లంకు ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ రాక

KMR: జుక్కల్ మండలంలోని అన్ని గ్రామాల MRPS కార్యకర్తలు ‘హలో మాదిగ-చలో పిట్లం’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని MRPS మండల అధ్యక్షుడు మారుతి పిలుపునిచ్చారు. రేపు రాష్ట్ర SC, ST కమిషన్ ఛైర్మన్ భక్కి వెంకటయ్య పిట్లం రానున్నట్లు చెప్పారు. ఎమ్మార్పీఎస్ తరఫున తమ సమస్యలు తెలిపేందుకు అందరూ తరలి వెళ్లాలన్నారు. పిట్లం మార్కెట్ యార్డ్‌లో ఉదయం 11 గంటలకు హాజరు కావాలని ఆయన కోరారు.

February 27, 2026 / 05:32 PM IST

మిడ్జిల్ మండల సర్పంచులకు ముగిసిన శిక్షణ

MBNR: మిడ్జిల్ మండలంలోని 24 గ్రామపంచాయతీలకు చెందిన నూతన సర్పంచులకు గత 5 రోజులుగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని దుర్గాబాయి దేశ్ ముఖ్ మహిళా ప్రాంగణంలో శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణ శిబిరం ఈరోజు ముగిసింది. సర్పంచులకు అధికారులు సర్టిఫికెట్ అందజేశారు. సర్పంచులు మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి అధికారుల శిక్షణ తమకు సంతృప్తిని కలిగించిందన్నారు.

February 27, 2026 / 05:32 PM IST

‘జీఐ ఆన్ వీల్స్’ కార్యక్రమం ప్రారంభం

TG: దేశంలోనే తొలిసారిగా ‘జీఐ ఆన్ వీల్స్’ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని GHMC వద్ద గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించారు. GI గుర్తింపు పొందిన కళారూపాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం, వాటిని ప్రాచుర్యంలోకి తీసుకురావడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని గవర్నర్ అన్నారు. TG యువ రాష్ట్రంగా సాంస్కృతిక గుర్తింపును బలోపేతం చేసుకోవడం అవసరమని తెలిపారు.

February 27, 2026 / 05:30 PM IST

సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎంపీ

సత్యసాయి: పెనుకొండ మండలంలోని ఎంపీ కార్యాలయంలో ఎంపీ బీకే.పార్థసారథి శుక్రవారం 10 మంది లబ్ధిదారులకు రూ.7,65,970ల విలువైన సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి మూడు నెలలకు ఒకసారి లబ్దిదారులకు సీఎం రిలీఫ్‌ అండ్‌ చెక్కులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.

February 27, 2026 / 05:30 PM IST

ఉపాధి హామీ పనులను పరిశీలించిన ఎంపీడీవో

VZM: ఎల్ కోట మండలం గొల్జాం, ఎల్‌కే‌ఎస్ పురంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఎంపీడీవో అల్లు సూర్యనారాయణ శుక్రవారం పరిశీలించారు. ఉపాధి కూలీల మష్టర్ షీట్‌ను తనిఖీ చేశారు. వేసవి సమీపిస్తున్న నేపథ్యంలో ఉపాధి కూలీలు పనిచేసిన చోట ప్రత్యేక జాగ్రత్తలు వహించాలని సూచించారు. ప్రభుత్వ కొలతలను అనుసరించి పనిచేసే అధిక ఆదాయం పొందాలని కోరారు.

February 27, 2026 / 05:30 PM IST

వివిధ గ్రామాల్లో సంచార వైద్య సేవలు

PPM: సీతానగరం మండలంలో గుమ్మడివరం, అప్పయ్యపేట గ్రామాల్లో శుక్రవారం 104 వైద్య సేవలు నిర్వహించారు. ఈ సందర్భంగా డా. పావని గర్భిణీలకు, బాలింతలకు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు పరీక్షలు నిర్వహించి నెలకు సరిపడా మందులు పంపిణీ చేశారు. సంచార చికిత్స కార్యక్రమం పై ముందురోజు గ్రామస్తులకు తెలియజేయాలని సిబ్బందికి సూచించారు.

February 27, 2026 / 05:30 PM IST

స్పిరిట్: ప్రభాస్‌ను ఢీకొట్టబోయే విలన్ ఇతడే

ప్రభాస్ హీరోగా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న హైవోల్టేజ్ యాక్షన్ డ్రామా ‘స్పిరిట్’. ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ ఒక బిగ్ అప్‌డేట్ ఇచ్చారు. ఇందులో విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ నటిస్తున్నట్లు తెలుపుతూ.. చిత్ర బృందం ఆయనకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేసింది.

February 27, 2026 / 05:28 PM IST

ప్రభాస్ ‘స్పిరిట్’లో విలన్ ఫిక్స్

ప్రభాస్ హీరోగా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న హైవోల్టేజ్ యాక్షన్ డ్రామా ‘స్పిరిట్’. ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ ఒక బిగ్ అప్‌డేట్ ఇచ్చారు. ఇందులో విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ నటిస్తున్నట్లు తెలుపుతూ.. చిత్ర బృందం ఆయనకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేసింది.

February 27, 2026 / 05:28 PM IST

రసవత్తరంగా బండ లాగుడు పోటీలు.. వీక్షించిన ఎమ్మెల్సీ

RR: కేశంపేట మండలం బైర్ ఖాన్ పల్లి గ్రామంలో లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా బండ లాగుడు పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి హాజరై పోటీలను వీక్షించారు. పోటీలలో ఎవరికి వారు విజేతలుగా నిలవాలని పెద్ద ఎత్తున పాల్గొనడంతో పోటీలు రసవత్తరంగా సాగాయి.

February 27, 2026 / 05:27 PM IST